హయాత్నగర్లోని శ్రీచైతన్య హాస్టల్లో వార్డెన్ దౌర్జన్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 8వ తరగతి చదవుతున్న మనీష్ను హాస్టల్ వార్డెన్ లక్ష్మణ్ కంటిపై కొట్టాడు. క్లాసుకు బుక్స్ తెచ్చుకోలేదన్న కోపంతో విచక్షణ లేకుండా విద్యార్థి మనీష్ తలను బెంచ్కేసి కొట్టాడు. ఈ దాడిలో విద్యార్థి కంటికి తీవ్రగాయమైంది. దాంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆస్పతి వైద్యులు మనీష్ కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. వార్డెన్ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Sat, Sep 17 2016 12:29 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
Advertisement