ఆ చింతనే ఎక్కువ | Director samudrakani higher social anxiety | Sakshi
Sakshi News home page

ఆ చింతనే ఎక్కువ

Published Wed, Dec 18 2013 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

ఆ చింతనే ఎక్కువ

ఆ చింతనే ఎక్కువ

నాకు ఆ చింతన అధికం అయ్యింది అంటోంది నటి అమలాపాల్. ఇంతకు ఈ భామ ఏ విషయం గురించి చెబుతోందో తెలుసుకోవాలంటే  చదవండి.
 తలైవా చిత్రం తరువాత అమలాపాల్ నటిస్తున్న చిత్రం నిమిర్న్‌దునిల్. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోను అమలాపాలే హీరోయిన్. తమిళంలో జయంరవి, తెలుగులో నాని హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రకని దర్శకుడు. అమలాపాల్ మాట్లాడుతూ తాను నటించిన చిత్రాల్లో నిమిర్న్‌దు నిల్ చాలా ముఖ్యమైందని పేర్కొంది.

దర్శకుడు సముద్రకనికి సామాజిక చింతనే అధికమట. ఆయన పక్కనే కూర్చుంటే సమాజంలో జరుగుతున్న విషయాల గురించే చెబుతుంటారట. నిమిర్న్‌దు నిల్ చిత్రంలో నటించిన తరువాత తనకూ సామాజిక చింతన అధికం అయ్యిందని పేర్కొంది. అయితే ఇలా దర్శకున్ని పొగడ్తల్లో ముంచేసి ఆయన చిత్రంలో మళ్లీ అవకాశం కొట్టేయాలని చూస్తోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం అమలాపాల్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. టాలీవుడ్‌లో పాగా వేయాలని ఆశించినా ఇప్పుడక్కడ అవకాశాల్లేవు. దీంతో పొగడ్తల పురాణం మొదలెట్టిందంటున్నారు సినీ పండితులు. నిజానికి ఈ కేరళ కుట్టీకిప్పుడు ఒక హిట్ చాలా అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement