ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్‌ సినిమా | Nayanthara And Siddharth Movie The Test OTT Will Be Streaming | Sakshi
Sakshi News home page

ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్‌ సినిమా

Published Mon, Jan 20 2025 7:03 AM | Last Updated on Mon, Jan 20 2025 10:05 AM

Nayanthara And Siddharth Movie The Test OTT Will Be Streaming

నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్‌’(The Test) సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. వైనాట్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్‌ (Siddharth) లీడ్‌ రోల్స్‌ చేశారు. మీరా జాస్మిన్‌ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. వృత్తి పరంగానూ వ్యక్తిగతంగానూ ఈమె చూడాల్సిన ఎత్తుపల్లాలు లేవని చెప్పవచ్చు. 

వృత్తిపరంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని లేడి సూపర్‌ స్టార్‌ స్థాయికి ఎదిగారు. ఇక వ్యక్తిగతం గాను పలుమార్లు ప్రేమలో విఫలం అయ్యారు. అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఇప్పుడు భార్యాగానూ ఇద్దరు కవల పిల్లలకు తల్లిగానూ అందమైన సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వివాదాస్పద నటి అన్నది నయనతార పేరుకు ముందు అంటి పెట్టుకునే ఉంటుంది. అయినప్పటికీ కథానాయకిగా ఇప్పటికీ బిజీ నటినే. చిత్రానికి రూ.12 నుంచి రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంటూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి టెస్ట్‌. 

నిర్మాత శశికాంత్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం టెస్ట్‌ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే నిలబడే అవకాశం ఉంది. 

చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్‌ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్‌(అమ్మోరు తల్లి), నెట్రికన్‌ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్‌ చేతిలో డియర్‌ స్టూడెంట్స్‌, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement