Tamil films
-
హీరోయిన్ ‘అతుల్య రవి’ క్యూట్ లుక్స్ ( ఫోటోలు )
-
తంబీ.. సినిమా కామిక్కిరెన్
జీఎస్టీపై తూటాల్లా పేలే మాటలతో ‘మెర్సెల్’.. ఒక్క ఓటు కోసం వ్యవస్థపైనే తిరుగుబాటు చేసిన ‘సర్కార్’.. అంటరాని వసంతానికి తెర మీద జరిగిన సెలబ్రేషన్ ‘కాలా’.. .. ఇవే కాదు, వ్యవస్థలోని లోటుపాట్లపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ, కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తూ, విమర్శనాత్మకంగా, సందేశాత్మకంగా ప్రభుత్వ వ్యతిరేకతపై గళమెత్తి మిర్చీ ఘాటులా ఉక్కిరిబిక్కిరి చేసిన చిత్రాలెన్నో తమిళనాట ‘సినిమా కామిక్కిరెన్’ (సినిమా చూపిస్త..) అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. మోదీకి మద్దతుగా బాలీవుడ్లో వచ్చిన సినిమాల కన్నా, ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిలో మూడేళ్లలో కోలీవుడ్‌లో వచ్చిన డజనుకి పైగా సినిమాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. నిర్మాతలకు కాసులు కురిపించిన ఇవి.. ప్రతిపక్ష డీఎంకేకు ఓట్లు కురిపిస్తాయా?. ఎల్కేజీ, జోకర్, మెర్సెల్, ఇరుంబుతిరాయ్, తమిళ్ పాదం–2, నత్పే తున్నాయ్–2, కాలా, సర్కార్, ఉరియాడి.. మూడేళ్లలో కోలీవుడ్‌లో విడుదలైన సినిమాలివి. సమకాలీన రాజకీయాలపై, వ్యవస్థలో లోపాలపై వెండితెర గురి తప్పని షూటింగ్ ఇది. ఈ సినిమాలు తమిళ గడ్డపై మోదీ వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాయన్నది వాస్తవం. అది ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. కేంద్రమే టార్గెట్.. నిరసనకారులందరూ రోడ్డెక్కి తమ గళం వినిపిస్తూ ఉంటే, కరడు గట్టిన రాజకీయ నాయకుడు నిర్దాక్షిణ్యంగా వారిపై కాల్పులకు ఆదేశిస్తాడు.. ఇది ఒక సిని మాలో సన్నివేశమే కావచ్చు. కానీ తమిళగడ్డపై వేదాంత గ్రూప్‌కు చెందిన స్టెరిలైట్ సంస్థని ఎత్తేయాలంటూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారుల గుండెల్లో దిగిన పోలీసు తూటా సృష్టించిన రక్తపాతమే స్ఫురణకు వస్తుంది. అందరి కడుపు నింపే అన్నదాత తన కడుపు మాడ్చుకుంటూ ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి నిరసన చేసినా కనికరం చూపని కేంద్రం వైఖరి కళ్లకు కడుతుంది. తమ ప్రియతమ నాయకురాలు మరణం చుట్టూ కేంద్రం రాజకీయాలు చేసినట్టుగా వచ్చిన వార్తలు ఇంకా పచ్చిగానే తమిళ తంబిల మనసుల్లో నిలిచి ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు సామాన్యుడి జీవితాల్ని తలకిందులుగా చేసిన వైనం వెండితెరపై తూటాల్లా పేలే మాటలతో చీల్చి చెండాడుతుంటే ప్రేక్షకులు మురిసిపోయారు. ఆ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిపై దళితుల ధిక్కారాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమాలో చూసి పండుగ చేసుకున్నారు. ఈ సినిమాలన్నీ ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్‌కి ఏ మేరకు ఓట్లు రాలుస్తాయో చెప్పలేం కానీ, మన వ్యవస్థలో లోటుపాట్లు, వాటిపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి జనం గుండెల్లోకి దూసుకుపోయేలా చేయడంలో విజయం సాధించాయని సినీ, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలన్నీ కట్టుకథలని తమిళనాడు బీజేపీ శాఖ అంటోంది. బాలీవుడ్ ఎందుకీ పని చేయలేకపోతోంది? బాలీవుడ్ కూడా రాజకీయ, సామాజిక అంశాలతో సినిమాలు నిర్మిస్తూనే ఉంది. కానీ అవన్నీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. కానీ అవి ఏ మేరకు జనంపై ముద్ర వేశాయో నిపుణుల అంచనాలకు అందడం లేదు. తమిళ సినిమాలు ఓట్లు రాల్చినంతగా హిందీ రాష్ట్రాల ప్రజలు సినిమాలు చూసి ప్రభావితమై తమ ఓటింగ్ నిర్ణయం మార్చుకోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో వచ్చిన ‘ఉరీ’ సినిమా యువతరాన్ని ఉర్రూతలూగించింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘యాక్సిడెంటల్ పీఎం’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇంకా ‘పాడ్ మ్యాన్’, ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’, ‘పరమాణు’, ‘బాఘీ 2’, ‘మణికర్ణిక’ వంటి సినిమాలు బీజేపీ సిద్ధాంతాలకు ఊతమిచ్చేవిగా, జాతీయ భావాన్ని పెంచేవిగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్నతనంపై వచ్చిన ‘చలో జీతే హై’ షార్ట్ ఫిల్మ్ , స్వచ్ఛభారత్ కార్యక్రమంపై వచ్చిన ‘మేరే ప్యారే ప్రధానమంత్రి’ విమర్శకుల ప్రశంసలు పొందాయి కానీ జనం వాటిని ఎంత పట్టించుకున్నారనేది అనుమానమే. రాజకీయాలతో ముడిపడిన సినిమాలు తీసి కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం తమిళులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అందులో విషయం ఎంత సమగ్రంగా ఉందనేది ముఖ్యం కాదు. బుల్లెట్ దిగిందా లేదా! అదే కావల్సింది. – సంతోష్ దేశాయ్, అడ్వర్టయిజింగ్ అండ్ మీడియా నిపుణుడు ఇటీవల వచ్చిన తమిళ సినిమాల్లో.. పెత్తనమంతా కేంద్రానిదేనని, వారు ప్రవేశపెట్టే జనాకర్షక పథకాలన్నీ కాగితాలకే పరిమితమన్నట్టుగా చూపించారు. కానీ అవన్నీ శుద్ధ అబద్ధాలు. ‘పేట’, ‘సర్కార్’ వంటి సినిమాలు డీఎంకే పార్టీకి చెందిన సన్ పిక్చర్స్ తీసింది. అందుకే కట్టుకథలను జనంపైకి వదిలింది. – ఎస్జీ సూర్య, బీజేపీ యూత్ వింగ్ అధ్యక్షుడు తమిళులకు సినిమాలే ఊపిరి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి రాజకీయ దిగ్గజాలు సినిమాలతో వచ్చిన ఇమేజ్ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఎదిగారు. ఇవాళ రేపు సినీ నిర్మాతలు రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలని చూస్తున్నారు. ఈ విషయంలో కోలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ ఎంతో వెనుకబడి ఉంది. ‘కాలా’ అంటే నలుపు. ద్రవిడ సిద్ధాంతానికి సంకేతం. దళితవాదానికి గుర్తు. అణగారిన బతుకులకు చిహ్నం. ‘కాలా’, ‘పేట’ వంటి సినిమాలు హిందూ అతివాద ధోరణిని ఉతికి ఆరేశాయి. వాటి ప్రభావం ప్రజలపై, ఎన్నికల్లో వారు తీసుకునే నిర్ణయంపై కచ్చితంగా ఉంటుంది. – కవితా మురళీధరన్, రచయిత్రి సింగపూర్‌లో 7% జీఎస్టీ వసూలు చేసి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తుంటే, మన దేశంలో 28% జీఎస్టీ వసూలు చేస్తున్నా ఉచిత వైద్యం ఎవరికీ అందడం లేదు (మెర్సెల్) నలుపు శ్రమ జీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు.. మురికంతా ఇంద్రధనస్సులా కనిపిస్తుంది (‘కాలా) -
సర్గుణం దర్శకత్వంలో మాధవన్
సర్గుణం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు నటుడు మాధవన్.ఆయన యూత్‌లో.. అదీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడన్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత మాధవన్ నటించిన ఇరుదు చుట్రు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి సర్గుణం చిత్రం. ఇంతకు ముందు కలవాణి, వాగై చూడవా, నయాండి, సండీవీరన్ చిత్రాలను తెరకెక్కించిన సర్గుణం ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మాధవన్ హీరోగా ఒక చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్ర షూటింగ్ పూర్తిగా విదేశాల్లో నిర్వహించనున్నారట. ఇరుదు చుట్రు చిత్రం కోసం బరువు పెరిగిన మాధవన్ ఈ చిత్రం కోసం దాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారట. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈయన చెన్నైకి తిరిగి రాగానే సర్గుణం చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారని సమాచారం. తదుపరి మలయాళ చిత్రం చార్లీ రీమేక్‌లో నటించనున్నారు మాధవన్. చార్లీ మలయాళంలో మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. ఈ రెండు చిత్రాలతో పాటు మరో చిత్రం కూడా మాధవన్ కోసం ఎదురు చూస్తోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
చెన్నై పోదాం చలో... చలో!
‘‘మేం పక్కా లోకల్. మా తెలుగు పేక్షకులు మా సినిమా చూస్తే చాలు’’ అనేది నిన్నటి మాట. ‘‘మా ప్రేక్షకులతో పాటు పొరుగు రాష్ట్రం ప్రేక్షకులు కూడా మా సినిమాలు చూస్తే మేలు’’ అనేది ఇవాళ్టి మాట. నిన్న మొన్నటి వరకూ మన తెలుగు స్టార్స్ మన భాష మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు మాత్రం పర భాషపై కూడా వీళ్ల దృష్టి పడింది. పెరుగుతున్న నిర్మాణ వ్యయానికి తగ్గ వసూళ్లు రాబట్టాలంటే పక్క రాష్ట్రాల్లో కూడా సినిమాని విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని గ్రహించినట్లున్నారు. అది కూడా అనువాద రూపంలో కాకుండా.. నేరుగా చేస్తే ఇంకా ఉపయోగం ఉంటుందని లెక్కలేసినట్లున్నారు. అందుకే ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయాలని కొంతమంది హీరోలు ఫిక్స్ అయ్యారు. తమిళ తంబీలు ఒక అడుగు ముందే... వాస్తవానికి తమిళ హీరోలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. సీనియర్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. విక్రమ్ కూడా వీళ్ల రూట్‌నే ఫాలో అవుతూ అక్కడా, ఇక్కడా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. ఆ వరుసలో సూర్య, కార్తీ, తమిళంలో తమ చిత్రం విడుదలైనప్పుడే తెలుగులో కూడా అనువదించి, విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇంకా అజిత్, విజయ్, శింబు, ధనుష్ వంటి హీరోలు కూడా అడపా దడపా తెలుగు తెరపై ప్రత్యక్షమవుతున్నారు. తెలుగు కుర్రాడు విశాల్, తమిళంలో చేస్తున్న చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయడానికి రెడీ అయిపోయారు. మనవాళ్లల్లో తమిళంలో మార్కెట్ సంపాదించుకున్న హీరోలు లేకపోలేదు. ‘శివ’, ‘గీతాంజలి’, ‘రక్షకుడు’.. ఇలా అప్పట్లోనే నాగార్జున ఇటు తెలుగు అటు తమిళంలో మార్కెట్ పెంచుకున్నారు. కానీ, ఆ తర్వాత మాత్రం ఎందుకనో కోలీవుడ్‌పై ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ‘ఊపిరి’తో మళ్లీ తమిళ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి.. మళ్లీ ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తారా? లేదా తన చిత్రాలు అక్కడ అనువాదమై, విడుదలయ్యేలా చూసుకుంటారా? అనేది కాలమే చెప్పాలి. నేటి తరం హీరోల్లో మహేశ్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోల చిత్రాలు ఇక్కడ విడుదలైనప్పుడో, ఆ తర్వాతో పరభాషలోకి అనువాదమవుతున్నాయి. ఆ విధంగా పొరుగు రాష్ట్రాల్లో వాళ్లు మార్కెట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘బాహుబలి’తో ఇతర భాషల్లో ప్రభాస్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పవన్ కల్యాణ్ తొలిసారిగా హిందీకి తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు. ఈ హీరోలందరూ అనువాద రూపంలో కాకుండా ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తే, మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కొంతమంది హీరోలు ద్విభాషా లేదా త్రిభాషా చిత్రాలు చేస్తున్నారు. కొన్ని చిత్రాలు ఆన్ సెట్స్‌లో ఉన్నాయి.. కొన్ని సెట్స్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటంటే... ‘బాహుబలి -2’పై భారీ అంచనాలు దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా రూపొందిన టెక్నికల్ వండర్ ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ చిత్రానికి రెండో భాగంగా తెరకెక్కుతోన్న ‘బాహుబలి: ద కన్‌క్లూషన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగంతో దర్శకుడిగా రాజమౌళికీ, హీరోగా ప్రభాస్‌కీ ఇతర భాషల్లో మార్కెట్ పెరిగింది. అందుకే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. మలయాళంతో పాటు ఇతర భాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేస్తారని టాక్. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్లాన్ చేస్తున్నారట. మహేశ్ తమిళ్ పేసువారు! ‘గజిని’ ఫేం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ చిత్రం చేయ నున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. ఇన్నాళ్లూ లోకల్, ఓవర్సీస్ మార్కెట్ గురించి మాత్రమే ఆలోచించిన మహేశ్ ఇప్పుడు మాత్రం పొరుగు రాష్ర్టంలో కూడా పాగా వేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గ దర్శకుణ్ణి సెలక్ట్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు మురుగదాస్‌కి తమిళ్‌తో పాటు ‘స్టాలిన్’తో ఇటు తెలుగులో, ‘గజిని’ హిందీ రీమేక్‌తో హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ విధంగా మురుగదాస్ దర్శకత్వం వహించే చిత్రం అంటే ఈ మూడు భాషల్లోనూ అంచనాలు ఉంటాయి. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరో కాబట్టి, మహేశ్‌బాబు తమ భాషలో నేరుగా నటిస్తున్నాడంటే పరభాష ప్రేక్షకులు కూడా అంచనాలు పెంచుకుంటారు. ఆ విధంగా మురుగదాస్‌తో చేయబోయే చిత్రంతో మహేశ్‌బాబు తమిళంలో జెండా పాతడం ఖాయం అని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మహేశ్ పుట్టిందీ పెరిగిందీ చెన్నైలోనే. అందుకని తమిళ భాష బాగా వచ్చు. ‘‘చెన్నై లవ్లీగా ఉంటుంది. అక్కడ నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి’’ అని ‘సాక్షి’తో అన్నారు. తమిళంలో డబ్బింగ్ చెప్పుకుంటానని కూడా పేర్కొన్నారు. సో.. మహేశ్ తమిళ్ పేసువారు (మాట్లాడతారు) అన్నమాట. గోపీ.. గోయింగ్ టు చెన్నై! అచ్చ తెలుగు కుర్రాడిలా ఉంటే మన తెలుగు హీరోల్లో గోపీచంద్ ఒకరు. మంచి మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న గోపీచంద్ ఇప్పటివరకూ ఇతర భాషల మార్కెట్‌పై ఆసక్తి కనబర్చలేదు. కానీ, ఇప్పుడు దృష్టి పెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నారు. ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘ఖుషి’ వంటి సూపర్ హిట్స్ తీసిన ఎ.యం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. టైటిల్ నుంచే ఈ చిత్రంపై అంచనాలు మొదలయ్యాయి. ఇకపై ‘కోలీ’ అర్జున్ కూడా... అల్లు అర్జున్ తెలుగులోనే కాదు మలయాళంలో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. తెలుగులో బన్నీ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు మలయాళంలో అనువాదమై, విడుదలవుతుంటాయ్. మంచి వసూళ్లు కూడా రాబడతాయి. అక్కడివాళ్లకు అల్లు అర్జున్ అంటే ఎంత అభిమానం అంటే... ‘మల్లు అర్జున్’ అంటారు. అనువాద చిత్రాలకే అంత పేరు తెచ్చుకుంటే.. ఇక స్ట్రయిట్ చిత్రం చేస్తే ఎంత మార్కెట్ వస్తుందో? భవిష్యత్తులో మలయాళంలో సినిమా చేసే ఉద్దేశం ఉందో? లేదో కానీ, ప్రస్తుతానికి బన్నీ తమిళ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. అందుకే ఓ ద్విభాషా చిత్రం చేయాలని ఫిక్సయ్యారు. ప్రస్తుతం తమిళ దర్శకులు లింగుస్వామి, విక్రమ్‌కుమార్‌లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరిలో బన్నీ ఎవరితో సినిమా చేసినా అది తెలుగు, తమిళ భాషల్లో ఉంటుందని టాక్. ఒకేసారి రెండు చిత్రాల్లో సందీప్... ‘ప్రస్థానం’తో మంచి పేరు తెచ్చుకుని, దాదాపు విలక్షణ చిత్రాల్లోనే నటిస్తున్న సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. అలాగే, ‘మానగరమ్’ అనే తమిళ స్ట్రయిట్ చిత్రంలోనూ అతనే హీరో. మన తెలుగు హీరోల్లో తమిళంలో మంచి గుర్తింపు పొందినవారిలో నాని, శర్వానంద్, రానా ఉన్నారు. తమిళ చిత్రం ‘వెప్పమ్’, తమిళంలో విడుదలైన ‘నాన్ ఈ’ (తెలుగులో ‘ఈగ’) నానీని అక్కడివారికి దగ్గర చేశాయి. ఆ తర్వాత ‘నీదానే ఎన్ పొన్ వసంతం’, ‘నిమ్రిందు నిల్’, ‘పల్లాండు వాళ్గ’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు. బలంగా దృష్టి పెడితే.. తమిళంలో మార్కెట్ పెంచుకోవడం నానీకి పెద్ద కష్టమేం కాదు. అలాగే శర్వానంద్‌కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గమ్యం’ తమిళ రీమేక్ ‘కాదలున్నా సుమ్మా ఇల్లే’, ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో ‘జర్నీ’) వంటి చిత్రాలతో శర్వానంద్‌కి అక్కడ బాగానే మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత ఎందుకనో తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టారు. ‘ఆరంభం’, ‘బెంగళూరు నాట్కళ్’ చిత్రాల్లో చేసిన పాత్రలు రానాకి అక్కడ బాగానే గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ అనే చిత్రంలో రానా నటిస్తున్నారు. ఈ ఆరడుగుల హీరో ఇంకా కేర్ తీసుకుంటే తమిళంలో బాగానే మార్కెట్ పెంచుకోవచ్చు. ‘కళాకారులకు భాషతో సంబంధం లేదు’ అంటారు. సో.. ఈడ.. ఆడ.. ఏడ అయినా సినిమాలు చేసుకునే వెసులుబాటు ఉంది. సొంతింట్లోనే కాకుండా.. పొరుగింట్లో కూడా మార్కెట్ తెచ్చుకుంటే ఆ మజానే వేరు. ప్రస్తుతం మన హీరోలు ఆ పని మీదే ఉన్నారు. -
నా చిత్రాలు చూడను
నేను నటించిన చిత్రాలు నేను చూడను. అలా చూడడానికి ఇష్టపడను. అందుకు కారణం కూడా చెబుతాను. నేను చిత్రం చూస్తున్నప్పుడు ఎవరైనా నా నటన బాగోలేదని అంటారేమోనని భయం. ఇక నా పాత్రను దర్శకుడికి సంతృప్తి కలిగే వరకూ నటిస్తాను.నటుడు విక్రమ్ సరసన 10 ఎండ్రదుకుళ్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం.నేనింతకు ముందెప్పుడు చేయనటువంటి పాత్రను ఇందులో పోషించాను.అందుకే ఈ చిత్రం చూడాలనకుంటున్నాను.తొలి రోజుల్లో నేను నటించిన తమిళ చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు.విన్నైతాండి వరువాయా తెలుగు రీమేక్‌లో నేను నటించాను.అది అక్కడ పెద్ద హిట్ అయ్యింది.ఆ తరువాత వరుస విజయాలు అందుకున్నాను. ఒక చిత్రం ఫ్లాప్ అయితే నిరాశపడుతూ కూర్చుంటే మిగిలేది చింతే. అందుకే జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోను. అలాంటివి చాలా చూశాను. తమిళం,తెలుగు భాషలలో మంచి అవకాశాలతో విశ్రాంతి లేకుండా నటిస్తున్నాను.గ్యాప్ వస్తే అపజయాల ఆలోచనలతో ఏడవాల్సి వస్తుంది.నాకు అలాంటి అవకాశం లేకుండా తమిళం,తెలుగు భాషలలో మంచి అవకాశాలు వస్తున్నాయి అందులో కథాపాత్రకు తగ్గట్టుగా ఆలోచిస్తూ నటిస్తున్నాను.మరిన్ని విజయాలు వరిస్తాయనే నమ్మకం ఉంది అని అంటున్నారు నటి సమంత. -
టాలీవుడే టాప్
తెలుగు చిత్రాల నిర్మాణం... విడుదలలో టాలీవుడ్ గత ఏడాది దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా గత ఏడాది (ఏప్రిల్ 2013 - మార్చి 2014) మొత్తం1966 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 349 తెలుగు చిత్రాలు విడుదలై టాలీవడ్ మొదటి స్థానంలో నిలిచింది. 326 తమిళ చిత్రాల విడుదలతో తమిళ చిత్ర పరిశ్రమ ఆ తర్వాత స్థానాన్ని పొందింది. 263 హింది చిత్రాల విడుదలతో బాలీవుడ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే 2012- 13 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1724 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో తమిళ చిత్రాలు 292 విడుదలై... మొదటిస్థానాన్ని ఆక్రమించగా, 280 చిత్రాలతో తెలుగు సినిమా రెండో స్థానంలో నిలిచింది. అలాగే 255 హిందీ చిత్రాలతో మూడో స్థానంలో నిలిచింది. కానీ అంతకుముందు ఏడాదిలో ఉన్న తమిళ చిత్రాల సంఖ్యను పడతోసి టాలీవుడ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న తమిళ చిత్రాల స్థానాన్ని గత ఏడాది తెలుగు చిత్రాలు అక్రమించాయి. అయితే తెలుగు చిత్రాలు భారీ సంఖ్యలో విడుదలవుతున్న బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. అది పెద్ద పెద్ద హీరోలు నటించిన ఈ పరిస్థితి నెలకొంది. చిత్రాల నిర్మాణంపై ఉన్న అసక్తితో చిన్న చిత్రాలు విడుదల సంఖ్య భారీగా పెరిగిందని... అలాగే డిజిటల్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో భారీ సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అంజలికి దర్శకుల సంఘం నోటీసు
సమస్యల్లేవ్ మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సమయం ఆసన్నమయ్యింది అంటూ నటి అంజలి ఇటీవలే ప్రకటించారు. అయితే ఆమెను దర్శకుడు కళైంజియం రూపంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈయన చిత్రం ఊర్ చుట్ట్రి పురాణంలో కొన్ని రోజులు నటించిన అంజలి ఆ తరువాత పిన్నితో మనస్పర్థలు వచ్చి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. దీంతో దర్శకుడు కళైంజియం చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అంజలి తెలుగు చిత్రాలపై దృష్టి సారించి తాజాగా మళ్లీ తమిళంలో రీఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. దీంతో దర్శకుడు కళైంజియం తమిళ దర్శకుల సం ఘంలో అంజలిపై ఫిర్యాదు చేశారు. అంజలి మళ్లీ తమిళ చిత్రాల్లో నటిస్తున్నందున, ముందుగా తన ఊరి చుట్రి పురాణం చిత్రాన్ని పూర్తి చేసే వరకు ఇతర తమిళ చిత్రాల్లో నటించడాన్ని నిషేధించాలని కోరారు. ఆయన ఫిర్యాదుపై తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ స్పందిస్తూ దర్శకుడు కళైంజియం చిత్రం ఊరి చుట్ట్రి పురాణంను నటి అంజలి పూర్తి చేయూలని, ఈ విషయమై ఆమె మేనేజర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అంజలి మేనేజర్‌ను సంఘ కార్యాలయానికి రావలసిందిగా నోటీసు పంపినట్లు చెప్పారు. అయితే, అంజలిపై నిషేధం విధించాలన్న విషయం గురించి నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. దర్శకుడు కలైంజియం చిత్రంలో నటించడానికి అంజలి నిరాకరిస్తే ఆమెపై నిషేధం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంజలి తన పిన్నితో కలిసి దర్శకుడు కళైంజియం తనను చిత్ర హింసలకు గురి చేశారని గతంలోనే ఫిర్యాదు చేయడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ముందుముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. -
బాలీవుడ్‌పై ఆశ లేదు
కోరికలకు కళ్లెం వేయడం కష్టం అంటుంటారు సినిమా రంగంలో అయితే ఆశలకు అంతే ఉండదు ముఖ్యంగా హీరోయిన్లలో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే హీరోయిన్లుగా వారి వ్యవధి పరిమితం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మార్కెట్ ఉండగానే సంపాదించుకోవాలనుకుంటారు. దీంతో దక్షిణాదిలో పాపులర్ అయిన వెంటనే బాలీవుడ్‌పై మోహం పెరుగుతుంటుంది. అయితే అందరూ అలా ఆశిస్తారని చెప్పలేం. నటి అనుష్క విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్. అలాంటి బ్యూటీ తనకు బాలీవుడ్ ఆశ లేదంటున్నారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దు గుమ్మ జగ్గు దాదా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ తాను పుట్టింది కర్ణాటకలోని మంగుళూర్‌లో అయినా మాతృభాషలో నటించే అవకాశం రాలేదనే చిన్న ఫీలింగ్ ఇప్పటి వరకు ఉండేదన్నారు. అది ఈ జగ్గుదాదా చిత్రంతో పోయిందని తెలిపారు. తెలుగు, తమిళం ఇప్పుడు కన్నడం తదుపరి బాలీవుడ్ రంగ ప్రవేశమేనా? అన్న ప్రశ్నకు అలాంటిదేమి లేదని అనుష్క బదులిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ తనకు సంబంధించినంత వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించడమే సంతృప్తిగా ఉందన్నారు. హిందీ చిత్రాల్లో నటించాలనే ఆశ ఎప్పుడూ కలగలేదని స్పష్టం చేశారు.