‘జెండాపై కపిరాజు’ రెడీ | 'Janda Pai Kapiraju ' movie shooting completed | Sakshi
Sakshi News home page

‘జెండాపై కపిరాజు’ రెడీ

Published Sat, Dec 7 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

‘జెండాపై  కపిరాజు’ రెడీ

‘జెండాపై కపిరాజు’ రెడీ

 ప్రతివ్యక్తి తనను తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే అనే సందేశంతో రూపొందుతోన్న చిత్రం ‘జెండాపై కపిరాజు’ నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక. సముద్రఖని దర్శకుడు. కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎన్.శివరామ్ నిర్మాతలు. శరత్‌కుమార్ సీబీఐ అధికారిగా ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఉత్కంఠ, వినోదం, సందేశం... మేలు కలయిక ఈ సినిమా. భావోద్వేగపూరితంగా కథ, కథనాలు సాగుతాయి. ఈ నెలాఖరున పాటలను, జనవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జీవి ప్రకాష్‌కుమార్, కెమెరా: సుకుమార్, ఎడిటింగ్: ఫాజిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement