కెరీర్, పర్సనల్ విషయాల్లో కొందరు హీరోయిన్లు ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటుంటారు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలని పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఈమెకు కవలలకు జన్మనిచ్చిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే అసలు నిజం ఏంటి?
(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ)
కేరళకు చెందిన అమలా పాల్.. 2009 నుంచి ఇండస్ట్రీలో ఉంది. బెజవాడ, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. 'నాన్న' అనే తమిళ మూవీ చేస్తున్న టైంలోనే ఆ చిత్ర దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ మూడేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న ఈమె గతేడాది నవంబరులో జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న తను గర్భంతో ఉన్నానని ప్రకటించిన అమలా పాల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉన్న అమలా పాల్ తాజాగా ట్విన్స్‌కి జన్మనిచ్చిందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోయింది. కానీ అలాంటిదేం లేదని, ఇంకా ప్రసవమే జరగలేదని తెలిసింది. కవలలు పుట్టడం అనేది కేవలం రూమర్ మాత్రమేనని తేలింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment