
నయనతార
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? పట్టకపోయినా నో ప్రాబ్లమ్. చెప్పడానికి మేం ఉన్నాం కదా. చిన్న క్లూ. తను లేడీ సూపర్ స్టార్. సూపర్ స్టార్ సినిమాతోనే ఈ తారకి కథానాయికగా సూపర్ స్థాయి వచ్చింది. ఆ తార నయనతార. రజనీకాంత్ సరసన ‘చంద్రముఖి’లో నటించాక నయన కెరీర్ వేగం పుంజుకుంది. ఆ సినిమాలో బొద్దుగా కనిపించి, ఆ తర్వాత ఎవరూ ఊహించనంత సన్నబడిపోయారామె. క్రేజీ హీరోయిన్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు.
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలు.. కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు ‘ఐరా’ సినిమా కోసం అలానే మారారు. ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారు నయనతార. ఒక పాత్రలో నల్ల పిల్లలా కనిపించనున్నారు. ఇక్కడున్న ఫొటో ఈ పాత్రకు సంబంధించినదే. నల్ల మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు కదూ. ‘ఐరా’ అంటే సినిమాలో నయనతార పాత్ర పేరు కాదు. ఇంద్రుడి వాహనం ఐరావతం పేరుని పెట్టారు. ఐరావతం అంత శక్తిమంతంగా ఈ చిత్రంలో నయనతార పాత్ర ఉంటుందని, అందుకే టైటిల్ అలా పెట్టామని చిత్రదర్శకుడు సర్జున్ పేర్కొన్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment