janda pai kapiraju
-
మనం మారాలి..!
ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. మల్టీడెమైన్షన్ ఎంటర్‌ైటె న్మెంట్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్.శ్రీనివాసన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పి. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నాని కెరీర్లో చాలా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించాం. చాలా వైవిధ్యమైన సినిమా ఇది. సామాజిక ఇతివృత్తాన్ని చాలా వినోదభరితంగా దర్శకుడు తెరకెక్కించారు’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, రాగిణి ద్వివేది, ఆహుతి ప్రసాద్, ప్రత్యేక పాత్రలో శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సమర్పణ: పి. రామ్మోహనరావు. -
మన తప్పులు తెలుసుకుంటే...
మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటే ప్రపంచాన్నే మార్చగలం అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక. సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మల్టీ డెమైన్షన్ పతాకంపై రజత్ పార్థసారథి, ఎస్. శ్రీనివాసన్‌లు నిర్మించారు. ఉగాది పండగ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కన్నా ఈ సినిమాకు ఎక్కువ కష్టపడ్డాను. ప్రివ్యూ చూసుకున్నాక చాలా గర్వంగా అనిపించింది. ఇంత మంచి అవకాశమిచ్చిన సముద్రఖనిగారికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. -
జెండా ఎగరేస్తారట!
ప్రతి వ్యక్తి.. తనను తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే అనే అంశానికి వినోదాన్ని మేళవించిన రూపొందించిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్, రాగిణీ ద్వివేదీ కథానాయికలు. సముద్రఖని దర్శకుడు. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘నాని రెండు పాత్రల్లో అద్భుతమైన వైవిధ్యం కనబరిచారు. శరత్‌కుమార్ పోషించిన సీబీఐ అధికారి పాత్ర సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, కెమెరా: సుకుమార్. -
మనసు నిండిపోయింది...
‘‘మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం మొత్తం సరి అవుతుంది అనే మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. నా కెరీర్లో ‘జెండాపై కపిరాజు’ ప్రత్యేకమైన సినిమా. ఇందులో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాను’’ అని నాని అన్నారు. ఆయన కథానాయకునిగా పి.సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. మల్టీడైమన్షన్స్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్ శ్రీనివాసన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ -‘‘మూడ్రోజుల క్రితం సినిమా మొత్తం చూశాను. మనసు నిండిపోయింది. ఏదో మంచి పని చేసిన ఫీలింగ్. సామాజిక దృక్పథంతో సాగే ఇలాంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది. సముద్రఖని అద్భుతంగా సినిమాను మలిచారు. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే మూడు నిమిషాల ఫైట్ కోసం ఇరవై నాలుగు రోజులు కష్టపడ్డాం’’ అని చెప్పారు. అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని ‘మల్టీడైమన్షన్’ వాసు తెలిపారు. -
నాని సూపర్...!
ప్రతి వ్యక్తి తనను తాను సంస్కరించుకుంటే, దేశాన్ని సంస్కరించుకున్నట్టే. ఈ నేపథ్యంలో ‘జెండాపై కపిరాజు’ చిత్రం రూపొందింది. నాని తొలిసారి ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. సముద్ర ఖని దర్శకుడు. మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. పతాకంపై రజిత్ పార్థసారథి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలు చేసిన సముద్రఖని చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువతకు నచ్చే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నాని పాత్రల చిత్రణ సూపర్‌గా ఉంటుంది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ పోషించిన పాత్ర ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. అమలాపాల్, రాగిణి ద్వివేది నాయికలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సుకుమార్. -
ప్రేమికుల రోజుకి సిద్ధం!
మనల్ని మనం సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే. దర్శకుడు సముద్రఖని ఈ నేపథ్యంలో ‘జెండాపై కపిరాజు’ని ఎగురవేస్తున్నారు. నాని తొలిసారి ఇందులో డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. కె.ఎస్. శ్రీనివాసన్, కె.ఎస్. శివరామన్, రజిత్ పార్ధసారధి నిర్మిస్తున్నారు. అమలాపాల్, రాగిణి కథానాయికలు. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 14న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. వినోదం, సందేశం ఉన్న చిత్రం ఇది. రెండు పాత్రల్లో నాని అద్భుతంగా నటించారు. శరత్‌కుమార్ చేసిన సీబీఐ ఆఫీసర్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. -
నా కెరీర్లో గుర్తుండిపోయే జెండాపై కపిరాజు -నాని
‘‘ఇరవై, ముప్ఫై ఏళ్ల అనుభవం ఉన్న నటులు మాత్రమే చేయగలిగే ఫీట్‌ని... అతి తక్కువ సమయంలో చేసే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా చిక్కింది. అది నిజంగా నా అదృష్టం. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘జెండాపై కపిరాజు’’’ అని నాని అన్నారు. సముద్రఖని దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అమలాపాల్, రాగిణి కథానాయికలు. కె.ఎస్.శ్రీనివాసన్, శివరామన్ నిర్మాతలు. జీవి ప్రకాష్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వి.వి.వినాయక్ ఆడియో సీడీని ఆవిష్కరించి, నాని తండ్రి రాంబాబుకి అందించారు. ఈ సందర్భంగా నాని ఇంకా మాట్లాడుతూ- ‘‘‘ఆహా కల్యాణం’ షూటింగ్ కారణంగా ఈ సినిమాకు ఆడపాదడపా అంతరాయాలు ఏర్పడినా... సముద్రఖని భరించారు. నా నుంచి ఉత్తమమైన నటన రాబట్టడానికి ఎంతో శ్రమించారు. నా నటన వల్ల ఈ సినిమా తెలుగులో వంద రోజులు ఆడితే... ‘జయం’రవి పెర్ఫార్మెన్స్కు తమిళంలో 175 రోజులు ఆడుతుంది’’ అని చెప్పారు. ‘‘నేను ప్రొడ్యూసర్ కొడుకుని. హీరో అవ్వడం నాకు పెద్ద విషయం కాదు. కానీ ఎలాంటి నేపథ్యం లేకుండా నాని హీరోగా ఎదిగాడు. దాని వెనుక ఎంతో కృషి ఉంది. సినిమానే శ్వాసిస్తాడు తను. సినిమా కోసమే పుట్టాడా అనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అని ‘జయం’ రవి విశ్వాసం వెలిబుచ్చారు. చేసే పని పట్ల నానీ చూపించే నిబద్ధత చాలా గొప్పదని, భవిష్యత్తులో గొప్ప హీరో అవుతాడని సముద్రఖని కొనియాడారు. మంచి కథ, అందుకు తగ్గట్టు శక్తిమంతమైన టైటిల్, అన్నింటికంటే ముఖ్యంగా మంచి యూనిట్ కుదిరింది. కాబట్టి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించడం తథ్యం అని నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాసన్ తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, సి.కల్యాణ్, ఆర్.కె.సెల్వమణి, తనికెళ్ల భరణి, కె.ఎల్.దామోదరప్రసాద్, మల్టీ డైమన్షన్ వాసు, రజత్ పార్థసారథి, డీఎస్‌రావు, రాజ్, డీకె, పైడిపల్లి వంశీ, సంతోష్ శ్రీనివాస్, అల్లరి నరేష్, శర్వానంద్, వరుణ్‌సందేశ్, నిఖిల్, సుధీర్‌బాబు, శివబాలాజీ, టి.ప్రసన్నకుమార్, మధుమిత, రాగిణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘జెండాపై కపిరాజు’ ఆడియో
-
ఆ చింతనే ఎక్కువ
నాకు ఆ చింతన అధికం అయ్యింది అంటోంది నటి అమలాపాల్. ఇంతకు ఈ భామ ఏ విషయం గురించి చెబుతోందో తెలుసుకోవాలంటే చదవండి. తలైవా చిత్రం తరువాత అమలాపాల్ నటిస్తున్న చిత్రం నిమిర్న్దునిల్. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోను అమలాపాలే హీరోయిన్. తమిళంలో జయంరవి, తెలుగులో నాని హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రకని దర్శకుడు. అమలాపాల్ మాట్లాడుతూ తాను నటించిన చిత్రాల్లో నిమిర్న్దు నిల్ చాలా ముఖ్యమైందని పేర్కొంది. దర్శకుడు సముద్రకనికి సామాజిక చింతనే అధికమట. ఆయన పక్కనే కూర్చుంటే సమాజంలో జరుగుతున్న విషయాల గురించే చెబుతుంటారట. నిమిర్న్దు నిల్ చిత్రంలో నటించిన తరువాత తనకూ సామాజిక చింతన అధికం అయ్యిందని పేర్కొంది. అయితే ఇలా దర్శకున్ని పొగడ్తల్లో ముంచేసి ఆయన చిత్రంలో మళ్లీ అవకాశం కొట్టేయాలని చూస్తోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం అమలాపాల్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. టాలీవుడ్లో పాగా వేయాలని ఆశించినా ఇప్పుడక్కడ అవకాశాల్లేవు. దీంతో పొగడ్తల పురాణం మొదలెట్టిందంటున్నారు సినీ పండితులు. నిజానికి ఈ కేరళ కుట్టీకిప్పుడు ఒక హిట్ చాలా అవసరం. -
‘జెండాపై కపిరాజు’ రెడీ
ప్రతివ్యక్తి తనను తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే అనే సందేశంతో రూపొందుతోన్న చిత్రం ‘జెండాపై కపిరాజు’ నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక. సముద్రఖని దర్శకుడు. కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎన్.శివరామ్ నిర్మాతలు. శరత్‌కుమార్ సీబీఐ అధికారిగా ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఉత్కంఠ, వినోదం, సందేశం... మేలు కలయిక ఈ సినిమా. భావోద్వేగపూరితంగా కథ, కథనాలు సాగుతాయి. ఈ నెలాఖరున పాటలను, జనవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జీవి ప్రకాష్‌కుమార్, కెమెరా: సుకుమార్, ఎడిటింగ్: ఫాజిల్. -
స్టార్ కావాలని ఇక్కడికి రాలేదు : అమలాపాల్
‘‘స్టార్ అనిపించుకోవడానికి నేను ఈ రంగంలోకి రాలేదు’’ అంటున్నారు అమలాపాల్. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ- ‘‘నాకు నటన అంటే ఇష్టం. రకరకాల పాత్రలు చేయాలని ఉంది. నటిగా ఎదగాలని ఉంది. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను తప్ప స్టార్ అవ్వాలని మాత్రం కాదు. మంచి పాత్రలు రావాలంటే ముందు గుర్తింపు కావాలి. అందుకే గ్లామర్ పాత్రలు కూడా ఒప్పుకోవాల్సి వస్తోంది’’ అన్నారు అమలాపాల్. సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న ‘జెండాపై కపిరాజు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘ఎలాంటి పాత్ర కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశానో అలాంటి పాత్రను ‘జెండాపై కపిరాజు’లో చేస్తున్నాను. నా కెరీర్లో ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో నాకు నచ్చిన పాత్ర ‘మైనా’ సినిమాలోనిది. ఆ పాత్రకంటే గొప్ప పాత్ర ‘జెండాపై కపిరాజు’లో చేస్తున్నాను. సముద్రఖని దర్శకత్వంలో నటించడం మరిచిపోలేని అనుభవం. నా క్యారెక్టర్ని చాలా గొప్పగా డిజైన్ చేశారాయన. తమిళంలో కూడా ఈ సినిమా తీస్తున్నారు. సినిమా పేరు ‘నిమిరిందునిల్’. జయం రవి హీరో. హీరోయిన్ మాత్రం నేనే. ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని నా నమ్మకం. అలాగే తమిళ్లో ధనుష్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్