జెండా ఎగరేస్తారట! | Nani Dual role in Janda Pai Kapiraju | Sakshi
Sakshi News home page

జెండా ఎగరేస్తారట!

Published Tue, Nov 11 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

జెండా ఎగరేస్తారట!

జెండా ఎగరేస్తారట!

ప్రతి వ్యక్తి.. తనను తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే అనే అంశానికి వినోదాన్ని మేళవించిన రూపొందించిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్, రాగిణీ ద్వివేదీ కథానాయికలు. సముద్రఖని దర్శకుడు. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘నాని రెండు పాత్రల్లో అద్భుతమైన వైవిధ్యం కనబరిచారు. శరత్‌కుమార్ పోషించిన సీబీఐ అధికారి పాత్ర సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, కెమెరా: సుకుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement