HUM TUM
-
తియ్యని భావన
ప్రేమంటే ఓ తియ్యని భావన. ఈ సినిమా చూస్తుంటే అలాంటి తియ్యని భావనకే లోనవుతారని దర్శకుడు రామ్ భీమన చెబుతున్నారు. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ముఖ్య తారలుగా యం. శివరామిరెడ్డి నిర్మించిన చిత్రం ‘హమ్ తుమ్’. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న ఈ ప్రేమకథా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రాల్లో ఇదో మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకం ఉంది. మహతి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ మంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. -
స్వరానందంలో హమ్‌తుమ్
మనీష్, సిమ్రన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘హమ్ తుమ్’. రామ్ భీమన దర్శకుడు. ఎం.శివరామిరెడ్డి నిర్మాత. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహతి స్వరసారథ్యంలో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోందని చిత్రం యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పాటల్లాగే సినిమా కూడా విజయం సాధిస్తుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుందని, నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్న వారిలా నటించారని దర్శకుడు చెప్పారు. ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, సూర్య, నాగినీడు, గుండు హనుమంతరావు, నందిని, ఐశ్వర్య తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జి.శివకుమార్, కూర్పు: నందమూరి హరి. -
హమ్ తుమ్...
‘‘దర్శకుడు తేజ గతంలో ‘నువ్వు - నేను’ అని తీశాడు. ఈ దర్శకుడు ‘మేము-నువ్వు’ (హమ్ తుమ్) అని తీస్తున్నాడు. కథానాయిక ‘సుందరకాండ’లో అపర్ణలా చక్కగా ఉంది’’ అని బెల్లంకొండ సురేష్ చెప్పారు. మనీష్, సిమ్రన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి కాంబినేషన్లో రామ్ భీమన దర్శకత్వంలో ఆపిల్ స్టూడియోస్ పతాకంపై ఎం.శివరామిరెడ్డి నిర్మించిన ‘హమ్ తుమ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. బెల్లంకొండ సురేష్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సి.కల్యాణ్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా మీద ఆసక్తితో లండన్ నుంచి ఇక్కడకు వచ్చాను. ఈ సినిమాతో పదిమంది ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్నాను’’ అని తెలిపారు. ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశామని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు బోలే, మనీష్ తదితరులు మాట్లాడారు. -
యువతకు నచ్చే హమ్ తుమ్
‘‘ప్రస్తుతం యువతరాన్ని ఆకట్టుకునే సినిమాలకు బాగా ఆదరణ దక్కుతోంది. ఈ ‘హమ్ తుమ్’ కూడా యువతను లక్ష్యంగా చేసుకునే చేశారు’’ అని సాగర్ అన్నారు. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ముఖ్యతారలుగా రామ్ భీమన దర్శకత్వంలో ఎమ్.శివరామిరెడ్డి నిర్మిస్తున్న ‘హమ్ తుమ్’ టీజర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని, మహతి మంచి స్వరాలందించారని దర్శకుడు చెప్పారు. హీరోగా తనకిది తొలి చిత్రమని మనీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా అశోక్‌కుమార్, ప్రసన్నకుమార్, అంకమ్మరావు, దాము, ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛమైన ప్రేమ గెలుస్తుంది!
స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉందనే కాన్సెప్ట్‌తో ఆపిల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘హమ్ తుమ్’. టైటిల్ చదివి, ఇదేదో హిందీ సినిమా అనుకునేరు. అచ్చమైన తెలుగు సినిమా అంటున్నారు యమ్. శివరామిరెడ్డి. ‘ఈరోజుల్లో’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించిన ఆయన ‘హమ్ తుమ్’ ద్వారా సోలో నిర్మాతగా మారారు. రామ్ బిమానను దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. మహతి స్వరపరచిన ఈ చిత్రం పాటలను వచ్చే నెల రెండో వారంలో, సినిమాని అదే నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ కథకు ఈ టైటిలే కరెక్ట్ కాబట్టి పెట్టాం.. చక్కని ప్రేమకథా చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందనే నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ యువతీయువకుడు ఒకరిపట్ల ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. ఆ ప్రభావం ప్రేమకు దారి తీస్తుంది. అనంతరం వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కథాంశం’’ అన్నారు. మనీష్, సిమ్రాన్, నిఖిల్ చక్రవర్తి, ఐశ్వర్య, ఎమ్మెస్, ధర్మవరపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహరచయితలు: దుర్గా చేపూరి, మురళి మడిచర్ల, కెమెరా: జి. శివకుమార్.