ప్రేమికుల రోజుకి సిద్ధం!
ప్రేమికుల రోజుకి సిద్ధం!
Published Tue, Jan 21 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
మనల్ని మనం సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే. దర్శకుడు సముద్రఖని ఈ నేపథ్యంలో ‘జెండాపై కపిరాజు’ని ఎగురవేస్తున్నారు. నాని తొలిసారి ఇందులో డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. కె.ఎస్. శ్రీనివాసన్, కె.ఎస్. శివరామన్, రజిత్ పార్ధసారధి నిర్మిస్తున్నారు. అమలాపాల్, రాగిణి కథానాయికలు. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 14న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. వినోదం, సందేశం ఉన్న చిత్రం ఇది. రెండు పాత్రల్లో నాని అద్భుతంగా నటించారు. శరత్‌కుమార్ చేసిన సీబీఐ ఆఫీసర్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు.
Advertisement
Advertisement