simran choudhary
-
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభమైంది. కార్తి దర్శకుడు కాగా... శాంత నూపతి, ఆలపాటి రాజా, అవినాష్ బుయాని, అంకిత్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్ఎల్పీ ప్రొడక్షన్ నెం.1గా తీస్తున్న ఈ మూవీ.. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి క్లాప్ కొట్టారు.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం)మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్ విశ్వజిత్ చెప్పిన ఈ లైన్ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్ బుర్రాగారు మా సినిమాకు డైలాగ్స్ రాయడం మరింత ప్లస్ అవుతుంది. మంచి హిట్ సినిమాకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్ కుదిరారు అన్నారు.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల కారు గిఫ్ట్.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!) -
మల్లెపూలతో సన్నజాజిలా గుబాలిస్తున్న సిమ్రన్ చౌదరి (ఫొటోలు)
-
Atharva Review: అథర్వ మూవీ రివ్యూ
టైటిల్: అథర్వ నటీనటులు: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ యాదవ్, విజయ్ రామరాజు, గగన్ విహారి తదితరులు నిర్మాత: సుభాష్ నూతలపాటి దర్శకత్వం: మహేశ్ రెడ్డి సంగీతం: శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని విడుదల తేది: డిసెంబర్ 1, 2023 ‘అథర్వ’ కథేంటంటే.. దేవ్ అథర్వ కర్ణ అలియాస్ కర్ణ(కార్తీక్ రాజు)కి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కోరిక ఉంటుంది. తన కలను నేరవేర్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ అతని ఉన్న అనారోగ్యం కారణంగా పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోతాడు. చివరకు క్లూస్ టీమ్‌లో జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చురుగ్గా పని చేస్తూ.. చాలా కేసులను సాల్వ్ చేస్తుంటాడు. ఓసారి తన కాలేజీలో జూనియర్ అయిన నిత్య(సిమ్రన్ చౌదరి)..క్రైమ్ రిపోర్టర్‌గా తనని కలుస్తుంది. నిత్య అంటే కర్ణకి చాలా ఇష్టం. కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్ జోష్నీ(ఐరా) ఓ స్టార్ హీరోయిన్. ఓ సారి కర్ణ, నిత్యలు కలిసి జోష్నీ ఇంటికి వెళ్తారు. అలా వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షాక్ అవుతారు. అక్కడ జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. కానీ నిత్యం మాత్రం అందులో నిజం లేదని అనుమానిస్తుంది. దీంతో కర్ణ రంగంలోకి దిగుతాడు. అసలు హీరోయిన్ జోష్ని, ఆమె ప్రియుడు శివ ఎలా చనిపోయారు? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసు కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అథర్వ కూడా ఆ తరహా చిత్రమే. కేసు చేధించేందుకు పోలీసులు కాకుండా క్లూస్ టీమ్ ఉద్యోగి రంగంలోకి దిగడం ఈ సినిమా ప్రత్యేకత. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. హీరో తన తెలివి తేటలతో ఈ కేసును పరిష్కరించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఎలాంటి కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారో అలాంటి పాయింట్‌తోనే కథ రాసుకున్నాడు దర్శకుడు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. రాబరీ కేసు నుంచి సినిమా ఊపందుకుంటుంది. అసలు కథ మాత్రం జోష్ని, ఆమె ప్రియుడు మరణించాకే ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం ప్రారంభం మళ్లీ స్లో అనిపిస్తుంది. ఆ తరువాత సినిమా చకచకా పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. అయితే జంట హత్యలు చోటు చేసుకోవడం.. ఆ కేసును పోలీసులు హడావుడిగా మూసివేసినా.. క్లూస్ టీమ్‌లో పని చేసే హీరోకి అనుమానం రాకపోవడం కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే ఊహించని విధంగా ఉంటుంది. కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. కర్ణ పాత్రకి కార్తీక్ రాజు న్యాయం చేశాడు. లవర్‌గా, క్లూస్ టీమ్ ఉద్యోగిగా రెండు రకాల పాత్రల్లో అలరించారు. . హీరోయిజం కోసం కావాలని సీన్లు, ఫైట్లు పెట్టుకోలేదు. సహజంగా నటించాడు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది.సినిమాలో సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Simran Choudhary: స్టన్నింగ్ లుక్స్‌తో మతి పోగొడుతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
రింగా రింగా రోసే..
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి ఈ సినిమాను నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్ర సంగీతదర్శకుడు శ్రీ చరణ్ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్నే చూసే.. చిట్టిగుండె కూసే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీఅందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు. మాస్టర్ రాజ్‌కృష్ణ కొరియోగ్రాఫర్. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ– ‘‘రింగా రింగా రోసే..’ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరో చిన్నతనం నుండి హీరోయిన్ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి తన ఫీలింగ్‌ను ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు మహేశ్‌రెడ్డి. ‘‘త్వరలోనే రిలీజ్ కానున్న మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుభాష్. ‘‘ఈ చిత్రంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు సిమ్రన్ చౌదరి. -
క్రైమ్ థ్రిల్లర్‌గా 'అథర్వ'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
యంగ్ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అథర్వ'. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ లోగో, పోస్టర్, టీజర్, ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇద చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను జూన్‌లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. -
'అథర్వ' నుంచి అరవింద్ కృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్
యంగ్ అండ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ అథర్వ.మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చితత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. నేడు (జనవరి 5) ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్లోనే పోలీసులు, మీడియా అంటూ చాలా హడావిడి వాతావరణం కనిపిస్తోంది. కాగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు లవ్, రొమాంటిక్, కామెడీ ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. -
సెహరి మూవీ టీమ్ మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
-
'ఆలియాను చేసుకోమంటే అక్కను తగులుకున్నావేంట్రా?'
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ నుంచి బుధవారం(ఫిబ్రవరి 2) ట్రైలర్ రిలీజైంది. 'సెహరి అంటే ఏంటి భయ్యా? సెహరి అంటే సెలబ్రేషన్స్', 'నీ ముఖానికి పెళ్లవడమే ఎక్కువ', 'ఆలియాను చేసుకోమంటే అక్కను తగులుకున్నావేంట్రా' వంటి డైలాగులు బాగున్నాయి. హీరో పార్ట్నర్ కోసం వెతకడం, ఎంగేజ్మెంట్ నుంచి పారిపోవడం... వంటి సన్నివేశాలు ఆసక్తికి కలిగిస్తున్నాయి. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అభినవ్ గౌతమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అని బాలకృష్ణ అనడం వైరల్ కూడా అయింది. -
ఈ హీరో వర్జిన్, ఇతడికి పాపం, పుణ్యం తెలీదు: బాలయ్య
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జోడీగా నటిస్తున్న చిత్రం 'సెహరి'. శుక్రవారం ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో బాలయ్యను బాగా వాడుకున్నట్లు కనిపిస్తోంది. మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు బాలకృష్ణ మాట్లాడిన వీడియోలో కొంత భాగాన్ని టీజర్ ప్రారంభంలో పొందుపరిచారు. "ఇతడు హర్ష్.. సినిమా హీరో.. అతడు కూడా వర్జిన్.. అదే ఇవాళే పుట్టాడు, ఇతడి పుట్టినరోజు నేడు. ఇతడికి పాపం, పుణ్యం ఏం తెలీదు.." అన్న బాలయ్య స్పీచ్‌తోనే నవ్వులు పూయించేశారు. బాలయ్య మాటలకు హర్ష్ సిగ్గుతో చచ్చిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడున్నవాళ్లు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే... "వరుణ్... నాకిద్దరు పిల్లలు కావాలి" అని హీరోను అడుగుతోంది హీరోయిన్. ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లోనేమో నువ్వింకా ఎదగాలని చెప్తోంది. అటు హీరో కూడా ఓవైపు ప్రియురాలితో పెళ్లికి ఓకే అంటూనే ఆమె అక్కనూ లైన్లో పెడుతున్నాడు. వినోదభరితంగా సాగిన ఈ టీజర్లో నటన, డైలాగులు బాగున్నాయి. సంగీత దర్శకుడు కోటి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. వర్గో పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణురెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదవండి: తమిళ స్టార్ హీరో సినిమాలో బేబమ్మకు ఛాన్స్! ఇష్క్ ట్రైలర్: ఓ ముద్దిస్తావా? -
వర్జిన్ స్టార్ సినిమా టీజర్‌కు టైం ఫిక్స్
హర్ష్ కానుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం "సెహరి". సంగీత దర్శకుడు కోటి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. వర్గో పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణురెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 16న ఉదయం 9.45 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా వుంటే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక టీజర్ అనౌన్స్మెంట్కు కూడా సెహరి టీమ్ ప్రత్యేక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో అందరూ హీరోను 'బాలయ్య మిమ్మల్ని టచ్ చేశాడు కదూ.. మీరు వర్జిన్ స్టార్..' అంటూ ఆగమాగం చేస్తున్నారు. ఈ స్పెషల్ వీడియో కూడా జనాలను తెగ ఆకట్టుకుంటోంది. మరి రేపు రిలీజయ్యే టీజర్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. చదవండి: తేజ సజ్జ ఇష్క్ ట్రైలర్ వచ్చేసింది.. నటి లాక్డౌన్ బర్త్‌డే వేడుకలు -
ఫోన్ విసిరేసిన బాలయ్య.. స్పందించిన హీరోయిన్
సాక్షి, హైదరాబాద్: నటీనటులపై ట్రోల్స్, మిమ్స్ సర్వసాధారణం. అయితే ట్రోల్స్‌పై కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే మరికొందరూ నటీనటులు వాటికి స్పందించకుండా లైట్లే అనుకుని వదిలేస్తుంటారు. అలాగే ‘సెహరి’ కథానాయిక సిమ్రన్ చౌదరి కూడా మూవీ ఫస్ట్‌లుక్ కార్యక్రమంలో బాలయ్యపై వస్తున్న మిమ్స్‌పై స్పందిస్తూ మిమర్స్‌ను ఏకిపారేశారు. హర్ష్ కనుమిల్లి, సిమ్రన్ చౌదరిలు జంటగా గంగాసాగర్ ద్వారక దర్శకత్వంలో ‘సెహరి’ తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పోస్టర్ విడుదల సందర్భంగా బాలయ్య.. హీరో హర్ష్ కనుమిల్లి చేతిని కొట్టినట్లుగా కనిపించాడు. అలాగే కోపంతో ఫోన్ విసిరికొట్టి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో ట్రోలర్స్ సోషల్ మీడియాలో తమకు నచ్చినట్టుగా మిమ్స్ రాసి సోషల్ మీడియాలో వినోదాన్ని పంచుతున్నారు. (చదవండి: ఫోన్ విసిరేసిన బాలకృష్ణ : వైరల్ వీడియో) ఈ కార్యక్రమంలో హీరో హర్ష్, బాలకృష్ణ, హీరోయిన్ సిమ్రాన్‌లను ఉద్దేశిస్తూ ఫన్నీ మిమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫన్నీ మిమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మిమ్స్‌పై స్పందించారు. ‘అందరికి హాయ్.. ఈ స్టోరీ ప్రత్యేకంగా మిమర్స్ మిత్రుల కోసమే పెడుతున్నాను. నిన్న జరిగిన మా ‘సెహరి’ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని అంత బాగా పాపులర్ చేసిన ప్రతి ఒక్క మిమర్స్ మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు క్రియేట్ చేసి నన్ను ట్యాగ్ చేసిన ప్రతి మీమ్ నేను చుశాను. ఇవి నిజంగానే కామెడిగా అనపించాయి. కరోనా వంటి కష్టకాలంలో మీ మిమ్స్‌తో ప్రజలకు వినోదాన్ని ఇస్తున్న మీ క్రియేటివిటికి ధన్యవాదాలు’ అంటూ ఆమె తనదైన శైలిలో మిమర్స్‌కు చురక అంటించారు. (చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
సినిమా కథ తెలుసుకున్నా: బాలకృష్ణ
‘సెహరి’ చిత్రనిర్మాత అద్వయ జిష్ణురెడ్డి నా స్నేహితుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనళ్లుడు. ఈ సినిమా కథ తెలుసుకున్నా.. బాగుంది’’ అన్నారు నటుడు బాలకృష్ణ. హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర చేసిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. సోమవారం హర్ష కనుమిల్లి కనుమిల్లి పుట్టినరోజు సందర్భంగా ‘సెహరి’ ఫస్ట్ లుక్‌ని బాలకృష్ణ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించి మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా వచ్చింది’’ అన్నారు అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి. ‘‘న్యూ ఏజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు జ్ఞానసాగర్ ద్వారక. -
‘మజిలీ, జర్నీ’ మస్త్ ఉన్నాయ్..
హిమాయత్‌నగర్: ఆ అందం పుట్టి పెరిగింది మన హైదరాబాద్‌లోనే. ఇప్పటికి చేసినవి రెండు సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు తన నవ్వుతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. చురుకైన చూపులతో 2017లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా–తెలంగాణ పోటీల్లో పాల్గొని ‘మిస్ తెలంగాణ’గా నిలిచింది. ఆమే సిమ్రాన్ చౌదరి. నటిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సిమ్రన్.. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో శిల్పగా మెరిసింది. ‘హమ్ తుమ్’ సినిమాలో హీరోయిన్గా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో హీరో సుశాంత్‌తో కలిసి కొత్త సినిమాతో మనముందుకు రానున్న సిమ్రాన్ చౌదరి హిమాయత్‌నగర్‌లో మెరిసింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించి ఎన్నో విషయాలు పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనే కాబట్టి నగరంపై అటాచ్ బాగా ఉంది. ఫ్రెండ్స్ తక్కువగానే ఉన్నారు. కానీ..ఉన్న వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటా. కాఫీ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా ‘రోస్టరీ కాఫీ హౌజ్’కి వెళ్తుంటా. షూటింగ్ లేని సమయాల్లో ట్యాంక్‌బండ్, చార్మినర్, హైటెక్‌సిటీ ఏరియాల్లో చక్కర్లు కొడుతుంటా. టైం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటాను. బుక్స్ ఎక్కువగా చదువుతుంటా. సిటీలోనే చదువుకున్నాను. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ‘డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజీ సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సాగింది. నేను మోడలింగ్ చేస్తున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ యంకరేజ్ చేస్తుండేవాళ్లు. సినిమాల్లోకి అడుగుపెట్టాక వాళ్లను కలిస్తే చాలు తెగ ఆటపట్టింస్తుంటారు. యాడ్స్టూమూవీస్ సినిమాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. ఆ కోరికతోనే ముందుగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను. అంతకంటే ముందుగా నా 12 ఏళ్ల వయసులో కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. అవి నాకెంతో గుర్తింపునిచ్చాయి. తర్వాత పలు దేశాల్లో మోడల్‌గా ర్యాంప్‌లో షోల్లో పాల్గొన్నాను. తర్వాత అలా సినిమాల్లోకి వచ్చాను. ఇప్పటికి చేసినవి రెండు సినిమాలే అయినా ప్రస్తుతం చేతినిండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అలోవెరాతోఅందం రెట్టింపు.. ఈ మధ్య అందరూ ఎందుకింత అందంగా ఉన్నావ్? ఏం తింటున్నావ్.. అంటూ అడుగుతున్నారు. అలా అడుగుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను అలోవెరా వాడుతున్నాను. అలోవెరా తింటాను, బాడీకి అప్లై చేస్తాను. అలోవెరా జ్యూస్ తాగుతాను. అదే నా అందం సీక్రెట్. డైలీ జిమ్, స్విమ్మింగ్ తప్పనిసరి. ఇంకా బాక్సింగ్, యోగా, బాస్కెట్‌బాల్, డ్యాన్స్ కూడా చేస్తుంటా. ఫుడ్ విషయంలో మాత్రం ఇంట్లో అమ్మ చేతి వంటలకే నా తొలి ఓటు. కెమెరా ముందూ, వెనకా ఒకేలా.. కెమెరా ముందొక విధంగాను.. వెనక మరో విధంగా ఉండటం నాకు రాదు. సినిమాలో చేసిన క్యారెక్టర్ని బట్టి ఆ అమ్మాయి బయట కూడా అలాగే ఉంటుందనుకోవడం తప్పు. అది చూసే వాళ్లను బట్టి ఉంటుంది. కేవలం పాత్ర కోసం అలా నటించాల్సి ఉంటుంది. అంతేతప్ప మరేం కాదు. పాత్రను బట్టి నటించే నేను మాత్రం వ్యక్తిత్వం విషయంలో మాత్రం కెమెరా ముందు.. వెనుకా ఒకేలా ఉంటాను. ఐ యామ్ ఏ పెట్ లవర్ ³ంపుడు జంతువులంటే నాకు చాలా ఇష్టం. వాటికి సేవ చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉంది. అందుకే ‘బ్లూ క్రాస్’లో నేను కూడా వలంటీర్‌గా చేరిపోయా. సమయం దొరికినప్పుడల్లా అక్కడున్న పెట్స్‌కి సర్వీస్ చేస్తుంటా. వాటికేమైనా ఆపద వస్తే ఆదుకుంటా. అక్కడున్న సభ్యులతో కలసి నేను కూడా ఒక ఆర్డనరీ వలంటీర్‌గానే పనిచేస్తూ ఉండడంతో పాటు ఇష్టమైన జంతువులకు దగ్గరగా ఉండడం ఆనందాన్నిస్తుంది. ‘మజిలీ, జర్నీ’ మస్త్ ఉన్నాయ్ ఇటీవల ‘మజిలీ, జర్నీ’ సినిమాలు చూశా మస్త్ ఉన్నాయి. మజిలీలో నాగచైతన్య యాక్టింగ్‌కి చాలా కనెక్ట్ అయ్యాను. ఇక సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. హీరో మహేష్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. బాలీవుడ్లో సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేస్తాను. ప్రస్తుతం హీరో సుశాంత్ పక్కన హీరోయిన్గా చేస్తున్నాను. త్వరలో ఆ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది.. అంటూ ముగిచింది. -
భారత్‌లో యుహో మొబైల్స్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ యుహో మొబైల్... భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. తిరుపతి లేదా హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చిస్తామని కంపెనీ సేల్స్ డైరెక్టర్ కేశవ్ అరోరా చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో యుహో వాస్ట్ ప్లస్ మోడల్‌ను సినీ నటి సిమ్రాన్ చౌదరితో కలిసి విడుదల చేసిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ప్లాంటును స్థాపించేదీ 3 నెలల్లో నిర్ణయిస్తామన్నారు. గురుగ్రామ్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఉందని, కొత్త ప్లాంటులో ఈ ఏడాదే ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తామన్నారు. 2019లో యుహో మొబైల్స్ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. -
జూబ్లీహిల్స్‌లో వాఫ్లె అవుట్లెట్
-
హమ్ తుమ్...
‘‘దర్శకుడు తేజ గతంలో ‘నువ్వు - నేను’ అని తీశాడు. ఈ దర్శకుడు ‘మేము-నువ్వు’ (హమ్ తుమ్) అని తీస్తున్నాడు. కథానాయిక ‘సుందరకాండ’లో అపర్ణలా చక్కగా ఉంది’’ అని బెల్లంకొండ సురేష్ చెప్పారు. మనీష్, సిమ్రన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి కాంబినేషన్లో రామ్ భీమన దర్శకత్వంలో ఆపిల్ స్టూడియోస్ పతాకంపై ఎం.శివరామిరెడ్డి నిర్మించిన ‘హమ్ తుమ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. బెల్లంకొండ సురేష్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సి.కల్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా మీద ఆసక్తితో లండన్ నుంచి ఇక్కడకు వచ్చాను. ఈ సినిమాతో పదిమంది ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్నాను’’ అని తెలిపారు. ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు బోలే, మనీష్ తదితరులు మాట్లాడారు.