sivarami reddy
-
ఎమ్మెల్సీ మాతృమూర్తికి సీఎం జగన్ నివాళి
వజ్రకరూరు/ఉరవకొండ: ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాతృమూర్తి వై.లలితమ్మ(85) భౌతిక కాయానికి గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులరి్పంచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో కుటుంబీకులు ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కొనకొండ్లకు తీసుకొచ్చారు. సీఎం జగన్ గురువారం బనగానపల్లిలో ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాఫ్టర్‌లో కొనకొండ్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా లలితమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుమారులు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు వై.వెంకట్రామిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు వై.సీతారామిరెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎంతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, అనంతపురం కలెక్టర్ గౌతమి, జేసీ కేతన్‌గార్గ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి తదితరులు లలితమ్మకు నివాళులర్పించారు. -
నేటి తరానికి ఆదర్శమూర్తి లలితమ్మ
దేశం కోసం యుద్ధంలో పోరాడే సైనికుడిని రణభూమికి పంపించే తల్లి ఎంత గొప్పదో.. అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజాసేవ చేసే రాజకీయాల్లోకి పంపించడం కూడా అంతే గొప్పది. కొడుకు రాజకీయాల్లోకి వెళ్తానంటే అడ్డుపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. కానీ.. తన కుమారులందరినీ ప్రజాసేవకు అంకితం చేసింది ఆ మాతృమూర్తి. ప్రజాభిమానం కలలు కంటే వచ్చేది కాదని.. బతికినన్ని రోజులు జనాన్ని ఇంటివాళ్లుగా భావించాలని చెబుతూ వారిని ప్రజాప్రతినిధులుగా మార్చింది. ఉగ్గుపాలతోనే కొడుకులకు ప్రజాసేవ నేర్పించిన ఆ తల్లి.. ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దేవుడు ఆత్మకు మాత్రమే బాధ్యత వహిస్తాడు. కానీ అమ్మ ఆత్మకూ, శరీరానికీ బాధ్యత వహిస్తుంది. అందుకే.. తన పిల్లలపై జీవితాంతం నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. తన పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడి సిరిసంపదలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. మాతృమూర్తులంతా ఒకేలా ఆలోచించరు. కేవలం తాము.. తమ కుటుంబం అని కాకుండా.. దేశం కోసం పరితపించే తల్లులు ఎందరో ఉన్నారు. వారి వల్లే ఎంతోమంది సైనికులుగా సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనం నిర్భయంగా జీవించేలా ధైర్యాన్నిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మ పేరు ఎల్లారెడ్డిగారి లలితమ్మ. ఈ తల్లి కూడా తన పిల్లలను దేశ సేవకే అంకితం చేయాలని భావించారు. తండ్రి వారసత్వంగా కొడుకులందరినీ ప్రజాసేవలో తరలించేలా చేశారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా తన ఐదుగురు కొడుకులను ప్రజాప్రతినిధులుగా మార్చిన ఆమె... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక టీటీడీ బోర్డు మెంబర్‌ను ఇచ్చారు. బతికున్నంత కాలం కుమారులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన లలితమ్మ.. 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మంలం కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో కర్నూలు జిల్లాలోని బద్నాల గ్రామానికి చెందిన లలితమ్మకు 12 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె. తొలి నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న భీమిరెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రెండేళ్లకే భీమారెడ్డి కన్నుమూశారు. ఆ తర్వాత కుమారులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన లలితమ్మ.. వారికి దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. ప్రజాభిమానం అనేది కలలు కంటే వచ్చేది కాదని.. ఎప్పటికీ ప్రజలను ఇంటివాళ్లుగానే భావించాలని తొలి నుంచీ వారికి చెప్పుకుంటూ వచ్చారు. ప్రజాసేవలో అనుసరించాల్సిన విధానాలతోపాటు ఎన్నికల వ్యూహాలపై కుమారులకు సలహాలు ఇచ్చేవారు. అమ్మ మాట ప్రకారమే నడుచుకున్న లలితమ్మ కొడుకులు ఇప్పుడు ఉన్నత స్థానంలో నిలిచి ప్రజాసేవలో తరిస్తున్నారు. భీమిరెడ్డి-లలితమ్మ కుమారుల్లో జయరామిరెడ్డి ఇప్పటికే మృతిచెందగా.. కూతురు వరలక్ష్మి గుంతకల్లులో నివాసముంటున్నారు. ఇక మొదటి కొడుకు సీతారామిరెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తుండగా.. శివరామిరెడ్డి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక వెంకట్రామిరెడ్డి గుంతకల్లు, సాయిప్రసాద్‌రెడ్డి ఆదోని, బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేలుగా ప్రజా సేవ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు చేరవేయడమే కాదు.. తమకున్నంతలో చేయూతనిచ్చి ఆదుకోవాలని లలితమ్మ చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తారు ఆమె కుమారులు. అందుకే పేదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, కొత్త బట్టలు అందించడం, ఆర్థిక స్థోమత లేని వారిని చదివించడం వంటి సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తండ్రి, కుమారులతో కలిపి ఒకే ఇంటి నుంచి ఏకంగా ఆరుగురు రాష్ట్రానికి సేవలందించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తండ్రి చనిపోయినా.. ఆ లోటు లేకుండా పిల్లలను పెంచి పెద్దచేసి వారిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన లలితమ్మ.. నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. -
YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం
గుంతకల్లుటౌన్(అనంతపురం జిల్లా): ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్–వైవీఆర్ క్యాంటీన్’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్‌పీరా, సీనియర్ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టు నేత శివరామిరెడ్డి కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: సీనియర్ కమ్యూనిస్టు నేత, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) రాజధానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శివరామిరెడ్డి గురువారం బ్రెయిన్ డెడ్‌కు గురికావడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసిన వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు డా. గురుప్రసాద్ శుక్రవారం ప్రకటించడంతో శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శివరామిరెడ్డికి భార్య కొండమ్మ, కుమార్తెలు కల్పన, భగీరథి, ఝాన్సీ కుమారుడు భరద్వాజ్ రెడ్డి, అలుళ్లు, కోడళ్లు్ల, మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. శివరామిరెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సాయంత్రం 3గంటల వరకూ బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని ఆయన కుమార్తె సజ్జల భగీరథి నివాసంలో ఉంచారు. ఇంటికి చేరుకున్న ఎన్ఎస్ భౌతికాయం చూడగానే ఆయన భార్య కొండమ్మ దుఖాన్ని ఆపుకోలేకపోయారు. ఎన్ఎస్ కుమారుడు భరద్వాజ్, కుమార్తెలు ఝాన్సీ, భగీరథిలు, అల్లుడు సజ్జల దివాకర్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. శివరామిరెడ్డిని కడసారిగా చూసేందుకు ఆయన బంధుమిత్రులు, సీపీఐ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సురవరం సతీమణి విజయలక్ష్మి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏపీ ఏఐటీయూసీ కార్యదర్శి గుజ్జుల ఓబులేశు, సీపీఐ కడప జిల్లా కా>ర్యదర్శి జి.ఈశ్వరయ్యలు పార్టీ జెండాను శివరామిరెడ్డి భౌతికాయంపై ఉంచి విప్లవ జోహర్లు అర్పించారు. నివాళులర్పించిన వారిలో సంపాదకులు ఏబీకే ప్రసాద్, గజ్జల అశోక్‌రెడ్డి, జె. శివాజీరెడ్డి, డాక్టర్ ఎన్ కరుణాకర్ రెడ్డి, ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఎన్ విశ్వేశ్వర్ రెడ్డి, ఎన్ సునీల్ రెడ్డి, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, పాలెం రఘునాథరెడ్డి, పి. సుదర్శన్ రెడ్డి సీపీఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి, డాక్టర్ డి. సుధాకర్, ఎన్ బాలమల్లేశ్, ఎల్. నాగ సుబ్బారెడ్డి, డబ్ల్యూ.వి. రాము, చెన్నకేశవరెడ్డి, వెంకట శివ, మైదుకూరు రమణ, డాక్టర్ సూరారెడ్డి, ఈటీ నరసింహ, ప్రజాపక్షం సంపాదకులు కె. శ్రీనివాసరెడ్డి, సీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు చెన్నకేశవరావు, కేవీఎల్, డాక్టర్ రజని, ఐజేయూ నాయకురాలు అజిత తదితరులు ఉన్నారు. తొలితరం ప్రజాప్రతినిధి.. వైఎస్సార్ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి(ఎన్ఎస్) స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నేత. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1952లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర నేతగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు. 2000 ఫిబ్రవరి1 నుంచి సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉంటూ నీలం రాజశేఖర్‌రెడ్డి, వైవీ కృష్ణారావుల అభినందన సంచికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు. వైఎస్ జగన్ సంతాపం సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
చంద్రబాబుది కార్పొరేట్ పాలన: శివరామిరెడ్డి
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన అరోపించారు. ఓట్లు నమోదుచేయిస్తేనే ప్రాక్టికల్స్‌లో మార్కులంటూ.. చైతన్య, నారయణ కాలేజీలు విద్యార్థులను మభ్యపెడుతున్నాయని, చంద్రబాబుది కార్పొరేట్ పాలన అని విమర్శించారు. -
సంగమ్మ చెక్కిన శిల్పం మా అమ్మ
ఎన్.శివరామిరెడ్డి ‘‘నాలో మీకు ఏదైనా మంచి లక్షణాలు కనిపిస్తే... అవి మా మేనత్త సంగమ్మ నేర్పించినవి, కమ్యూనిస్టు పార్టీ అలవరిచినవే. నాలో మీకు కనిపించే చెడు మాత్రం నాకు స్వతహాగా జన్మతః అబ్బిన గుణం’’... ఈ మాటలన్నది సీనియర్ నాయకులు నర్రెడ్డి శివరామిరెడ్డి. ఆయన స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధి. ఇప్పుడు 95వ ఏట భార్య కొండమ్మతోపాటు హైదరాబాద్‌లోని సిఆర్ (చండ్ర రాజేశ్వర్‌రావు) ఫౌండేషన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘గంగమ్మ జన్మనిచ్చింది, సంగమ్మ మనిషిగా నిలబెట్టింది’ అన్నారు. ‘‘అమ్మకు నాకంటే ముందు ముగ్గురు పిల్లలు. నేను నాలుగోవాడిని. నాకు నాలుగేళ్లు నిండేలోపే మా అమ్మ పోయింది. మా మేనత్త సంగమ్మ పెంపకంలో నాకు అమ్మ లేదనే సంగతే గుర్తురాలేదు. మా నాయన, ఇద్దరు చిన్నాయనలు... ముగ్గురు సోదరులకు కలిపి మా మేనత్త ఒక్కటే ఆడపడుచు. ఆమె అంటే అందరికీ గారాబమే. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించకుండా మామ కైలాస్నాథ్రెడ్డిని ఇల్లటం (ఇల్లరికం) తెచ్చుకున్నారు. అలా మా మేనత్త మా ఇంట్లోనే ఉండేది. పుట్టినప్పటి నుంచి నన్ను ఎత్తి తిప్పడం, అన్నం తినిపించడం అన్నీ తనే చేసేది. మా అమ్మ ఉన్నన్ని రోజులూ తన ముచ్చట కొద్దీ మాకు సేవలు చేసింది. అమ్మ పోయిన తర్వాత తానే మాకు అమ్మయింది. మాది వ్యవసాయ కుటుంబం. మూడు గాండ్ల ఎద్దులు (మూడు జతల ఎడ్లు), ఐదారు పాలిచ్చే గేదెలుండేవి. సేద్యగాళ్లతోపాటు ఇంట్లో అందరూ పని చేసేవాళ్లు. ఆడవాళ్లు కూడా పొలానికెళ్లి పనులు చేయించుకునే వాళ్లు. మా మేనత్త ఇంట్లో మమ్మల్ని చక్కబెటుకుని పొలానికెళ్లేది. జొన్న, కొర్ర, వేరుశనగ పంటలు, చీనీచెట్లలో పనులు దగ్గరుండి చేయించుకునేది. పండుగ వస్తోందంటే... నా కోసం కజ్జికాయలు, అత్తరాసాలు, లడ్డులు చేసి డబ్బాల్లో పెట్టేది. సెలవులకు ఇంటికి రాగానే ముందు వాటిని పెట్టి నేను తిన్న తర్వాతనే ‘ఎలా చదువుకుంటున్నావు’ అని అడిగేది. మా మేనత్త తన పిల్లల కంటే నా కోసమే ఎక్కువ ఆదుర్దా పడుతుంటుందని మా పిన్నమ్మలు, నానమ్మ అనేవారు. ‘కాలేజీలో ఏం పెడతారో, ఏం తింటాడో. మిగిలిన పిల్లలంతా ఇంట్లో ఉంటారు, ఎప్పుడేది కావాలంటే అది తింటారు. వాళ్లకు నేను చెప్పేదేముంటది’ అనేదట. మా ఇంట్లో నేను తొలితరం విద్యావంతుణ్ని. దాంతో నేనంటే పెద్దవాళ్లకు ఇష్టం, చిన్నవాళ్లకు గౌరవం. మా నాయన నా మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. పెద్ద చదువులు చదివించాలని, నేను పెద్ద ఉద్యోగం చేస్తే చూడాలని కలలు కన్నాడు. నేను లా కోర్సులో చేరిన తర్వాత లాయరుగా పేరు తెచ్చుకుంటే చూడాలనుకున్నాడు. అయితే... నేను ఇంగ్లిష్ చదువుల ప్రభావంతో ఆయన కోరుకున్నదానికంటే ఎక్కువ చైతన్యవంతం అయ్యాను. నేను నేర్చుకున్న సిద్ధాంతాలతో ఆయనను బేరీజు వేసుకుంటే నాయన తీరు నచ్చేది కాదు. దాంతో ఆయన్నే ప్రశ్నించేవాడిని. ఓ రోజు ఆయన దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్లందరినీ పిలిపించి, అప్పు తీర్చాల్సిన పని లేదని చెప్పి వాళ్లు రాసిచ్చిన దస్తావేజులను ఇచ్చేశాను. మా మేనత్తకు ఆస్తి పంపకంలో మా నాయన న్యాయంగా వ్యవహరించడం లేదనిపించింది. కొడుకుల ముగ్గురితోపాటు కూతురికి కూడా ఆస్తిలో సమభాగం ఇవ్వాలనుకున్నాడు మా తాత. ఆమె పెళ్లి సందర్భంగా అలా అంగీకారమైంది. ఆనాడే పంచి ఉంటే ఏ గొడవా ఉండేది కాదేమో. నా కళ్లెదురుగా మా మేనత్తకు అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయాను. అలాగని నాయనను ఎదిరించి మాట్లాడితే పరిష్కారమయ్యే పరిస్థితీ కనిపించ లేదు. ఊరి వాళ్లకు దస్తావేజులు ఇచ్చేసినంత సులువుగా పరిష్కారమవుతుందని కూడా అనిపించలేదు. నాలో మేనత్తకు న్యాయం చేయాలనే ఆవేశం ఉంది కానీ స్వయంగా పరిష్కరించగలిగిన శక్తి ఉన్నట్లు అనిపించలేదు. దాంతో పక్క ఊళ్లకు వెళ్లి ఆ ఊళ్ల పెద్దవాళ్లకు చెప్పి, వారందరినీ తీసుకువచ్చి ఇంట్లో పంచాయితీ పెట్టించాను. అలా మా మేనత్తకు సమానంగా ఆస్తి వచ్చింది. అప్పుడామె నన్ను దగ్గరకు తీసుకుని ‘నిన్ను సాకిన రుణం ఇలా తీర్చుకున్నావా’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పరిస్థితిలో కూడా ‘నాన్నతో ఊరికే గొడవ పడొద్దు. నువ్వే పోయి పలకరించు’ అని చెప్పింది. సిద్ధాంతపరంగా విభేదించినా ఆత్మీయత పరంగా దూరం కాకూడదనే గొప్ప గుణం నాలో నెలకొల్పింది. ఆమె ఏ గొప్ప పుస్తకమో చదివి ఇంత గొప్ప మాట చెప్పలేదు. ఆమె మనసు అంత గొప్పది. అందుకే అలా చెప్పగలిగింది. మేనత్తకు నేను చేయగలిగింది చేశాను కానీ, నేను చేసింది రుణం తీరేటంత పెద్ద పని కాదు. ఏం చేసినా ఆ రుణం తీరదు. ఆమె ప్రేమను చెప్పడానికి... నాకు మాటలు చాలవు. ఆమె చూపిన ఆదరం, నా పట్ల వ్యక్తమైన ఆత్మీయతను నా కళ్లతో చూడాల్సిందే, నా మనసుతో తెలుసుకోవాల్సిందే’’. అమ్మ పోయిన తర్వాత మేనత్తే మాకు అమ్మయింది. మా కంట కన్నీరు రాకుండా పెంచడం తన బాధ్యత అన్నట్లు సాకింది. నేనేమి చేసినా, ఎంత చేసినా ఆ తల్లి రుణం తీరదు. ఆమె ప్రేమను చెప్పడానికి... అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పలేను. ఆ ఆదరం నా కళ్లకే కనిపిస్తుంది. ఆ ఆత్మీయత నా మనసుకు మాత్రమే అర్థమవుతుంది. కడప జిల్లా గడ్డం వారి పల్లెలో పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. -వాకా మంజులారెడ్డి -
దిష్టి తీస్తామని.. రూ. 76 వేలతో పరార్!
గృహిణికి కి‘లేడీ’ల టోకరా మాదాపూర్: ఁమీ పాపకు దిష్టి తగిలింది, పూజలు చేసి దిష్టి తీస్తాం*.. అని మాయమాటలు చెప్పి ఇద్దరు మాయ్ఙలేడీ*లు రూ. 76 వేలతో ఉడాయించారు. మాదాపూర్ సీఐ శశాంక్‌రెడ్డి కథనం ప్రకారం.. స్థానిక అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉండే వ్యాపారి శివరామిరెడ్డి (60) ఇంటికి సోమవారం ఉదయం 7.30కి ఇద్దరు గుర్తు తెలియని మహిళలు వచ్చారు. తాము దగ్గరలో ఉండే గుడిలో పూజలు చేస్తామని, బోనాల పండుగ సందర్భంగా ప్రసాదం చేసేందుకు బియ్యం, బెల్లం కావాలని అడిగారు. మీకు శుభం జరుగుతుందని శివరామిరెడ్డి భార్యకు బొట్టు పెట్టారు. ఆమె బియ్యం తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా వారు కూడా ఆమె వెనుకే వెళ్లారు. ఁ్ఙమీ పాపకు ఆరోగ్యం బాగలేదు.. దిష్టితీయాలి. పూజ చేసి దిష్టి తీస్తే శుభం జరుగుతుంది. ఇంట్లో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు పూజలో పెట్టండి** అన్నారు. దీంతో ఆమె అమ్మాయి ఫీజు చెల్లించేందుకు తెచ్చిన రూ. 76 వేలు వారి బుట్టలో పెట్టింది. వారు డ బ్బును వస్త్రంలో మూట కట్టి.. బుట్టలో పెట్టి పూజ చేసినట్టు నటించారు. తర్వాత ఆ మూటలను ఆమెకు ఇచ్చి కబోర్డులో పెట్టి.. తాము వెళ్లాక తెరవమని చెప్పారు. అపార్ట్మెంట్ కింది వరకు పసుపు నీళ్లు చల్లాలని శివరామిరెడ్డి భార్యను కూడా తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత ఆమె వచ్చి మూటను విప్పగా డబ్బులు లేవు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు పెద్ద బొట్టు పెట్టుకొని, పట్టుచీర కట్టుకొని ఉందని, వయసు సుమారు 45 ఏళ్లు ఉంటాయని, మరో మహిళకు 30 ఏళ్లు ఉంటాయని, తెలుగు బాగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలకు చిక్కిన ఆ అగంతుకురాళ్ల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. -
అమ్మా.. సలామ్!
52 ఏళ్లుగా కొడుకు సేవలో తల్లి కంటికి రెప్పలాకాపాడుకుంటున్న మాతృమూర్తి మహబూబ్ నగర్ : ప్రపంచంలో మాతృమూర్తి ప్రేమ వెలకట్టలేనిది.. భూమికి భారమైనా తన కొడుకు తనకు మాత్రం చంటిపిల్లాడే అంటోంది ఆ తల్లి.. కాళ్లూచేతులు లేని ఆ బిడ్డకు 52 ఏళ్లుగా సేవచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన పెద్ద వెంకట్‌రెడ్డి, ప్రమీలమ్మ దంపతుల రెండో కొడుకు 52ఏళ్ల శివరామిరెడ్డికి పుట్టుకతోనే పోలియోతో కాళ్లు, చేతులు పనిచేయకుండా పోయాయి. ఐదు దశాబ్దాలుగా మంచంపైనే ఆయనకు తిండితిప్పలు. ఇదిలాఉండగా, మొ దటి కొడుకు అనారోగ్యానికి గురికావడంతో బాగుచేయించేందుకు ఉన్న పొలమంతా అ మ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇంతలో ఆ కొడుకు కూడా చనిపోయాడు. కొన్నాళ్ల తరువాత భర్త కూడా చనిపోవడంతో కూలీనాలి ప నులు చేస్తూ గంజోగట్కో తాపించి అవిటివాడై న శివరామిరెడ్డి బాగోగులు చూస్తోంది.. తన కొడుకు టీ తాగుతానంటే చేసిపెడుతుంది. అన్నం తినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె తనతో పాటు కుమారుడికి వచ్చే పింఛన్‌తో పూట గడుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రమీలమ్మకు 85 ఏళ్లు.. వయసు మీదపడడంతో ప్రమీలమ్మలో కొడుకు గురించి ఆందోళన మొదలైంది. ఒంట్లో సత్తువ లేకపోవడంతో కూలీ పనులకు పిలిచేవారు లేరని కన్నీరుపెడుతోంది. తాను ఉన్నంత వరకు తన కొడుకును కంటికిరెప్పలా చూసుకుంటానని, తాను వెళ్లిపోతే వాడిని ఎవరు చూసుకుం టారోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కోసం కాకపోయినా కొడుకును పోషించడానికైనా దీర్ఘాయుష్షు ప్రసాదించమని వేడుకుంటోంది ఆ మాతృమూర్తి..! -
తియ్యని భావన
ప్రేమంటే ఓ తియ్యని భావన. ఈ సినిమా చూస్తుంటే అలాంటి తియ్యని భావనకే లోనవుతారని దర్శకుడు రామ్ భీమన చెబుతున్నారు. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ముఖ్య తారలుగా యం. శివరామిరెడ్డి నిర్మించిన చిత్రం ‘హమ్ తుమ్’. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న ఈ ప్రేమకథా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమకథా చిత్రాల్లో ఇదో మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకం ఉంది. మహతి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ మంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. -
ఎన్జీఓ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన బషీర్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ ఆదివారం నామినేషన్‌ను దాఖలు చేశారు. సంఘ ఉపాధ్యక్ష పదవికి కనిగిరికి చెందిన శివరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్జీఓ సంఘ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన ఎన్జీఓ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు పర్చూరు అశోక్‌బాబును ఎన్నికల్లో ఓడించేందుకు ఆయన వ్యతిరేక వర్గమంతా ఏకమై ఉమ్మడి వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగింది. జిల్లాకు చెందిన పలువురు నాయకులు నామినేషన్ సందర్భంగా బషీర్‌కు సంఘీభావం తెలిపారు. ఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి పి.రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఎ.స్వాములు, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు నాసర్ మస్తాన్‌వలి, కార్యదర్శి ప్రకాష్, డిజె ప్రసాద్, వీరనారాయణ, శోభన్‌బాబు, బడే మీరావలి, జిల్లాకు చెందిన మరో 150 మంది ఎన్జీఓలు బషీర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీ ఎందుకంటే... తాను అధ్యక్ష పదవికి ఎందుకు పోటీచేయాల్సి వచ్చిందో బషీర్ ‘న్యూస్‌లైన్’కు వివరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో ఏపీ ఎన్జీఓ సంఘ ఎన్నికల్లో గెలుపొందేందుకు అశోక్‌బాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతూ వారి ఆదేశానుసారం ఉద్యమాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు పోరాడతామని బీరాలు పలికిన అశోక్‌బాబు మధ్యలోనే కాడి కిందేశారని విమర్శించారు. బిల్లు అసెంబ్లీకి వస్తే మెరుపు సమ్మె చేస్తామని ప్రగల్బాలు పలికిన ఆయన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినా..సమ్మె ఊసే ఎత్తలేదన్నారు. రాష్ట్ర విభజనకు మూల కారకులైన దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించిన అశోక్‌బాబు అసలు ఆ విషయాన్ని మరిచిపోయారని ఆక్షేపించారు. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని తామెంతగా చెప్పినా పట్టించుకోలేదని బషీర్ వెల్లడించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని అశోక్‌బాబు చెప్తుండటం సందేహాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. తాము మాత్రం చివరి క్షణం వరకు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల ఊసేదీ... అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బషీర్ ధ్వజమెత్తారు. ఉద్యోగులు ఇప్పటికే రెండున్నర పీఆర్సీలు కోల్పోయారని, పదో పీఆర్సీ ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదన్నారు. ఉద్యోగులంతా కనీసం తాత్కాలిక భృతి (ఐఆర్) వర్తిస్తుందని ఆశించినా..ఆ విషయంలో ప్రభుత్వ స్థాయిలో పట్టుబట్టిన దాఖలాల్లేవన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో అక్రమంగానైనా గెలుపొందేందుకు అశోక్‌బాబు ప్రయత్నిస్తున్నారని బషీర్ దుయ్యబట్టారు. సంఘంలో మొత్తం 866 మంది ఓటర్లుండగా, వీరిలో 33 మంది పేర్లు రిపీట్ అయ్యాయని వెల్లడించారు. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లైనా గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా నిజాయితీపరులైన ఎన్జీఓలు సమైక్యాంధ్రకు కట్టుబడిన వారిని ఎన్నికల్లో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ఆజన్మం: వజ్రం పళ్లు తోముతుందా?
వజ్రం కూడా డైనింగ్ హాల్‌కు వస్తుందా? పాలకోసం అందరిలా వరుసలో నిలబడుతుందా? ఆంజనేయులు మీసాలు చూసి నాలాగే భయపడుతుందా? అప్పటికి రెసిడెన్షియల్ స్కూల్లో చేరి రెండో రోజు. మేడ్చల్ నుంచి వచ్చానన్న కారణంగా శ్రీశైలం ఫ్రెండయ్యాడు. కొత్త బడిలోకో, కొత్త ఉద్యోగంలోకో అడుగుపెట్టగానే, తక్షణం ‘ఒకరు’ ముందు పరిచయం అవుతారు. ఆ పరిచయానికి ఏవైనా కారణాలుండొచ్చు. అలాగని అవే కారణాలున్నవారు పరిచయం కాకపోవచ్చు కూడా! అంటే, ఆ ఒకరిలో ఉండే స్వాభావికమైన గుణమేదో వెంటనే దగ్గరయ్యేలా చేస్తుంది. అయితే, ఈ తక్షణ స్నేహం తర్వాతి కాలంలో కూడా నిలబడుతుందని చెప్పలేం. అది కేవలం ఆ పరిస్థితులకు మనం అలవాటు పడటానికి ఉపకరిస్తుంది. చాలాసార్లు అంతవరకే ఆ స్నేహపు ప్రయోజనం. అలా శ్రీశైలం స్నేహం నేను కీసరగుట్ట గురుకుల పాఠశాలలో తొలి బెరుకులు పోగొట్టుకోవడానికి పనికొచ్చింది. శివరామిరెడ్డి సార్ ఊతపదం ఏమిటి? అప్పల్రాజు సార్ క్వార్టర్లో జామచెట్టు కాయలు ఎలా ఉంటాయి? పిల్లలు తెంపిన సీతాఫలాలు ఏ పొదల మాటున మాగేస్తారు? నర్సు మేడమ్ దృష్టిలో పడేందుకు పీఈటీ సార్ ఎలా నవ్వుతాడు? ఇట్లాంటివేవో విడతలుగా చెప్పాక, ఒకబ్బాయిని చూపించి, ‘కీసరగుట్ట వజ్రం’ అన్నాడు శ్రీశైలం. ‘‘ఆటల్లో ఫస్టు; చదువులో ఫస్టు.’’ ఐలేశ్వర్ నాకంటే ఓ క్లాసు జూనియరే! కానీ నాకన్నా బలంగా ఉంటాడు. నాకన్నా ఎత్తుగా ఉంటాడు. పైగా, నాలా ఎనిమిదిలో కాకుండా ఐదో తరగతిలోనే అక్కడ చేరడం వల్ల, స్కూల్ పరంగా నాకన్నా సీనియర్ కూడా! ఒక వజ్రపు ఉనికి అంటూ తెలిసింతర్వాత, వందమందిలో ఉన్నా అది కనబడుతుంది. అలా నేను ఎక్కడికెళ్లినా ఐలేశ్వర్ ఇట్టే ఫోకస్ అయ్యేవాడు. ప్రేయర్లో కనబడేవాడు; స్పోర్ట్స్ పీరియడ్‌లో కనబడేవాడు; ఒంటికి తువ్వాలు చుట్టుకుని కూడా కనబడేవాడు. కానీ అలా చూడటంలో ఒక నిరాశ ఏదో నన్ను కమ్మేసేది. వజ్రం కూడా డైనింగ్ హాల్‌కు వస్తుందా? పాలకోసం అందరిలా వరుసలో నిలబడుతుందా? ఆంజనేయులు మీసాలు చూసి నాలాగే భయపడుతుందా? నేనూ పళ్లు తోముకుని, అతడూ పళ్లు తోముకుని, నోరు నిండిపోయినప్పుడు ఎడమవైపు పెదాల మూల నుండి జారిపోయే నురగ ఏర్పరిచే చార ఇద్దరికీ ఒకటే అయినప్పుడు అతడు నాకన్నా గొప్పవాడు ఎలా అవుతాడు? వజ్రాన్ని నాతో సమానంగా నిలబెట్టే, ఇంకా చెప్పాలంటే నాతో సమానంగా కిందికి దిగజార్చే ఈ దైహిక కార్యక్రమాల మీద నాకు కోపం వచ్చేది. ఆ వజ్రం వాటిని నిరసించాలని ఆశపడేవాడిని. కానీ ఆ వజ్రం గట్క టిఫిన్ రోజు ఆబగా తింటోందే! మల్లయ్య తుడిచి వెళ్లాక ఉండే టేబుల్ మీది తేమను కూడా పట్టించుకోవడం లేదే! అలా ఆకాశంలోంచి వచ్చి, ఇలా వెళ్లిపోతేనేగానీ లేదంటే అతడు వజ్రం ఎలా అవుతాడు? అందుకే తను నాకు కేవలం ఐలేశ్వర్గానే మిగిలిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత, ఒక చెన్నై పారిశ్రామికవేత్త గురించి పేపర్లో చదివాను. ఆయన కష్టపడి పైకొచ్చాడు; అనూహ్యమైన విజయాలేవో సాధించాడు; ఇంకా తన అనుభవాలేవో చెప్పాడు. అవేవీ నన్ను ఆకట్టుకోలేదుగానీ, ‘పెరుగన్నంలో ఆవకాయ వేసుకుని తినడం ఇష్టం’ అన్నాడు. అదిగో, అది నన్ను పట్టేసింది. ఆయన గొప్పవాడే కావొచ్చు; కానీ అంతదాకా మా ఇద్దరి మధ్యన ఏదో పరాయితనం ఉండింది. ఈ మామిడికాయ పెరుగన్నం మాట ఎత్తేసరికి, ఆయన్ని నాలోకి తీసుకోవడానికి అడ్డంకిగా ఉన్నదేదో కరిగిపోయింది. అజయ్ దేవ్గన్లాంటి వంకరపళ్లు నాక్కూడా ఉన్నాయి కాబట్టి, ఇద్దరమూ ఒకటే అనుకునేవాణ్ని. దేహానికి మించి కూడా మనిషి ఉంటాడని నాకు ఎప్పటికోగానీ అర్థం కాలేదు. ‘వజ్రం’ ఫస్టు వస్తుంది; మరొకటి రాదు. ఆవకాయ తిన్నంత మాత్రాన మనం మరేదో కాలేము. పికాసోకి మోషన్స్ అయ్యాయంటే, అది దేహం కల్పించే బరువు. మనుషులు వదిలి వెళ్లగలిగే గుణాత్మకమైన విలువని నేను శరీర పరిమితి కోణంలో అర్థం చేసుకుంటూ, అసలైన అర్థాన్ని అందుకోవడంలో విఫలమయ్యాను. ఒకప్పుడు, ఒకరికి మహత్వం ఆపాదించిన తర్వాత, వారు మామూలుగా ఉండటం నచ్చేదికాదు. దానికి విరుద్ధం గా, మహత్వం అనేది మామూలైపోయినవాళ్లు మామూలు మనుషుల్లా వ్యవహరించడం నచ్చుతోందిప్పుడు. - పూడూరి రాజిరెడ్డి