lalitamma
-
ఆరుపదుల్లో ఏడడుగులు
లలితమ్మకు అరవై దాటాయి. భర్తపోయాడు. ఇద్దరు పిల్లలు. కొడుకు కుటుంబం యూఎస్‌లో ఉంది. కూతురు తన కుటుంబంతో జీవిస్తోంది. జీవితం లలితమ్మను క్రాస్‌రోడ్‌లో నిలబెట్టింది. మీరంగీకరిస్తే పెళ్లి చేసుకుందాం... అంటూ ఒక ప్రతిపాదన. ఇప్పుడామె ఏం చేయాలి? ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఓ రోజు కొడుక్కి ఫోన్ చేస్తే కోడలు మాట్లాడింది.తన ఆరోగ్య పరిస్థితిని గుర్తు చేస్తూ ‘మీరు నా బాధ్యత తీసుకునే కండిషన్లో లేరని అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ఆ విషయం అబ్బాయితో చెప్పడానికి ఫోన్ చేశాను’ అన్నది. ఆ కోడలు భర్తకి ఫోన్ ఇవ్వకుండానే ‘అత్తయ్యా మీ సంతోషమే మా సంతోషం’ అని ఫోన్ పెట్టేసింది. ‘మీకు మేమున్నాం’ అనే మాట కోసం ఎదురు చూసిన లలితమ్మకు పెళ్లి ఒక్కటే ఆమెకున్న దారి అని చెప్పకనే చెప్పినట్లయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ రోజులివి! ఏదో ఒక ఇంట్లో కాదు, సమాజంలో సగానికి పైగా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉందన్నారు తోడు– నీడ రాజేశ్వరి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇప్పుడు దాదాపుగా అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. వీటిలో గ్రాండ్ పేరెంట్స్ కి స్థానం లేదు. పిల్లలు పుట్టినప్పటి నుంచి నానమ్మ, తాతయ్య అంటే అతిథులుగా వచ్చిపోయేవాళ్లేననే భావనతోనే పెరుగుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు ఇంట్లోనే అనాథల్లా బతుకీడ్చడానికి ఇష్టపడడం లేదు పెద్దవాళ్లు. నగరంలో సీనియర్ సిటిజెన్ హోమ్స్ ఇలాంటి అవసరం నుంచి మొగ్గతొడినవే. భార్యాభర్త ఇద్దరూ జీవించి ఉన్నంత వరకు పిల్లలతో కలిసి ఉండాలనుకోవడం లేదు. తమకు తాముగా హాయిగా ఉంటున్నారు. వారిద్దరిలో ఒకరు జీవితం చాలించినప్పుడు రెండోవాళ్లు ఒంటరి పక్షులవుతున్నారు. అలాంటి వారికి పెళ్లి బంధంతో ఒక ఆలంబన చేకూర్చడం అవసరం. చివరి శ్వాస వరకు మనిషికి ఎమోషనల్ బాండింగ్ అవసరమే. ఆ బాండింగ్ పెళ్లితోనే సాధ్యం. సహజీవనమూ సమాధానమే!‘‘నేను చేసిన పెళ్లిళ్లలో విజయవాడకు చెందిన కోటేశ్వరరావు, రాజేశ్వరి పెళ్లి ప్రత్యేకం. అయితే అరవైలలో పెళ్లి మాత్రమే కాదు, సహజీవనం కూడా ప్రోత్సహించాల్సిన విషయమే. ఇటీవల కొంతమంది విషయంలో లివ్ ఇన్ రిలేషన్షిప్నే ప్రోత్సహిస్తున్నాను. సంపన్న కుటుంబాల్లో పెద్దవాళ్ల పెళ్లి ఆస్తి తగాదాలకు దారి తీస్తోంది. బ్యాంకు మేనేజర్‌గా రిటైరైన అరవై ఏళ్ల వ్యక్తి, అదే వయసున్న గృహిణి సహజీవనంలో ఉన్నారు. వాళ్లకిద్దరికీ పిల్లలున్నారు. మొదటిరోజే అతడి పిల్లలతో స్పష్టంగా ‘మీ ఆస్తి నాకు వద్దు, సవతి తల్లి అనే భావనలో ఉండవద్దు. మీ నాన్న సంరక్షణ చూసుకునే కేర్‌టేకర్‌ని మాత్రమే. నా సంరక్షణ చూసుకునే బాధ్యత మీ నాన్నది. నా కారణంగా మీరు మీ నాన్నకు దూరం కావద్దు. అలాగే నా పిల్లలూ నాకు దూరం కారు’ అని స్పష్టంగా చెప్పింది.. ఇరువురి పిల్లలూ ఆమోదించారు. కొడుకులు –కోడళ్లు, కూతుళ్లు– అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు పండుగలకు వస్తుంటారు’’ అంటూ వాలుతున్న ΄÷ద్దులో తాను పూయించిన వెలుగు సుమాలను ‘సాక్షి’తో పంచుకున్నారు తోడు – నీడ రాజేశ్వరి. ఆ క్షణం నుంచి మందు ముట్టలేదు భార్యపోయిన తర్వాత మద్యంతో సేదదీరడం అలవాటైంది. రాజేశ్వరిని పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత ఒకసారి విరేచనాలతో తీవ్రంగా బాధపడ్డాను. నాకేదయినా అయితే... అనే ఆలోచన నన్ను భయపెట్టింది. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రాజేశ్వరి పండుగలప్పుడు పట్టుచీర కట్టుకుని పూలు పెట్టుకుని ఇంట్లో సంతోషంగా ఉండడం కళ్ల ముందు మెదిలింది. ఆమె సంతోషం ఎక్కువకాలం నిలవాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా అనుకున్నాను. ఆ క్షణం నుంచి మద్యం ముట్టుకోలేదు. – కోటేశ్వరరావుపన్నెండేళ్ల బాంధవ్యం మాది పెళ్లినాటికి నాకు 62, ఆయనకు 72. ఆయనతో అంతకు ముందు పరిచయం లేదు, కానీ ఒకరి గురించి మరొకరు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. వయసురీత్యా ఎదురయ్యే ఆరోగ్యసమస్యలు తప్ప ఇతర అనారోగ్యాలేమీ లేవు. ఒకరికి అవసరమైనవి మరొకరు సమకూర్చి పెట్టుకుంటూ ఒకరినొకరు చంటిపిల్లల్లా చూసుకుంటున్నాం. ఈ జీవితం బాగుంది. రెండేళ్ల కిందట మా పిల్లలు బంధువులంతా కలిసి పదేళ్ల వేడుక కూడా చేశారు. – రాజేశ్వరి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎమ్మెల్సీ మాతృమూర్తికి సీఎం జగన్ నివాళి
వజ్రకరూరు/ఉరవకొండ: ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాతృమూర్తి వై.లలితమ్మ(85) భౌతిక కాయానికి గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులరి్పంచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో కుటుంబీకులు ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కొనకొండ్లకు తీసుకొచ్చారు. సీఎం జగన్ గురువారం బనగానపల్లిలో ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాఫ్టర్‌లో కొనకొండ్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా లలితమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుమారులు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు వై.వెంకట్రామిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు వై.సీతారామిరెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎంతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, అనంతపురం కలెక్టర్ గౌతమి, జేసీ కేతన్‌గార్గ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి తదితరులు లలితమ్మకు నివాళులర్పించారు. -
తల్లి కర్మ నిర్వహిస్తూ మరణించిన కుమారుడు
తల్లికి కర్మకాండలు చేస్తూ ఓ యువకుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన పులకాని లలితమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు నీటి గుంతలోపడి ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతి చెందిన నాటి నుంచి ఆమె కుమారుడు ఉపేందర్(27) తీవ్ర మనోవేదనతో ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం ఆమె కర్మకాండలు ఏర్పాటు చేశారు. కర్మకాండలు నిర్వహిస్తున్న ఉపేందర్ తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
చింతామణి : ప్రేమానురాగాలు పంచాల్సిన భర్త అనుమానంతో భార్యను గొంతుకోసి కడతేర్చాడు. ఈ ఘటన బట్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎగువ కోట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఇరగంపల్లి గ్రామానికి చెందిన లలితమ్మ(32)కు 20 యేళ్ల క్రితం రామచంద్రప్పతో వివాహమైంది. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. లలితమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని రామచంద్రప్ప తరచూ గొడవపడేవాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రామచంద్రరప్ప అర్ధరాత్రి సమయంలో తిరిగి వచ్చి నిద్రిస్తున్న లలితమ్మను వేటకొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. బిత్తరపోయిన పిల్లలు కేకలు వేయడంతో రామచంద్రప్ప పారిపోయాడు. స్థానికులు వెళ్లి పరిశీలించగా అప్పటికే లలితమ్మ విగతజీవిగా కనిపించింది. శనివారం ఉదయం బట్లపల్లి రూరల్ సీఐ వెంకటేశ్‌మూర్తి స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతామణి ప్రభుత్వానికి తరలించారు. నిందితుడు రామచంద్రమూర్తిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా తల్లి హత్యకు గురికావడం, తండ్రి కటకటాలపాలు కావడంతో ఆ దంపతుల పిల్లలు అనాథలుగా మారారు. -
డీఎస్పీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు: వీఆర్‌కు పంపడంపై మనస్తాపం చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలోని చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లలితమ్మ పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నూలులో పోలీస్ కానిస్టేబుళ్లను మూకుమ్మడిగా అధికారులు వీఆర్‌కు పంపడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.