
నయనతార.. ఈ పేరే ఒక సంచలనం.. తొలి నుంచి కూడా నయనతారది ఒక ప్రత్యేక శైలి. కోలీవుడ్‌లోకి అయ్యా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ బ్యూటీ వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. మొదట్లో కొన్ని సినిమాల్లో సో సో గానే కనిపించిన నయనతార ఇప్పుడు హీరోలకు ధీటుగా లేడీ ఓరియంటెడ్ కథాచిత్రాల నాయకిగా ఖ్యాతి గడించారు. ఈమె చాలాకాలం క్రితమే అందులో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననని తెగేసి చెప్పారు.
అయితే ఈ మధ్య నిర్మాతగా కూడా మారిన నయనతార ప్రధాన పాత్రలో నటించి రౌడీపిక్చర్స్ పతాకంపై అశ్విని శరవణన్ దర్శకత్వం వహించిన కనెక్ట్ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. చిత్ర ప్రచారాలకు దూరంగా ఉండే నయనతార ఈ చిత్రం కోసం స్పెషల్ ఇంటర్వూ్యలు ఇస్తోంది. ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ సినీ చరిత్రలో తన పేరు ఉండాలని ఆశించానని, అది భగవంతుడు నెరవేర్చారన్నారు. నటిగా పరిచయమైన 10 ఏళ్ల తరువాత తనకు కొన్ని కలలు ఉండేవన్నారు.
ముఖ్యంగా హీరోయిన్ ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించాలని కోరుకున్నానని, అప్పట్లో హీరోయిన్లకు ఆటలు, పాటలు మినహా నటనకు పెద్దగా అవకాశం ఉండేది కాదన్నారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల్లో కూడా వేదికలపై హీరోయిన్లను ఒక మూలన కూర్చొపెట్టేవారన్నారు. దీంతో ఇకపై చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారని చెప్పారు. ఇదేవిధంగా నటీమణులకు సమానత్వం ఉండాలని, హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉండాలని ఆశించానని, అది ఇప్పుడు జరుగుతోందని చెప్పారు.
అది తనకు గర్వంగా ఉందన్నారు. ఇకపోతే విజయ్ నటించిన శివకాశి, రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ చిత్రాల్లో సింగిల్ సాంగ్స్‌కు నటించడం గురించి ప్రశ్నించే వారన్నారు. ఇలా తొలి నుంచీ తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని, తాను సన్నబడినా, బరువు పెరిగినా ఇలా ఏదో ఒక విషయంపై విమర్శిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment