యువతకు నచ్చే హమ్ తుమ్
యువతకు నచ్చే హమ్ తుమ్
Published Wed, Nov 20 2013 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
‘‘ప్రస్తుతం యువతరాన్ని ఆకట్టుకునే సినిమాలకు బాగా ఆదరణ దక్కుతోంది. ఈ ‘హమ్ తుమ్’ కూడా యువతను లక్ష్యంగా చేసుకునే చేశారు’’ అని సాగర్ అన్నారు. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ముఖ్యతారలుగా రామ్ భీమన దర్శకత్వంలో ఎమ్.శివరామిరెడ్డి నిర్మిస్తున్న ‘హమ్ తుమ్’ టీజర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని, మహతి మంచి స్వరాలందించారని దర్శకుడు చెప్పారు. హీరోగా తనకిది తొలి చిత్రమని మనీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా అశోక్‌కుమార్, ప్రసన్నకుమార్, అంకమ్మరావు, దాము, ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement