Tiruttupayale
-
బ్రేకప్ కే బాద్!
దర్శకుడు విజయ్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలా పాల్ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కెరీర్ పరంగా ఇద్దరూ సక్సెస్ చూసినా, వ్యక్తిగత జీవితం పరంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ‘ఇదీ కారణం’ అని చెప్పలేదు కానీ, ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయారు. భర్త నుంచి బ్రేకప్ కే బాద్... కథానాయిక అమలా పాల్ ఎడాపెడా సినిమాలు సంతకాలు చేసేస్తున్నారు. తమిళ చిత్రం ‘తిరుట్టు పయలే’కి సీక్వెల్‌గా రూపొంద నున్న చిత్రంలో నటించడానికి అంగీకరించానని సోమవారం ట్విట్టర్ ద్వారా అమలా పాల్ ప్రకటించారు. మరోవైపు ‘వడ చెన్నై’ చేస్తున్నారు. అలాగే కన్నడంలో ‘హెబ్బులి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఓ మలయాళ చిత్రం కూడా అంగీకరించారు. ఇవన్నీ ఇలా ఉండగా తాజా ఖబర్ ఏమిటంటే, ఓ తెలుగు చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అమలాపాల్ సమాచారం. ‘అల్లరి’ నరేశ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని కృష్ణానగర్ కబురు. మలయాళ చిత్రం ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి ఈ తాజా తెలుగు ప్రయత్నం రీమేక్ అని భోగట్టా. దాంతో, తెలుగు సినీ పరిశ్రమలో ఈ వార్త సంచలనం అవుతోంది. ఇదే కనక నిజమైతే కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ అమలా పాల్ తెలుగులో అంగీకరించిన చిత్రం ఇదే అవుతుంది.. భర్త విజయ్ నుంచి బ్రేక్ కే బాద్ కమిట్ అయిన తొలి తెలుగు చిత్రమూ ఇదే అవుతుంది. -
తిరుట్టుపయలే సీక్వెల్లో అమలాపాల్ ?
తిరుట్టుపయలే చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. పదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన చిత్రం తిరుట్టుపయలే. అక్రమ సంబంధాలు, చిల్లర దొంగతనాలు అంటూ చర్చనీయాంశ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. సుశీగణేశన్ దర్శకత్వం వహించిన ఇందులో జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్, మాళవిక ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టెరుున్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడం, హింది భాషలలోనూ రీమేక్ అరయిందన్నది గమనార్హం. కాగా అలాంటి చిత్రానికి సీక్వెల్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. తిరుట్టుపయలే చిత్ర దర్శక నిర్మాతలే ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో జీవన్ పాత్రను నటుడు బాబీసింహా, అబ్బాస్ పాత్రను నటుడు ప్రసన్న పోషించనున్నారు. ఇక నటి సోనియా అగర్వాల్ పాత్రకు అమలాపాల్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని తెలిసింది. చర్చనీయాంశ కథా చిత్రంలో నటి అమలాపాల్ ఎలా నటించడానికి అంగీకరించారన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే ప్రారంభ దశలోనే ఈ భామ సింధూసమవెళి అనే చిత్రంలో భర్తతో కాపురం చేస్తూ మేనమామతో అక్రమ సంబంధం పెట్టుకునే యువతి పాత్రలో నటించి సంచలనం కలిగించారన్నది గుర్తుంచుకోవాలి. భర్త విజయ్ నుంచి విడిపోరుు ప్రస్తుతం నటనపైనే దృష్ట సారిస్తున్న అమలాపాల్ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వడైయచెన్నై చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం.