స్టార్ కావాలని ఇక్కడికి రాలేదు : అమలాపాల్ | iwon't think to become as star :amala paul | Sakshi
Sakshi News home page

స్టార్ కావాలని ఇక్కడికి రాలేదు : అమలాపాల్

Published Fri, Nov 15 2013 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

స్టార్ కావాలని ఇక్కడికి రాలేదు :  అమలాపాల్

స్టార్ కావాలని ఇక్కడికి రాలేదు : అమలాపాల్

 ‘‘స్టార్ అనిపించుకోవడానికి నేను ఈ రంగంలోకి రాలేదు’’ అంటున్నారు అమలాపాల్. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ- ‘‘నాకు నటన అంటే ఇష్టం. రకరకాల పాత్రలు చేయాలని ఉంది. నటిగా ఎదగాలని ఉంది. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను తప్ప స్టార్ అవ్వాలని మాత్రం కాదు. మంచి పాత్రలు రావాలంటే ముందు గుర్తింపు కావాలి. అందుకే గ్లామర్ పాత్రలు కూడా ఒప్పుకోవాల్సి వస్తోంది’’ అన్నారు అమలాపాల్. సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న ‘జెండాపై కపిరాజు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘ఎలాంటి పాత్ర కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశానో అలాంటి పాత్రను ‘జెండాపై కపిరాజు’లో చేస్తున్నాను.
 
  నా కెరీర్‌లో ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో నాకు నచ్చిన పాత్ర ‘మైనా’ సినిమాలోనిది. ఆ పాత్రకంటే గొప్ప పాత్ర ‘జెండాపై కపిరాజు’లో చేస్తున్నాను. సముద్రఖని దర్శకత్వంలో నటించడం మరిచిపోలేని అనుభవం. నా క్యారెక్టర్‌ని చాలా గొప్పగా డిజైన్ చేశారాయన. తమిళంలో కూడా ఈ సినిమా తీస్తున్నారు. సినిమా పేరు ‘నిమిరిందునిల్’. జయం రవి హీరో. హీరోయిన్ మాత్రం నేనే. ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని నా నమ్మకం. అలాగే తమిళ్‌లో ధనుష్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement