మన తప్పులు తెలుసుకుంటే... | Nani's Janda Pai Kapiraju releasing on March 21 | Sakshi
Sakshi News home page

మన తప్పులు తెలుసుకుంటే...

Published Sun, Mar 8 2015 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

మన తప్పులు తెలుసుకుంటే...

మన తప్పులు తెలుసుకుంటే...

మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటే ప్రపంచాన్నే మార్చగలం అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక. సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మల్టీ డెమైన్షన్ పతాకంపై రజత్ పార్థసారథి, ఎస్. శ్రీనివాసన్‌లు నిర్మించారు. ఉగాది పండగ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కన్నా ఈ సినిమాకు ఎక్కువ కష్టపడ్డాను. ప్రివ్యూ చూసుకున్నాక చాలా గర్వంగా అనిపించింది. ఇంత మంచి అవకాశమిచ్చిన సముద్రఖనిగారికి నా కృతజ్ఞతలు’’ అని  చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement