Airaa
-
ట్రైలర్ చూశాక సినిమాపై ఆసక్తి పెరిగింది
‘‘అథర్వ’ ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది. ప్రతి విషయాన్ని ఎంతో వివరంగా చూపించారు. పోలీస్ విభాగంలో క్లూస్ టీం గురించి చక్కగా వివరించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ శశి కిరణ్ తిక్క అన్నారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శశి కిరణ్ తిక్క, హీరో చైతన్య రావు రిలీజ్ చేశారు. మహేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో క్లూస్ టీమ్ గురించి చూపించబోతున్నాం. సురేష్ ప్రొడక్ష¯Œ ్సతో కలిసి భారీ ఎత్తున రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సుభాష్ నూతలపాటి, కార్తీక్ రాజు. ఈ కార్యక్రమంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, కెమెరామేన్ చరణ్ మాట్లాడారు. -
విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!
మెరిసే కళ్ళు, సొట్ట బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ గర్ల్ పేరు ఐరా! మంచు విష్ణు, విరానికాల చిన్న కూతురు. ఐరా.. బుజ్జి మోడల్‌గా .. అమ్మ విరానికా స్టార్ట్ చేసిన ఫ్యాషన్ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తోంది. ఆ ఫ్యాషన్ బ్రాండ్ గురించి కొన్ని విషయాలు..అమ్మ విరానికా .. ఐరాను ప్రేమగా ‘చిన్న పుప్పిటా’ అని పిలిచుకుంటే .. నాన్న విష్ణు ‘బిగ్గెస్ట్ బ్లాక్‌మెయిలర్’ అంటూ ముద్దు చేస్తాడట. ఇల్లు.. పిల్లలు.. వ్యాపారం.. ఈ మల్టీటాస్క్ని తనకు ఫింగర్ టిప్‌తో సమానమని నిరూపిస్తోంది విరానికా మంచు. న్యూయార్క్‌లో పుట్టి, పెరిగిన ఆమె.. జెమాలజీ, జ్యూలరీ డిజైన్, ఫ్యాషన్ మార్కెటింగ్‌లో డిగ్రీ చేసింది. సినీ హీరో మంచు విష్ణుని పెళ్లి చేసుకున్నాక ఇండియా వచ్చేసింది. ఇంట్లో వాళ్లకి కావలసిన డ్రెస్‌లు, నగలను తనే డిజైన్ చేస్తుంది. ‘విరానికా’ అని తన పేరు మీదే ఒక బొటిక్నీ నడుపుతోంది. అయితే అమ్మ విరానికా కల మాత్రం లండన్‌లో ఫ్యాషన్ స్టోర్ పెట్టాలనే! దాని కోసం వర్క్ చేసింది.. చివరకు సాధించింది. తాజాగా చిన్న పిల్లల కోసం ‘మేసన్ అవా’ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసింది. దాని స్టోర్‌ని.. వరల్డ్ ఫేమస్ లగ్జరీ డిపార్మెంట్ స్టోర్ అయిన హారోడ్స్ (లండన్)లో ఓపెన్ చేసింది. ఇక్కడ 2–14 సంవత్సరాల పిల్లల కోసం సరికొత్త డిజైన్స్‌లో అన్ని రకాల దుస్తులు ఉంటాయి. చాలా వరకు హ్యాండ్ మేడ్ డ్రెసెసే ఉంటాయి. ఈ బ్రాండ్‌కి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన గౌనును 2021లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య బచ్చన్.. తన పుట్టినరోజు నాడు వేసుకుంది. అమెరికన్ మోడల్ ప్యారిస్ హిల్టన్ సైతం ‘మేసన్ అవా’ డ్రెస్ వేసుకుంది. ధరలు హై రేంజ్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక విరానిక కూతురు ఐరా ధరించిన మేసన్ అవా డ్రస్ ధర ఏకంగా డ్రెస్ రూ. 99,520/- (చదవండి: దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!) -
రింగా రింగా రోసే..
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి ఈ సినిమాను నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్ర సంగీతదర్శకుడు శ్రీ చరణ్ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్నే చూసే.. చిట్టిగుండె కూసే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీఅందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు. మాస్టర్ రాజ్‌కృష్ణ కొరియోగ్రాఫర్. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ– ‘‘రింగా రింగా రోసే..’ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరో చిన్నతనం నుండి హీరోయిన్ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి తన ఫీలింగ్‌ను ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు మహేశ్‌రెడ్డి. ‘‘త్వరలోనే రిలీజ్ కానున్న మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుభాష్. ‘‘ఈ చిత్రంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు సిమ్రన్ చౌదరి. -
ఐరా ప్రత్యేకత అదే!
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేకేత్తిస్తున్న చిత్రం ‘ఐరా’. ఈ సినిమాలో నయన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తుడటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాటి రాజేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఐరా యూ/ఏ సర్టిఫికెట్తో ఈ నెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సర్జన్ మాట్లాడుతూ ‘నటి నయనతార ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ద్విపాత్రాభినయం అంటే రెండు పాత్రలకు ఏదో ఒక సంబంధం ఉంటుంది. కానీ ఐరా చిత్రంలో నయనతార పోషించిన రెండు పాత్రలకు ఎలాంటి సంబంధం ఉండదన్నా’రు. అంతేకాక ఈ రెండు పాత్రలకు నయనతార చూపించిన వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్ర ప్రచారాన్ని వైవిధ్యంగా చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అయ్యారు. ఐరా పోస్టర్లతో కూడిన ఒక బస్సుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. -
నయన్‌ది ఆశా? అత్యాశా?
సినిమా: మనిషి అన్నాక కాసింతైనా ఆశ ఉండాలి. కానీ అత్యాశ ఉండకూడదు. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార అత్యాశకు పోతోందని చిత్ర వర్గాల గుసగుసలు. చేతి నిండా సినిమాలతో సూపర్‌స్టార్స్ నుంచి యువస్టార్స్ వరకూ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది నయనతార. అంతే కాదు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలతోను మెప్పించేస్తోంది. నటిగా దశాబ్ద కాలం అధిగమించిన తరువాత ఈ అమ్మడు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఐరా. ఇందులో రెండు పాత్రల్లోనూ నటనలోనూ, గెటప్లోనూ ఎంతో వైవిధ్యం చూపించినట్లు చిత్ర ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ నెల 28వ తేదీన తెరపైకి రావడానికి ఐరా ముస్తాబవుతోంది. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే నయనతార మనసులో చాలా కాలంగా ఒక ఆశ ఉందట. దక్షిణాదిలోనే నంబర్‌వన్ కథానాయకిగా వెలుగొందుతున్న నయనతార పారితోషికం కూడా ఆ రేంజ్‌లోనే పుచ్చుకుంటోంది. ఇప్పటికే 5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సుందరి విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలకు ధీటైన పాత్రల్లో నటిస్తోంది. కాబట్టి పాత్రల్లోనే కాకుండా పారితోషికం విషయంలోనే వారిని మించిన స్థాయిలో ఉండాలన్నది ఈ అమ్మడి చిరకాల ఆశ అట. అదీ ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం అందుకోవాలని ఆశ పడుతోందట. ఇది సాధ్యమేనా? ప్రస్తుతం నయనతార నటుడు విజయ్‌తో ఆయన63వ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. సుమారు 10 ఏళ్ల తరువాత ఈ క్రేజీ జంట కలిసి నటిస్తున్న చిత్రం ఇది. కాగా మరో విషయం ఏంటంటే కేజేఆర్ స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ నయనతార హీరోయిన్గా వండర్ఉమెన్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల తరహాలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇది గనుక కార్యరూపం దాల్చితే నయనతార చిర కాల ఆశ నెరవేరుతుందో? లేదో? గానీ, ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ పేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. -
గుర్తుపట్టారా?
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? పట్టకపోయినా నో ప్రాబ్లమ్. చెప్పడానికి మేం ఉన్నాం కదా. చిన్న క్లూ. తను లేడీ సూపర్ స్టార్. సూపర్ స్టార్ సినిమాతోనే ఈ తారకి కథానాయికగా సూపర్ స్థాయి వచ్చింది. ఆ తార నయనతార. రజనీకాంత్ సరసన ‘చంద్రముఖి’లో నటించాక నయన కెరీర్ వేగం పుంజుకుంది. ఆ సినిమాలో బొద్దుగా కనిపించి, ఆ తర్వాత ఎవరూ ఊహించనంత సన్నబడిపోయారామె. క్రేజీ హీరోయిన్గా ముందుకు దూసుకెళ్తున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలు.. కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు ‘ఐరా’ సినిమా కోసం అలానే మారారు. ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారు నయనతార. ఒక పాత్రలో నల్ల పిల్లలా కనిపించనున్నారు. ఇక్కడున్న ఫొటో ఈ పాత్రకు సంబంధించినదే. నల్ల మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు కదూ. ‘ఐరా’ అంటే సినిమాలో నయనతార పాత్ర పేరు కాదు. ఇంద్రుడి వాహనం ఐరావతం పేరుని పెట్టారు. ఐరావతం అంత శక్తిమంతంగా ఈ చిత్రంలో నయనతార పాత్ర ఉంటుందని, అందుకే టైటిల్ అలా పెట్టామని చిత్రదర్శకుడు సర్జున్ పేర్కొన్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. -
డబుల్తార
ఇండస్ట్రీకి నయనతార వచ్చి దాదాపు 15 ఏళ్లు పూర్తి కావొస్తోంది. కానీ ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై డబుల్ నయనతారను చూసుండరు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. అవును.. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘మా, లక్ష్మీ’ వంటి తమిళ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పేరు సంపాదించుకున్న కేఎమ్ సర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన ‘ఆరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’) సినిమాను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్‌నే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఐరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘‘విభిన్నమైన జానర్స్‌ను ట్రై చేయడానికి ఇష్టపడుతుంటాను. కానీ హారర్ జానర్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పుడు ఈ హారర్ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో రూపొందుతున్న తొలి సినిమాలోనే నయనతార నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు సర్జున్. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట చిత్రబృందం. ఈ సినిమా కాకుండా మరో మూడు తమిళ సినిమాలు నయనతార బ్యాంకులో ఉన్నాయి. తెలుగులో చిరంజీవి ‘సైరా’లో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నయనతార ఇటు ‘సైరా’.. అటు ‘ఐరా’!
సాక్షి, తమిళ సినిమా: తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా చిత్రంలో నటిస్తున్న నయనతార.. తమిళంలో ఐరా చిత్రంలో నటిస్తుండటం విశేషం. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఏకైక కథానాయిక నయనతార. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఆమె ఇటీవల నటించిన మాయ, ఆరం వంటి చిత్రాలు సక్సెస్ కావడంతో వుమెన్ సెంట్రిక్ కథలతో దర్శకనిర్మాతల నయనతార కోసం క్యూ కడుతున్నారు. ఆమె తాజా చిత్రాలు కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ కూడా వరుసగా విజయం సాధించడంతో నయనతార క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతో తెరపైకి రావడానికి నయనతార సిద్ధం అవుతున్నారు. ఇంతకుముందు అరమ్, గులేభకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్ సంస్థ నిర్మాణంలో సర్జిన్ దర్శకత్వంలో నయన ‘ఐరా’ చిత్రం చేస్తున్నారు. సర్జిన్ ఇంతకుముందు ‘హెచ్చరికై ఇదు మణిదర్గళ్ నడమాడుం ఇదం’ అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజా ‘ఐరా’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. దీని ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాలో నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె పాత్రలు విభిన్నంగా ఉంటాయని దర్శకుడు సర్జిన్ తెలిపారు. ఇందులో రెండు పాత్రలు ఒక దానికి, ఒకటి సంబంధం లేకుండా కాంట్రస్ట్‌గా ఉంటాయని చెప్పారు. ఐరా అంటే ఇంద్రుడి వాహనం ఐరావతమని, ఇందులో ఏనుగు లాంటి బలమైన పాత్రలో నయనతార నటించారని చెప్పారు. డిసెంబర్లో క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. Wishing the best for the Aram team @kjr_studios , @tridentartsoffl & #Nayanthara in her first dual role film directed by the super talented @sarjun34 & his promising team ! #Airaa #ChristmasHolidays #Decemeber #AiraFirsTLook pic.twitter.com/nCaklReeep — Vignesh ShivN (@VigneshShivN) 9 October 2018