హీరోహీరోయిన్లకు కేరవాన్, వానిటీ వ్యాన్లు సర్వసాధారణమైపోయాయి. కొందరైతే వంటకోసం, రిలాక్స్ అవడానికి, వర్కవుట్ చేయడానికి.. ఇలా ఒక్కోదానికి ఒక్కో కేరవాన్ కూడా వాడుతున్నారు. కొన్నిసార్లు నిర్మాణ సంస్థలే వానిటీ వ్యాన్ ఏర్పాటు చేసి పెడతాయి. అయితే స్టార్ సెలబ్రిటీలు ఆ కేరవాన్‌లోకి అవతలివారిని రానివ్వరు. అందులో అమలాపాల్ కూడా ఒకరని తెలుస్తోంది. తాజాగా మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ హేమ ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ వల్ల ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
ఎర్రటి ఎండలో షూటింగ్
ఆమె మాట్లాడుతూ.. 'ఓసారి చెన్నైలో అమలాపాల్‌తో షూటింగ్‌కు వెళ్లాను. ఓ ఫ్రెండ్ ద్వారా ఆమెను కలిశానే తప్ప తనతో నాకసలు పరిచయమే లేదు. ఏప్రిల్, మే నెలలో ఎర్రటి ఎండలో షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. మేము వెళ్లిన లొకేషన్‌లో కాసేపు నీడలో కూర్చుందామంటే ఒక్క చెట్టు కూడా ఉండేది కాదు. అలా వానిటీవ్యాన్‌లో కూర్చున్నాను.
వెళ్లిపోమంది
ఆ వ్యాన్‌లో రెండు భాగాలుండేవి. ఒక వైపు ఆర్టిస్టులు మరోవైపు టెక్నీషియన్లు కూర్చోవడానికి వీలుండేది. ఓసారి అమలాపాల్ తన మేనేజర్‌ను పిలిచి మమ్మల్ని వానిటీ వ్యాన్‌లో నుంచి బయటకు వెళ్లిపోమని చెప్పింది. మేమంతా ఒకరి ముఖం మరొకరు చూసుకున్నాం. ఇంతటి ఎండలో ఎక్కడికని వెళ్తాం అనుకున్నాం.. కానీ అందులో నుంచి దిగక తప్పలేదు. ఇలాంటివి చాలానే జరిగాయి.
మమ్మల్ని లెక్క చేయరు
మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టు వంటి వారు వ్యాన్‌లోకి రాకూడదని సౌత్ ఇండస్ట్రీలో ఏదైనా రూల్ ఉందేమో మరి! మమ్మల్ని వారసలు లెక్క చేయరు. అలాంటప్పుడు మేమెలా పరిచయం చేసుకుంటాం. టబు వంటి స్టార్స్‌తో కలిసి పని చేశామని ఎలా చెప్పగలం? మా లాంటి వారికోసం టబు వ్యాన్ అంతా బుక్ చేసేది. ఎంతో బాగా చూసుకునేది' అని చెప్పుకొచ్చింది.
చదవండి: అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం!
Comments
Please login to add a commentAdd a comment