నా చిత్రాలు చూడను | I do not see the pictures | Sakshi
Sakshi News home page

నా చిత్రాలు చూడను

Sep 2 2015 3:12 AM | Updated on Sep 3 2017 8:33 AM

నా చిత్రాలు చూడను

నా చిత్రాలు చూడను

నేను నటించిన చిత్రాలు నేను చూడను. అలా చూడడానికి ఇష్టపడను.

నేను నటించిన చిత్రాలు నేను చూడను. అలా చూడడానికి ఇష్టపడను. అందుకు కారణం కూడా చెబుతాను. నేను చిత్రం చూస్తున్నప్పుడు ఎవరైనా నా నటన బాగోలేదని అంటారేమోనని భయం. ఇక నా పాత్రను దర్శకుడికి సంతృప్తి కలిగే వరకూ నటిస్తాను.నటుడు విక్రమ్ సరసన 10 ఎండ్రదుకుళ్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం.నేనింతకు ముందెప్పుడు చేయనటువంటి పాత్రను ఇందులో పోషించాను.అందుకే ఈ చిత్రం చూడాలనకుంటున్నాను.తొలి రోజుల్లో నేను నటించిన తమిళ చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు.విన్నైతాండి వరువాయా తెలుగు రీమేక్‌లో నేను నటించాను.అది అక్కడ పెద్ద హిట్ అయ్యింది.ఆ తరువాత వరుస విజయాలు అందుకున్నాను.

ఒక చిత్రం ఫ్లాప్ అయితే నిరాశపడుతూ కూర్చుంటే మిగిలేది చింతే. అందుకే జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను. అలాంటివి చాలా చూశాను. తమిళం,తెలుగు భాషలలో మంచి అవకాశాలతో విశ్రాంతి లేకుండా నటిస్తున్నాను.గ్యాప్ వస్తే అపజయాల ఆలోచనలతో ఏడవాల్సి వస్తుంది.నాకు అలాంటి అవకాశం లేకుండా తమిళం,తెలుగు భాషలలో మంచి అవకాశాలు వస్తున్నాయి అందులో కథాపాత్రకు తగ్గట్టుగా ఆలోచిస్తూ నటిస్తున్నాను.మరిన్ని విజయాలు వరిస్తాయనే నమ్మకం ఉంది అని అంటున్నారు నటి సమంత.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement