వడాచెన్నై మొదలైంది | Dhanush begin shooting for the film Vada Chennai | Sakshi
Sakshi News home page

వడాచెన్నై మొదలైంది

Published Thu, Jul 14 2016 8:56 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

వడాచెన్నై మొదలైంది

వడాచెన్నై మొదలైంది

తమిళ స్టార్ హీరో ధనుష్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఎంతో ఆశపడి చేయాలనుకున్న వడాచెన్నై ట్రయాలజీ  ఫైనల్గా మొదలైంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఆడుకాలం సినిమాతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు వెట్రిమారన్, ఈ సినిమాకు దర్శకుడు. ఆడుకాలం రిలీజ్ తరువాత వెంటనే వడాచెన్నై సినిమాను చేయాలని ప్లాన్ చేసినా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్గా సమంతను తీసుకున్నారు. అయితే సమంత ఈ ప్రాజెక్ట్కు నో చెప్పటంతో ధనుష్ లక్కీ హీరోయిన్ అమలాపాల్ను ఫైనల్ చేశారు. ఇప్పటికే తొడరి సినిమా షూటింగ్ పూర్తి చేసిన ధనుష్ వడాచెన్నైతో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement