జాక్‌పాట్‌ కొట్టిన ఐశ్వర్యరాజేశ్‌ | Aishwarya Rajesh replaces Amala Paul in Dhanush’s Vada Chennai | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్‌ కొట్టిన ఐశ్వర్యరాజేశ్‌

Published Thu, Apr 20 2017 3:43 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

జాక్‌పాట్‌ కొట్టిన ఐశ్వర్యరాజేశ్‌

జాక్‌పాట్‌ కొట్టిన ఐశ్వర్యరాజేశ్‌

ఒకరు జార విడుచుకున్న అవకాశం మరొకరికి జాక్‌పాట్‌ అవుతుంది. అలాంటి లక్కీఛాన్స్‌ను నటి ఐశ్వర్యరాజేశ్‌ దక్కించుకున్నారు. కోలీవుడ్‌లో సంచలన నటి అమలాపాల్‌. నటి నయనతార మూడుసార్లు ప్రేమలో విఫలమైన తరువాత టాప్‌ కథానాయకిగా రాణిస్తుంటే, నటి అమలాపాల్‌ పెళ్లిలో విఫలమైన తరువాత కథానాయకిగా బిజీ అయ్యారు. ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

 ఎంతగా అంటే ఒప్పుకున్న చిత్రాన్నే వదులుకునేంత బిజీ అయ్యారు. ధనుష్‌తో వడచెన్నై, అరవిందస్వామికి జంటగా చదరంగవేట్టై–2, తిరుట్టుపయలే–2, భాస్కర్‌ ఒరు రాస్కెల్‌  చిత్రాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తను నటుడు ధనుష్‌ చిత్రం నుంచి వైదొలిగారు. ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో వడచెన్నై ఒకటి. వెట్ట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మొదట సమంతను కథానాయకిగా ఎంపిక చేశారు. అయితే చిత్రం ప్రారంభంలో ఆలస్యం జరగడంతో సమంత వైదొలిగారు.

 అదే విధంగా ఇందులో ధనుష్‌కు విలన్‌గా నటుడు విజయ్‌సేతుపతి నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆయన చిత్రం నుంచి బయటకు వచ్చేశారు. దీనంతటికీ కారణం వడచెన్నై చిత్ర షూటింగ్‌కు జాప్యం జరగడమేనని తెలిసింది. అయితే  చాలా కాలం క్రితమే ప్రారంభమై కొంత చిత్రీకరణ తరువాత వాయిదా పడింది. ఇటీవలే మళ్లీ మొదలైంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలను ఒప్పుకున్న నటి అమలాపాల్‌ కూడా వడచెన్నై చిత్రం నుంచి వైదొలిగారు.

ఇప్పుడా పాత్ర నటి ఐశ్వర్యరాజేశ్‌ను వరించింది. ఇది ఆమెకు పెద్ద జాక్‌పాట్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఐశ్వర్యరాజేశ్‌ తొలిసారిగా ప్రముఖ కథానాయకుడితో నటించడం ఇదే అవుతుంది. ఇప్పటి వరకూ చిన్న హీరోలతోనే నటిస్తూ వస్తున్న ఐశ్వర్య కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. అలాంటిది వడచెన్నై ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పుతుందని భావించవచ్చు. ఈ చిత్రంలో నటి ఆండ్రియా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారన్నది గమనార్హం. వేల్‌రాజ్‌ ఛాయాగ్రహణం, సంతోష్‌నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement