స్వరానందంలో హమ్‌తుమ్
స్వరానందంలో హమ్‌తుమ్
Published Tue, Jan 7 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
మనీష్, సిమ్రన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘హమ్ తుమ్’. రామ్ భీమన దర్శకుడు. ఎం.శివరామిరెడ్డి నిర్మాత. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహతి స్వరసారథ్యంలో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోందని చిత్రం యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పాటల్లాగే సినిమా కూడా విజయం సాధిస్తుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుందని, నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్న వారిలా నటించారని దర్శకుడు చెప్పారు. ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, సూర్య, నాగినీడు, గుండు హనుమంతరావు, నందిని, ఐశ్వర్య తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జి.శివకుమార్, కూర్పు: నందమూరి హరి.
Advertisement
Advertisement