హమ్ తుమ్... | 'Hum Tum' Movie Audio Launched | Sakshi
Sakshi News home page

హమ్ తుమ్...

Published Thu, Dec 12 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

హమ్ తుమ్...

హమ్ తుమ్...

 ‘‘దర్శకుడు తేజ గతంలో ‘నువ్వు - నేను’ అని తీశాడు. ఈ దర్శకుడు ‘మేము-నువ్వు’ (హమ్ తుమ్) అని తీస్తున్నాడు. కథానాయిక ‘సుందరకాండ’లో అపర్ణలా చక్కగా ఉంది’’ అని బెల్లంకొండ సురేష్ చెప్పారు. మనీష్, సిమ్రన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి కాంబినేషన్‌లో రామ్ భీమన దర్శకత్వంలో ఆపిల్ స్టూడియోస్ పతాకంపై ఎం.శివరామిరెడ్డి నిర్మించిన ‘హమ్ తుమ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
 
 బెల్లంకొండ సురేష్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సి.కల్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా మీద ఆసక్తితో లండన్ నుంచి ఇక్కడకు వచ్చాను. ఈ సినిమాతో పదిమంది ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్నాను’’ అని తెలిపారు. ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు బోలే, మనీష్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement