
ధనుష్
ఓ సినిమా హిట్ అయిందంటే ఆ కాంబినేషన్‌లో మరో చిత్రం ఎప్పుడు వస్తుందా? అనుకుంటుంటారు. ఆ కాంబినేషన్ మరోసారి కలసి పని చేస్తోందంటే ఇటు అభిమానులు, అటు ఇండస్ట్రీ కచ్చితంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అలా ఎన్నిసార్లు కలసి పని చేసినా వన్స్‌మోర్ అంటుంది. తమిళంలో అలాంటి యాక్టర్, డైరెక్టర్ కాంబినేషనే ధనుష్–వెట్రిమారన్. వీళ్ల కాంబినేషన్‌లో ‘పొల్లదావన్, ఆడుకుళం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘వడ చెన్నై’ అనే మూడు భాగాల గ్యాంగ్‌స్టర్ డ్రామాలోని ఫస్ట్ పార్ట్ ఈనెల 17న రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమా కోసం ఈ కాంబినేషన్ రిపీట్ కానుందట. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందట. సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన ‘వెక్కై’ అనే నవల అధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment