హీరోయిన్ అమలాపాల్ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రియుడు, ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేరళలోని కొచ్చిలో ఆదివారం (నవంబర్ 5న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను నూతన వధూవరులిద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తమ పెళ్లి ఫోటోలను సైతం పంచుకున్నారు.
'రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను' అని తమ పోస్టుకు క్యాప్షన్ జోడించారు. ఈ పెళ్లి వేడుకలో అమలాపాల్ లావెండర్ కలర్ లెహంగా ధరించింది. జగత్ కూడా ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండర్ కలర్ షేర్వాణీ వేసుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారగా సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా ఇటీవల అమలాపాల్ బర్త్‌డే (అక్టోబర్ 26న) రోజు జగత్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. బర్త్‌డే పార్టీలో మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అందరి ముందే అడిగేశాడు.
మొదట సర్‌ప్రైజ్ అయిన అమలాపాల్ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పేసింది. దీంతో ఆ క్షణమే హీరోయిన్‌కు ఉంగరం తొడిగి పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే అమలాపాల్ 2014లో తమిళ దర్శకనిర్మాత ఏఎల్ విజయ్‌ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో విడిపోవడమే మంచిదని నిర్ణయానికొచ్చారు. 2017లో విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment