మనం మారాలి..! | Jendapai kapiraju release on 21 March | Sakshi
Sakshi News home page

మనం మారాలి..!

Published Mon, Mar 16 2015 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

మనం మారాలి..!

మనం మారాలి..!

ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. మల్టీడెమైన్షన్ ఎంటర్‌ైటె న్‌మెంట్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్.శ్రీనివాసన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పి. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నాని కెరీర్‌లో చాలా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించాం. చాలా వైవిధ్యమైన సినిమా ఇది. సామాజిక ఇతివృత్తాన్ని చాలా వినోదభరితంగా దర్శకుడు తెరకెక్కించారు’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, రాగిణి ద్వివేది, ఆహుతి ప్రసాద్, ప్రత్యేక పాత్రలో శరత్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సమర్పణ: పి. రామ్మోహనరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement