స్వచ్ఛమైన ప్రేమ గెలుస్తుంది!
స్వచ్ఛమైన ప్రేమ గెలుస్తుంది!
Published Thu, Oct 31 2013 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉందనే కాన్సెప్ట్‌తో ఆపిల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘హమ్ తుమ్’. టైటిల్ చదివి, ఇదేదో హిందీ సినిమా అనుకునేరు. అచ్చమైన తెలుగు సినిమా అంటున్నారు యమ్. శివరామిరెడ్డి. ‘ఈరోజుల్లో’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించిన ఆయన ‘హమ్ తుమ్’ ద్వారా సోలో నిర్మాతగా మారారు. రామ్ బిమానను దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. మహతి స్వరపరచిన ఈ చిత్రం పాటలను వచ్చే నెల రెండో వారంలో, సినిమాని అదే నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ కథకు ఈ టైటిలే కరెక్ట్ కాబట్టి పెట్టాం.. చక్కని ప్రేమకథా చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందనే నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ యువతీయువకుడు ఒకరిపట్ల ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. ఆ ప్రభావం ప్రేమకు దారి తీస్తుంది. అనంతరం వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కథాంశం’’ అన్నారు. మనీష్, సిమ్రాన్, నిఖిల్ చక్రవర్తి, ఐశ్వర్య, ఎమ్మెస్, ధర్మవరపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహరచయితలు: దుర్గా చేపూరి, మురళి మడిచర్ల, కెమెరా: జి. శివకుమార్.
Advertisement
Advertisement