
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేకేత్తిస్తున్న చిత్రం ‘ఐరా’. ఈ సినిమాలో నయన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తుడటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాటి రాజేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఐరా యూ/ఏ సర్టిఫికెట్‌తో ఈ నెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సర్జన్ మాట్లాడుతూ ‘నటి నయనతార ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ద్విపాత్రాభినయం అంటే రెండు పాత్రలకు ఏదో ఒక సంబంధం ఉంటుంది. కానీ ఐరా చిత్రంలో నయనతార పోషించిన రెండు పాత్రలకు ఎలాంటి సంబంధం ఉండదన్నా’రు. అంతేకాక ఈ రెండు పాత్రలకు నయనతార చూపించిన వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్ర ప్రచారాన్ని వైవిధ్యంగా చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అయ్యారు. ఐరా పోస్టర్లతో కూడిన ఒక బస్సుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment