తమిళనాడులోని తూత్తుకుడి విమానాశ్రయంలో సోమవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన 28 ఏళ్ల విద్యార్థిని లోయిస్ సోఫియాను అరెస్ట్ చేయడంపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెల్సిందే. ఇక్కడ ఎవరికి పట్టని విషయం ఏమిటంటే ఆ విద్యార్థినిపై రెండు బెయిలబుల్ సెక్షన్లతోపాటు ఓ నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసును దాఖలు చేయడం. అది కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో నిర్లిప్తంగా ఉండే న్యాయవ్యవస్థ.. సోఫియా అరెస్టు విషయంలో తమిళనాడు పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోలేక పోయింది.విమానాశ్రయంలో ‘బీజేపీస్ ఫాసిస్ట్ గవర్నమెంట్ డౌన్‌డౌన్’ అంటూ కెనడాలో పీహెచ్డీ చేస్తున్న సోఫియా గట్టిగా నినాదాలు చేయడంతో తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసాయి సౌందరరాజన్ ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అంతుకుముందు విమానంలో కూడా ఆమె అలాగే నినాదాలు చేశారని, అక్కడ తాను మౌనంగా ఉన్నానని, విమానాశ్రయంలోకి వచ్చాక అలా నినాదాలు చేయడం సబబేనా అని ప్రశ్నించగా, మళ్లీ నినాదాలు చేస్తానంటూ చేసిందని బీజేపీ నాయకురాలు ఫిర్యాదు చేశారు. విమానంలో సోఫియా నినాదాలు చేసిందనడానికి సాక్ష్యం లేదుగానీ, విమానాశ్రయంలో వారిద్దరికి మధ్య గొడవ జరగడం, సోఫియా నినాదాలు చేయడం, పోలీసులు సోఫియాను నిర్బంధంలోకి తీసుకోబోతే అటు వారికి, గొడవ చేస్తున్న బీజేపీ నాయకురాలికి తోటి ప్రయాణికులు సర్ది చెప్పడం, సోఫియాను వదిలేయాల్సిందిగా కోరడం అందుబాటులో ఉన్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
సోఫియాను అరెస్ట్ చేయడం అక్రమమే..!
Published Wed, Sep 5 2018 3:52 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
Advertisement