సర్గుణం దర్శకత్వంలో మాధవన్ | Madhavan in direct sargunam | Sakshi
Sakshi News home page

సర్గుణం దర్శకత్వంలో మాధవన్

Published Mon, Jul 11 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

సర్గుణం దర్శకత్వంలో   మాధవన్

సర్గుణం దర్శకత్వంలో మాధవన్

సర్గుణం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు నటుడు మాధవన్.ఆయన యూత్‌లో.. అదీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడన్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత మాధవన్ నటించిన ఇరుదు చుట్రు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి సర్గుణం చిత్రం. ఇంతకు ముందు కలవాణి, వాగై చూడవా, నయాండి, సండీవీరన్ చిత్రాలను తెరకెక్కించిన సర్గుణం ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మాధవన్ హీరోగా ఒక చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.


చిత్ర షూటింగ్ పూర్తిగా విదేశాల్లో నిర్వహించనున్నారట. ఇరుదు చుట్రు చిత్రం కోసం బరువు పెరిగిన మాధవన్ ఈ చిత్రం కోసం దాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారట. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈయన చెన్నైకి తిరిగి రాగానే సర్గుణం చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. తదుపరి మలయాళ చిత్రం చార్లీ రీమేక్‌లో నటించనున్నారు మాధవన్. చార్లీ మలయాళంలో మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. ఈ రెండు చిత్రాలతో పాటు మరో చిత్రం కూడా మాధవన్ కోసం ఎదురు చూస్తోందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement