బ్రేకప్ కే బాద్! | Amala Paul is the female lead in Thiruttu Payale 2 | Sakshi
Sakshi News home page

బ్రేకప్ కే బాద్!

Published Tue, Nov 1 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

బ్రేకప్ కే బాద్!

బ్రేకప్ కే బాద్!

దర్శకుడు విజయ్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలా పాల్ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కెరీర్ పరంగా ఇద్దరూ సక్సెస్ చూసినా, వ్యక్తిగత జీవితం పరంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ‘ఇదీ కారణం’ అని చెప్పలేదు కానీ, ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయారు. భర్త నుంచి బ్రేకప్ కే బాద్... కథానాయిక అమలా పాల్ ఎడాపెడా సినిమాలు సంతకాలు చేసేస్తున్నారు. తమిళ చిత్రం ‘తిరుట్టు పయలే’కి సీక్వెల్‌గా రూపొంద నున్న చిత్రంలో నటించడానికి అంగీకరించానని సోమవారం ట్విట్టర్ ద్వారా అమలా పాల్ ప్రకటించారు. మరోవైపు ‘వడ చెన్నై’ చేస్తున్నారు.

అలాగే కన్నడంలో ‘హెబ్బులి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఓ మలయాళ చిత్రం కూడా అంగీకరించారు. ఇవన్నీ ఇలా ఉండగా తాజా ఖబర్ ఏమిటంటే, ఓ తెలుగు చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అమలాపాల్ సమాచారం. ‘అల్లరి’ నరేశ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని కృష్ణానగర్ కబురు.  మలయాళ చిత్రం ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి ఈ తాజా తెలుగు ప్రయత్నం రీమేక్ అని భోగట్టా. దాంతో, తెలుగు సినీ పరిశ్రమలో ఈ వార్త సంచలనం అవుతోంది. ఇదే కనక నిజమైతే కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ అమలా పాల్ తెలుగులో అంగీకరించిన చిత్రం ఇదే అవుతుంది.. భర్త విజయ్ నుంచి బ్రేక్ కే బాద్ కమిట్ అయిన తొలి తెలుగు చిత్రమూ ఇదే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement