రింగా రింగా రోసే.. | Ringa Ringa Rosey Song Released From Movie Atharva | Sakshi
Sakshi News home page

రింగా రింగా రోసే..

Published Tue, May 16 2023 4:04 AM | Last Updated on Tue, May 16 2023 4:04 AM

Ringa Ringa Rosey Song Released From Movie Atharva - Sakshi

కార్తీక్‌ రాజు, సిమ్రన్‌ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘అథర్వ’. మహేశ్‌ రెడ్డి దర్శకత్వంలో నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్‌ నూతలపాటి ఈ సినిమాను నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్ర సంగీతదర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్నే చూసే.. చిట్టిగుండె కూసే..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

శ్రీ చరణ్‌ పాకాల బాణీఅందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, జావేద్‌ అలీ ఆలపించారు. మాస్టర్‌ రాజ్‌కృష్ణ కొరియోగ్రాఫర్‌. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కార్తీక్‌ రాజు మాట్లాడుతూ– ‘‘రింగా రింగా రోసే..’ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరో చిన్నతనం నుండి హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి తన ఫీలింగ్‌ను ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు మహేశ్‌రెడ్డి. ‘‘త్వరలోనే రిలీజ్‌ కానున్న మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుభాష్‌. ‘‘ఈ చిత్రంలో  చాలా ఎమోషన్స్‌ ఉన్నాయి’’ అన్నారు సిమ్రన్‌ చౌదరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement