సమంతతో బయాలజీ వర్కౌట్ కాలేదు | 10 Endrathukulla teaser: Vikram and Samantha's racy action | Sakshi
Sakshi News home page

సమంతతో బయాలజీ వర్కౌట్ కాలేదు

Published Fri, Aug 14 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

సమంతతో బయాలజీ వర్కౌట్ కాలేదు

సమంతతో బయాలజీ వర్కౌట్ కాలేదు

 నటి సమంతతో కెమిస్ట్రీ,ఫిజిక్స్ వర్కౌట్ అయ్యింది కానీ బయాలజీ  కాలేదంటున్నారు నటుడు సియాన్ విక్రమ్. అసలు ఈ కెమిస్ట్రీల గొడవేమిటంటారా, అయితే మ్యాటర్‌లోకెళదాం. ఈ క్రేజీ జంట తొలిసారిగా నటిస్తున్న భారీ చిత్రం 10 ఎండ్రదుకుళ్ల. ఏఆర్.మురుగదాస్ ప్రొడక్షన్ సంస్థ, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. చిన్న పిల్లలతో గోలీసోడా వంటి పెద్ద విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన విజయ్ విల్టన్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం 10 ఎండ్రదుకుళ్ల. ఇందులో విక్రమ్ కారు డ్రైవర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
 
  షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం నగరంలోని రిలయన్స్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోహీరోయిన్లు విక్రమ్, సమంతలు దర్శకుడు విజయ్ మిల్టన్ సమక్షంలో టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు విక్రమ్, సమంత  బదులిచ్చారు. త్రిష, జ్యోతిక వంటి పలు హీరోయిన్లతో నటించారు. ఇప్పుడు తొలిసారిగా సమంతతో నటించారు.
 
  వారికంటే ఈమెలో ప్రత్యేకతలేమిటన్న ప్రశ్నకు అన్ని స్పెషలే. సమంత నటన, లుక్స్ అలా అన్నీ ప్రత్యేకతలేనని విక్రమ్ బదులిచ్చారు.అయితే సమంతతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్నమాట అనడంతో కెమిస్ట్రీనే కాదు ఫిజిక్స్ బాగానే వర్కౌట్ అయ్యింది. ఒక్క బయాలజీ తప్ప అంటే హాస్యమాడారు. నటి సమంత మాట్లాడుతూ 10 ఎండ్రదుకుళ్ల చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కారణం ఈ చిత్రంలో నటించడానికి మెంటల్ గానూ, ఫిజికల్ గానూ చాలా స్టెయిన్ అయ్యానన్నారు. ఇందులో తనది చాలా ఢిఫెరెంట్‌గా ఉండే టఫ్ క్యారెక్టర్ అని పేర్కోన్నారు. విక్రమ్‌తో నటించడం సరికొత్త అనుభవంగా సమంత పేర్కొన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement