శివరామిరెడ్డి తల్లి లలితమ్మ అనారోగ్యంతో మృతి
ఆమె కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పరామర్శ
వజ్రకరూరు/ఉరవకొండ: ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాతృమూర్తి వై.లలితమ్మ(85) భౌతిక కాయానికి గురువారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులరి్పంచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో కుటుంబీకులు ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కొనకొండ్లకు తీసుకొచ్చారు.
సీఎం జగన్ గురువారం బనగానపల్లిలో ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాఫ్టర్‌లో కొనకొండ్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా లలితమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుమారులు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు వై.వెంకట్రామిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు వై.సీతారామిరెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎంతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, అనంతపురం కలెక్టర్ గౌతమి, జేసీ కేతన్‌గార్గ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి తదితరులు లలితమ్మకు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment