Sehari Teaser Release Date, Sehari Movie Cast Telugu - Sakshi
Sakshi News home page

'సెహరి‌' టీజర్‌ డేట్‌ వచ్చేసింది..

Published Thu, Apr 15 2021 1:28 PM | Last Updated on Thu, Apr 15 2021 4:31 PM

Sehari Movie Teaser Will Be Release On April 16 - Sakshi

హర్ష్‌ కానుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ చిత్రం "సెహరి". సంగీత దర్శకుడు కోటి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. వర్గో పిక్చర్స్‌ బ్యానర్‌పై అద్వయ జిష్ణురెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్‌ 16న ఉదయం 9.45 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇదిలా వుంటే ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇక టీజర్‌ అనౌన్స్‌మెంట్‌కు కూడా సెహరి టీమ్‌ ప్రత్యేక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో అందరూ హీరోను 'బాలయ్య మిమ్మల్ని టచ్‌ చేశాడు కదూ.. మీరు వర్జిన్‌ స్టార్‌..' అంటూ ఆగమాగం చేస్తున్నారు. ఈ స్పెషల్‌ వీడియో కూడా జనాలను తెగ ఆకట్టుకుంటోంది. మరి రేపు రిలీజయ్యే టీజర్‌ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

చదవండి: తేజ సజ్జ ఇష్క్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

నటి లాక్‌డౌన్‌ బర్త్‌డే వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement