అప్పుడప్పుడు చిన్న పిల్లలు అడిగే అమాయకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలికేం కాదు. అలాంటి సందర్భాల్లో చాలామంది ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. ఇదే పరిస్థితి బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్‌టన్‌కి ఎదురయ్యింది. కానీ ఆమె చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది.