నాలో ఉన్న దాన్ని వాడుకోండి | 'Dual roles for Samantha in Pathu Endrathukulla | Sakshi
Sakshi News home page

నాలో ఉన్న దాన్ని వాడుకోండి

Published Tue, Apr 21 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

నాలో ఉన్న దాన్ని వాడుకోండి

నాలో ఉన్న దాన్ని వాడుకోండి

 నాలో ఉన్న ప్రతిభను వాడుకోండి అంటున్నారు నటి సమంత. తొలి రోజుల్లో తమిళంలో చిత్ర పరిశ్రమలో నిరాశకు గురైనా తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుని విజయాన్ని అందుకున్న నటి సమంత. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు సినీ ప్రియుల గుండెలను గుల్ల చేసిన ఈ చెన్నై చిన్నది ఆ తరువాత అక్కడ వరుసగా విజయాలు అందుకున్నారు. ఈ వేగానికి ఒక దశలో అప్పటి వరకు టాప్ గేర్‌లో వెళుతున్న కాజల్ అగర్వాల్, అనుష్క లాంటి వారు కూడా ఖంగు తిన్నారు. అలా తెలుగులో ప్రముఖ హీరోయిన్ స్థానాన్ని అధిరోహించిన సమంత కత్తి చిత్రంతో సొంత గడ్డపైన సక్సెస్ సాధించారు. ప్రస్తుతం విక్రమ్ సరసన నటిస్తున్న పత్తు ఎండ్రదుకుళే చిత్రం విడుదల కోసం సమంత ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
 
 తొలి ద్విపాత్రాభినయం: గోలీసోడా వంటి చిన్న చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తి పెద్ద విజయాన్ని సాధించిన ఛాయాగ్రాహకుడు వేల్‌రాజ్ తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పత్తు ఎండ్రతుకుళే. ఈ చిత్రంలో సమంత ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఒక పాత్రలో అందాలను, మరో పాత్రలో అభినయాన్ని ఇరగదీశారట. సమంత నటనను చూసి విక్రమ్ కూడా విస్మయం చెందారట. దీంతో తనలోని మంచి నటి వున్న విషయాన్ని గ్రహించిన సమంత తనకు కథ వినిపించడానికి వచ్చే దర్శకులతో గ్లామర్‌తో పాటు తనలోని నటనా ప్రతిభను వాడుకోవడానికి ప్రయత్నించండి అంటూ క్లాస్ పీకుతున్నారట. త్వరలో విజయ్, సూర్య, ధనుష్, ఉదయనిధి స్టాలిన్ అంటూ స్టార్ హీరోలందరితోనూ నటించడానికి సిద్ధం అవుతున్న సమంత ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement