నయన్‌ది ఆశా? అత్యాశా? | Nayanthara in Airaa Movie | Sakshi
Sakshi News home page

నయన్‌ది ఆశా? అత్యాశా?

Mar 19 2019 12:58 PM | Updated on Mar 19 2019 12:58 PM

Nayanthara in Airaa Movie - Sakshi

సినిమా: మనిషి అన్నాక కాసింతైనా ఆశ ఉండాలి. కానీ అత్యాశ ఉండకూడదు. అయితే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార అత్యాశకు పోతోందని చిత్ర వర్గాల గుసగుసలు. చేతి నిండా సినిమాలతో సూపర్‌స్టార్స్‌ నుంచి యువస్టార్స్‌ వరకూ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది నయనతార. అంతే కాదు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలతోను మెప్పించేస్తోంది. నటిగా దశాబ్ద కాలం అధిగమించిన తరువాత ఈ అమ్మడు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఐరా. ఇందులో రెండు పాత్రల్లోనూ నటనలోనూ, గెటప్‌లోనూ ఎంతో వైవిధ్యం చూపించినట్లు చిత్ర ట్రైలర్‌ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ నెల 28వ తేదీన తెరపైకి రావడానికి ఐరా ముస్తాబవుతోంది. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే నయనతార మనసులో చాలా కాలంగా ఒక ఆశ ఉందట. దక్షిణాదిలోనే నంబర్‌వన్‌ కథానాయకిగా వెలుగొందుతున్న నయనతార పారితోషికం కూడా ఆ రేంజ్‌లోనే పుచ్చుకుంటోంది. ఇప్పటికే 5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఈ సుందరి విజయ్, అజిత్‌ వంటి స్టార్‌ హీరోలకు ధీటైన పాత్రల్లో నటిస్తోంది. కాబట్టి పాత్రల్లోనే కాకుండా పారితోషికం విషయంలోనే వారిని మించిన స్థాయిలో ఉండాలన్నది ఈ అమ్మడి చిరకాల ఆశ అట. అదీ ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం అందుకోవాలని ఆశ పడుతోందట. ఇది సాధ్యమేనా? ప్రస్తుతం నయనతార నటుడు విజయ్‌తో ఆయన63వ చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. సుమారు 10 ఏళ్ల తరువాత ఈ క్రేజీ జంట కలిసి నటిస్తున్న చిత్రం ఇది. కాగా మరో విషయం ఏంటంటే కేజేఆర్‌ స్టూడియోస్‌ చిత్ర నిర్మాణ సంస్థ నయనతార హీరోయిన్‌గా వండర్‌ఉమెన్, కెప్టెన్‌ మార్వెల్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాల తరహాలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇది గనుక కార్యరూపం దాల్చితే నయనతార చిర కాల ఆశ నెరవేరుతుందో? లేదో? గానీ, ఇండియన్‌ లేడీ సూపర్‌స్టార్‌ పేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement