Maneesh
-
తనను చెంప దెబ్బలు కొట్టడానికి మహిళను పనిలో పెట్టుకున్న ఓనర్!
భారతీయ-అమెరికన్ మనేష్ సేథి తనని చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను నియమించుకున్న కథనం ఇప్పుడు మళ్లీ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతుంది. ఈ పోస్టుకు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలలో ఒకరైన బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. అసలు విషయానికి వస్తే.. వేరబుల్ డివైసెస్ బ్రాండ్ పావ్ లోక్ వ్యవస్థాపకుడు మనేష్ సేథి. తను పనివేళల్లో ఎక్కువ శాతం ఫేస్బుక్ వినియోగిస్తుండేవాడు. దీనివల్ల అతని కంపెనీ మీద ఎక్కువ ప్రభావం పడింది. ఈ సమస్యను ఎలాగైనా అధిగమించడం కోసం ఒక ఆలోచన చేశాడు. తాను పనిచేస్తున్న వేళలో ఫేస్బుక్ వినియోగించిన ప్రతిసారీ అతని ముఖంపై చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను నియమించుకున్నాడు. దీనికోసం యుఎస్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్ మెంట్స్ వెబ్ సైట్ క్రెయిగ్స్లిస్ట్ లో ఒక ప్రకటన ఇచ్చాడు. "నేను పనివేళల్లో సమయాన్ని వృధాచేసినప్పుడు మీరు నాపై అరవాలి లేదా అవసరమైతే నన్ను చెంపదెబ్బ కొట్టండి" అని అతను 2012లో ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ఉద్యోగం కోసం ఎంపికైన వారికి గంటకు $8 డాలర్లు ఇస్తాను అన్నాడు. కారా అనే మహిళా ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యింది. స్లాపర్ కారాను నియమించిన తర్వాత మంచి ఫలితాలను వచ్చినట్లు మనేష్ సేథి తెలిపాడు. The story of Maneesh Sethi, the computer programmer who hired a woman to slap him in the face every time he used Facebook, resulting in massive productivity increase [read more: https://t.co/Q5fKjYtFSo] pic.twitter.com/d8pnt3Jd8k — Massimo (@Rainmaker1973) November 10, 2021 "సాదారణంగా నా సగటు ఉత్పాదకత 35-40% ఉండేది. కానీ, స్లాపర్ కారా నా పక్కన కూర్చున్నప్పుడు నా ఉత్పాదకత 98%కి పెరిగింది" అని అతను ఒక బ్లాగులో రాశాడు. ఈ స్టోరీ ఇప్పుడది కాదు. ఈ సంఘటన 2012లో జరిగింది. మళ్లీ ఈ పోస్టు ఇటీవల ఇంటర్నెట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతున్న పోస్టుపై టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. దీంతో మరింత ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోను ఒకసారి చూడండి. -
విద్యార్థిపై హాస్టల్ వార్డెన్ దౌర్జన్యం..
-
విద్యార్థిపై హాస్టల్ వార్డెన్ దౌర్జన్యం..
హైదరాబాద్: హయాత్‌నగర్‌లోని శ్రీచైతన్య హాస్టల్లో వార్డెన్ దౌర్జన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 8వ తరగతి చదవుతున్న మనీష్‌ను హాస్టల్ వార్డెన్ లక్ష్మణ్ కంటిపై కొట్టాడు. క్లాసుకు బుక్స్ తెచ్చుకోలేదన్న కోపంతో విచక్షణ లేకుండా విద్యార్థి మనీష్ తలను బెంచ్కేసి కొట్టాడు. ఈ దాడిలో విద్యార్థి కంటికి తీవ్రగాయమైంది. దాంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆస్పతి వైద్యులు మనీష్ కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. వార్డెన్ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హమ్ తుమ్...
‘‘దర్శకుడు తేజ గతంలో ‘నువ్వు - నేను’ అని తీశాడు. ఈ దర్శకుడు ‘మేము-నువ్వు’ (హమ్ తుమ్) అని తీస్తున్నాడు. కథానాయిక ‘సుందరకాండ’లో అపర్ణలా చక్కగా ఉంది’’ అని బెల్లంకొండ సురేష్ చెప్పారు. మనీష్, సిమ్రన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి కాంబినేషన్లో రామ్ భీమన దర్శకత్వంలో ఆపిల్ స్టూడియోస్ పతాకంపై ఎం.శివరామిరెడ్డి నిర్మించిన ‘హమ్ తుమ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. బెల్లంకొండ సురేష్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సి.కల్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా మీద ఆసక్తితో లండన్ నుంచి ఇక్కడకు వచ్చాను. ఈ సినిమాతో పదిమంది ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్నాను’’ అని తెలిపారు. ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు బోలే, మనీష్ తదితరులు మాట్లాడారు.