తియ్యని భావన
ప్రేమంటే ఓ తియ్యని భావన. ఈ సినిమా చూస్తుంటే అలాంటి తియ్యని భావనకే లోనవుతారని దర్శకుడు రామ్ భీమన చెబుతున్నారు. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ముఖ్య తారలుగా యం. శివరామిరెడ్డి నిర్మించిన చిత్రం ‘హమ్ తుమ్’. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న ఈ ప్రేమకథా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రాల్లో ఇదో మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకం ఉంది. మహతి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.