Dual Roles
-
డబుల్ ధమాకా
ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హీరోయిన్ వైష్ణవీ చైతన్య. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’లో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తెలుగమ్మాయి అయిన వైష్ణవీ చైతన్య కెరీర్ ప్రారంభంలో ‘లవ్ ఇన్ 143 అవర్స్’, ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘అరెరే మానస’, ‘మిస్సమ్మ’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు.ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆమె ‘బేబీ’(2023) మూవీతో హీరోయిన్గా మారారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో ఆడియన్స్ లో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న వైష్ణవీ చైతన్య ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేశారు. అదేవిధంగా ‘90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు వైష్ణవి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న స్టార్ హీరోలు
అభిమాన హీరో ఒక పాత్రలో కనిపించి సింగిల్ ట్రీట్ ఇస్తేనే అభిమానులు ఖుషీ అయిపోతారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే పట్టరాని ఆనందం వారి సొంతం. అలా డబుల్ రోల్లో కనిపించి, డబుల్ ట్రీట్ ఇవ్వడానికి కొందరు హీరోలు రెడీ అయ్యారు. ఆ స్టార్స్ చేస్తున్న ద్విపాత్రాభినయం గురించి తెలుసుకుందాం ► రెండు, మూడు, నాలుగు, పది... ఇలా ఒకే సినిమాలో ఎన్ని పాత్రల్లో అయినా మెప్పించగలరు కమల్‌హాసన్. అలా సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతిగా ‘ఇండియన్’ (భారతీయుడు) లో కమల్ రెండు పాత్రల్లో మెప్పించిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో 1996లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సేనాపతి, అతని తండ్రి పాత్ర నేపథ్యంలో ఉంటుంది. అంటే.. సేనాపతికి అంత దేశభక్తి రావడానికి అతని తండ్రి ఎలా కారణం అయ్యాడు? అనేది ఈ చిత్రంలో ఉంటుందట. 1920లలో కథ సాగడంతో పాటు ఇప్పటికాలం టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. ఇక తాజా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా నటిస్తున్నారు. ►‘సలార్’ సినిమా తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’తో ప్రభాస్ మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పాత్రలో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే డబుల్ ధమాకానే. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’లో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. తండ్రీ కొడుకుగా ప్రభాస్ కనిపించే సీన్స్ సరికొత్త అనుభూతిని పంచుతాయని టాక్. ప్రత్యేకించి 1000 మందితో ఫైట్ చేసే ఒక యాక్షన్ సీన్లో ప్రభాస్ రెండో పాత్ర (తండ్రి) ఎంట్రీ ఉంటుందని సమాచారం. ‘సలార్’ తొలి భాగంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేశారు. రెండో భాగంలో పృథ్వీరాజ్ కూడా రెండు పాత్రల్లో కనిపిస్తారట. తొలి భాగంలో ఉన్న బాబీ సింహా, శ్రియా రెడ్డి తదితరులు మలి భాగంలోనూ కనిపిస్తారు. ► ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ‘దేవర’ సినిమా గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర చేస్తు్తన్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ అక్టోబర్ 10న విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో, నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. ఎన్టీఆర్ తండ్రీకొడుకుగా సందడి చేస్తారని భోగట్టా. యాక్షన్, ఎమోషన్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే గతంలో ‘ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్’ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’లో త్రిపాత్రాభినయంతో మెప్పించిన విషయం తెలిసిందే. ► ఒక్క సినిమాలో కాదు.. వరుసగా రెండు చిత్రాల్లో రామ్‌చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఒకటి శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా. మరొకటి బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం. ఇక రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే... సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తండ్రీ కొడుకుగా కనిపిస్తారని భోగట్టా. తనయుడి పాత్రలో ఎన్నికల అధికారిగా, తండ్రి పాత్రలో రాజకీయ నేతగా కనిపించనున్నారట. రెండో పాత్రకు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటికొచ్చాయి. అందులో చరణ్ 70ల్లో వ్యక్తిగా ఖద్దరు వస్త్రాలు ధరించి సైకిల్‌పై వెళుతూ కనిపించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ ప్రత్యేక పాత్రధారులు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇక బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌చరణ్ చేస్తున్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ అన్న, తమ్ముడు పాత్రల్లో కనిపించనున్నారట. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. కాగా ‘మగధీర, నాయక్’ చిత్రాల్లో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. - పోడూరి నాగ ఆంజనేయులు -
డ్యూయల్ రోల్స్‌తో శభాష్ అనిపించుకున్న కథానాయికలు
-
ప్రతి హీరోకి డ్యూయల్ రోల్ ఒక ఛాలెంజ్
-
గుర్తుపట్టారా?
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? పట్టకపోయినా నో ప్రాబ్లమ్. చెప్పడానికి మేం ఉన్నాం కదా. చిన్న క్లూ. తను లేడీ సూపర్ స్టార్. సూపర్ స్టార్ సినిమాతోనే ఈ తారకి కథానాయికగా సూపర్ స్థాయి వచ్చింది. ఆ తార నయనతార. రజనీకాంత్ సరసన ‘చంద్రముఖి’లో నటించాక నయన కెరీర్ వేగం పుంజుకుంది. ఆ సినిమాలో బొద్దుగా కనిపించి, ఆ తర్వాత ఎవరూ ఊహించనంత సన్నబడిపోయారామె. క్రేజీ హీరోయిన్గా ముందుకు దూసుకెళ్తున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలు.. కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు ‘ఐరా’ సినిమా కోసం అలానే మారారు. ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారు నయనతార. ఒక పాత్రలో నల్ల పిల్లలా కనిపించనున్నారు. ఇక్కడున్న ఫొటో ఈ పాత్రకు సంబంధించినదే. నల్ల మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు కదూ. ‘ఐరా’ అంటే సినిమాలో నయనతార పాత్ర పేరు కాదు. ఇంద్రుడి వాహనం ఐరావతం పేరుని పెట్టారు. ఐరావతం అంత శక్తిమంతంగా ఈ చిత్రంలో నయనతార పాత్ర ఉంటుందని, అందుకే టైటిల్ అలా పెట్టామని చిత్రదర్శకుడు సర్జున్ పేర్కొన్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. -
నాలో ఉన్న దాన్ని వాడుకోండి
నాలో ఉన్న ప్రతిభను వాడుకోండి అంటున్నారు నటి సమంత. తొలి రోజుల్లో తమిళంలో చిత్ర పరిశ్రమలో నిరాశకు గురైనా తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుని విజయాన్ని అందుకున్న నటి సమంత. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు సినీ ప్రియుల గుండెలను గుల్ల చేసిన ఈ చెన్నై చిన్నది ఆ తరువాత అక్కడ వరుసగా విజయాలు అందుకున్నారు. ఈ వేగానికి ఒక దశలో అప్పటి వరకు టాప్ గేర్‌లో వెళుతున్న కాజల్ అగర్వాల్, అనుష్క లాంటి వారు కూడా ఖంగు తిన్నారు. అలా తెలుగులో ప్రముఖ హీరోయిన్ స్థానాన్ని అధిరోహించిన సమంత కత్తి చిత్రంతో సొంత గడ్డపైన సక్సెస్ సాధించారు. ప్రస్తుతం విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎండ్రదుకుళే చిత్రం విడుదల కోసం సమంత ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తొలి ద్విపాత్రాభినయం: గోలీసోడా వంటి చిన్న చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తి పెద్ద విజయాన్ని సాధించిన ఛాయాగ్రాహకుడు వేల్రాజ్ తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పత్తు ఎండ్రతుకుళే. ఈ చిత్రంలో సమంత ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఒక పాత్రలో అందాలను, మరో పాత్రలో అభినయాన్ని ఇరగదీశారట. సమంత నటనను చూసి విక్రమ్ కూడా విస్మయం చెందారట. దీంతో తనలోని మంచి నటి వున్న విషయాన్ని గ్రహించిన సమంత తనకు కథ వినిపించడానికి వచ్చే దర్శకులతో గ్లామర్‌తో పాటు తనలోని నటనా ప్రతిభను వాడుకోవడానికి ప్రయత్నించండి అంటూ క్లాస్ పీకుతున్నారట. త్వరలో విజయ్, సూర్య, ధనుష్, ఉదయనిధి స్టాలిన్ అంటూ స్టార్ హీరోలందరితోనూ నటించడానికి సిద్ధం అవుతున్న సమంత ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు పేర్కొన్నారు. -
జెండా ఎగరేస్తారట!
ప్రతి వ్యక్తి.. తనను తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే అనే అంశానికి వినోదాన్ని మేళవించిన రూపొందించిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్, రాగిణీ ద్వివేదీ కథానాయికలు. సముద్రఖని దర్శకుడు. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘నాని రెండు పాత్రల్లో అద్భుతమైన వైవిధ్యం కనబరిచారు. శరత్‌కుమార్ పోషించిన సీబీఐ అధికారి పాత్ర సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, కెమెరా: సుకుమార్.