Amalapaul
-
అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?
స్టార్ హీరోయిన్ అమలాపాల్‌కు రెండో పెళ్లికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన మలయాళీ భామ మరోసారి పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతోంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఓ వీడియోను షేర్ చేస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది. అయికే ఆమెను చేసుకోబోతున్న జగత్ ఎవరనే దానిపై నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మీకు కూడా అతను ఎవరు? ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: అశ్వినిని తోసిపడేసిన అర్జున్.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్) జగత్ దేశాయ్ ఎవరు? అమలాపాల్ పెళ్లాడబోతున్న జగత్ దేశాయ్ ఎవరనే విషయంపై ఆమె ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో అతను ఏం చేస్తాడా? అని తెగ ఆరా తీస్తున్నారు. జగత్ దేశాయ్ గోవాలోని ఓ విల్లా గ్రూప్‌లో సేల్స్ హెడ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అమలాపాల్ సైతం గోవా బీచ్‌లో ఉన్న ఫోటోలు తన ఇన్‌స్టాలో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచే అమలాపాల్ అతనితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు డేటింగ్ను అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. జగత్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే అమలాపాల్ లైక్ కొట్టడం, కామెంట్స్ చేయడం కనిపించింది.. ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన రిలేషన్ గురించి బయటికి చెప్పలేదు. తాజాగా తన బర్త్‌డే రోజున అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇది చదవండి: మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
మణిరత్నం చిత్రంలో అమలాపాల్
తమిళసినిమా: సంచలన నటి అమలాపాల్‌కు మరో లక్కీచాన్స్ లభించనుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రం కోసం ఒక తపస్సు చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే నాటి దివంగత ముఖ్యమంత్రి, మక్కళ్ తిలగం ఎంజీఆర్ వంటి నటుడే నటించాలని కలలు కన్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఆ తరువాత కమలహాసన్ వంటి వారు కూడా ఆశ పడిన నవల అది. కాగా ఇంతకుముందు మణిరత్నం పొన్నియిన్‌సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేసి బడ్జెట్ వర్కౌట్ కాకపోవడంతో తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్‌సెల్వన్ చిత్రాన్ని వెండితెర కళాఖండంగా చెక్కడానికి సిద్ధం అయ్యారు. ఇంతకుముందు నటుడు విజయ్, తెలుగు నటుడు మహేశ్‌బాబు వంటి స్టార్స్‌తో పొన్నియన్సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించిన మణిరత్నం ఈ సారి విక్రమ్, జయంరవి, కార్తీ, కీర్తీసురేశ్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి ఇండియన్ స్టార్స్‌ను తన చిత్రంలో పాత్రదారులుగా ఎంచుకున్నారు. అయితే ఇందులో అగ్రనటి నయనతార కూడా ఒక కీలక పాత్రను పోషించనుందనే ప్రచారం జోరందుకున్నా, ఆ తరువాత ఆమె కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి కారణంగా మరో అగ్రనటి అనుష్క ఆ పాత్రను చేయబోతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మరో సంచలన వార్త ఏమిటంటే పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మరో సంచలన నటి అమలాపాల్‌ను కూడా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు గ్లామర్ పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చిన అమలాపాల్ ఈ మధ్య హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలపై దృష్టి సారిస్తోంది. ఆమె నటిస్తున్న అడై, అదో అంద పరవై పోల వంటి చిత్రాలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే. తాజాగా మణిరత్నం ఆఫర్ చేసిన హిస్టారికల్ పాత్రలో నటించే లక్కీ అవకాశాన్ని ఈ సంచలన నటి అంగీకరిస్తుందా? అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ అవకాశం ఇస్తోంది దర్శకుడు మణిరత్నం. కాబట్టి పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో స్టార్ నటీనటుల్లో నటి అమలాపాల్‌ను కూడా చూడవచ్చు. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని సమాచారం. దీన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి రిలయన్స్ సంస్థ నిర్మించడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ ఏడాది చివరిలో పొన్నియిన్ సెల్వన్ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. -
డాక్టర్ భద్ర
కెమెరా వదిలేసి స్టెతస్కోప్ పట్టనున్నారు అమలా పాల్. కన్ప్యూజ్ కావొద్దు. మేటర్ కంటిన్యూ చేయండి. ఫుల్ క్లారిటీ దొరుకుతుంది. అమలా పాల్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్రలో నటించిన ‘అదో అంద పరవై పోల’ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడామె తన నెక్ట్స్ చిత్రం కోసం ఫోరెన్సిక్ డాక్టర్‌గా మారబోతున్నారు. సో.. కెమెరా నుంచి స్టెతస్కోప్‌కి మారనున్నారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు అనూప్ పానికర్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకు అభిలాష్ పిళ్లై రచయిత. ‘‘తమిళనాడు పోలీస్ చీఫ్ సర్జన్ డాక్టర్ భద్ర పాత్రలో అమలా నటించనున్నారు. క్లిష్టమైన కేసులను ఆమె ఎంత సులువుగా పరిష్కరించారనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కేరళ పోలీస్ విభాగానికి చెందిన మాజీ ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ బి. ఉమదాథాన్ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందని కోలీవుడ్ టాక్. -
అమలా.. ఆవో
సౌత్‌లో సక్సెస్ సాధించిన కథానాయిక అమలాపాల్.. ఇప్పుడు నార్త్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఆమెకు బీ టౌన్ నుంచి పిలుపు వచ్చింది. అర్జున్ రామ్‌పాల్ హీరోగా రూపొంద్నున్న ఓ హిందీ థ్రిల్లర్ మూవీలో అమలాపాల్ నటించనున్నారు. నరేశ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కానుందట. ‘‘బాలీవుడ్లో తొలి సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నరేశ్ చెప్పిన స్టోరీ నచ్చింది. ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో కూడా జరగనుంది. నేను ఎగై్జట్ అయ్యే విషయాల్లో ఇదొకటి. ఈ సినిమా డిస్కషన్స్‌లో భాగంగా అర్జున్‌తో మాట్లాడుతున్నప్పుడు హిందీ భాషపై నాకు ఎంత గ్రిప్ ఉందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒక టైమ్‌లో నేను ఢిల్లీలో స్టే చేయడం వల్ల హిందీ భాషపై మంచి అవగాహన ఉంది. కానీ, ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్ నాకు ప్లస్ అవుతాయనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అమల. ట్రావెలింగ్‌ను అమల లైక్ చేస్తారు. అందుకేనేమో.. హిమాలయాల్లో షూటింగ్ అనగానే ఎగై్జట్ అయ్యుం టారని ఊహించవచ్చు. -
రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు
‘‘నాకు రాజకీయాలు తెలియవు. అందుకే.. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు’’ అన్నారు అరవింద్ స్వామి. ‘కడల్’ సినిమాతో నటుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన నటించిన తాజా చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఇందులో అమలా పాల్ కథానాయిక. మలయాళ దర్శకుడు సిద్ధిక్ తెరకెక్కించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. అరవింద్ స్వామి మాట్లాడుతూ– ‘‘నేను రాజకీయాల గురించి మాట్లాడటంగానీ, రావడంగానీ జరగదు. అయితే.. రాజకీయ నాయకుల నిర్ణయాలు సామాన్య ప్రజలపై ప్రభావం చూపితే స్పందిస్తా’’ అన్నారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రానికి రీమేక్ ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందర్నీ మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. -
భాస్కర్ ఒరు రాస్కెల్ ఆడియో రిలీజ్
తమిళ సినిమా: భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్‌లోని కలైవానం ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా రాణిస్తున్న సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. మలయాళంలో మమ్ముట్టి, నయనతారలతో నిర్మించిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. చిత్ర తమిళం రీమేక్‌లో అజిత్‌ను, ఆ తరువాత రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. చిత్రం చూసిన రజనీకాంత్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే ఆయన కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించలేకపోయారు. ఆ పాత్రలో ఇప్పుడు అరవిందస్వామి నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా, నయనతారలో ఒకరిని నటింపజేయాలని ప్రయత్నించినా, చివరికి ఆ అవకాశం నటి అమలాపాల్‌ను వరించింది. నటి మీనా కూతురు నైనిక, మాస్టర్ రఘువరన్, నటి నికీషాపటేల్ ప్రముఖ పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రేష్ సంగీతం అందిస్తున్నారు. ఈయన ప్రముఖ నటి జయచిత్ర వారసుడన్నది తెలిసిన విషయమే. అమ్రేష్ ఇంతకు ముందు లారెన్స్ నటించిన మొట్టశివ కట్టశివ చిత్రానికి సంగీతం అందించారు. ఆ చిత్రంలోని పాటలు కమర్షియల్ ఫార్ములాలో ఫాస్ట్ బీట్‌లో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా అలరించాయి. కాగా ప్రస్తుతం త్రిష ప్రధాన పాత్రను పోషిస్తున్న గర్జణై, ప్రభుదేవా, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, భరత్ హీరోగా పొటు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఈయన సంగీతబాణీలు కడుతున్న ఆ భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాన్ని హర్షిణి ఫిలింస్ పతాకంపై ఏ.హర్షిణి నిర్మిస్తున్నారు. -
ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు..!
‘‘అందరి అమ్మాయిల్లాగే ఆ అమ్మాయికి జీవితంపై మంచి కలలు, ఆశలు, కోరికలు ఉంటాయి. సోషల్ మీడియా కారణంగా ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? అన్నదే ‘దొంగోడొచ్చాడు’ కథాంశం’’ అని కథానాయిక అమలాపాల్ అన్నారు. బాబీ సింహా, అమలాపాల్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో ‘మల్లన్న’ ఫేమ్ సుశీ గణేశన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తిరుట్టుపయలే 2’. కల్పాతి ఎస్.అఘోరమ్ సమర్పణలో కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ సినిమాని ‘దొంగోడొచ్చాడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరులతో మాట్లాడారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి రావడం హ్యాపీ. సుశీగారితో ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలనుంది. ఆయనతో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. విద్యాసాగర్‌తో మలయాళంలో పనిచేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సోషల్ క్రైమ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. తమిళంలో ఈ సినిమా నవంబర్ 30న విడుదలవుతోంది. డిసెంబరు రెండో వారంలో తెలుగులో విడుదలవుతుంది’’ అన్నారు బాబీ సింహా. ‘‘అవకాశం రావాలే కానీ.. ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు ఉంటాడు. అలాంటి మనిషి నైజాన్ని చూపించే సినిమా ఇది’’ అన్నారు సుశీ గణేశన్. నటుడు ప్రసన్న, సంగీత దర్శకుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. -
డిసెంబర్ 2న తిరుట్టుపయలే–2
తమిళసినిమా: బాబిసింహా, ప్రసన్నా, అమలాపాల్ నటించిన చిత్రం తిరుట్టుపయలే–2. తిరుట్టుపయలే మొదటి భాగాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ కల్పాత్తి అగోరమే తిరుట్టుపయలే–2కు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్ కలిసి నటించిన తిరుట్టుపయలే చిత్రం తొలి భాగం 2006 ఏప్రిల్‌లో విడుదలైంది. సాధారణంగా ఒక చిత్రం మొదటి భాగం విడుదలైన ఒకటి రెండు సంవత్సరాల్లోనే రెండో భాగం కూడా విడుదల చేస్తారు. అయితే తిరుట్టుపయలే చిత్రం 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధమవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
టాప్ గేర్‌లో అమలాపాల్
అమలాపాల్ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. నటిగా కెరీర్ పుంజుకుంటున్న తరుణంలోనే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లాడి, అంతే వేగంగా ఆయనకు విడాకులిచ్చేసి మళ్లీ నటిగా తన పయనాన్ని ప్రారంభించిన అమలాపాల్ నట జీవితం ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో పరుగెడుతోంది. ఇప్పటికే పసంగ–2, అమ్మాకణక్కు చిత్రాల్లో నటించిన అమలాపాల్ చేతిలో ఇప్పడు ఏకంగా 8 చిత్రాలు ఉన్నాయంటే ఈ అమ్మడు కెరీర్ ఏ రెంజ్లో పరిగెడుతుందో ఊహించుకోవచ్చు. తమిళం, మలయాళం అంటూ వరుసపెట్టి ఎడాపెడా నటించేస్తోంది . ఈ కేరళ భామ నటిస్తున్న చిత్రాల పట్టికను ఒకసారి తిరగేస్తే సౌందర్యరజనీకాంత్ దర్శకత్వంలో వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రంలో ధనుష్‌తో రొమాన్స్ చేస్తున్న అమలాపాల్, కల్పాత్తి అఘోరం ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై శుశీగణేశన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న తిరుట్టుప్పయలే 2 చిత్రంలో బాబీసింహా, ప్రసన్నలతో పోటీ పడి నటిస్తోంది. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ ముండాసిపట్టి చిత్రం ఫేమ్ రామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న మిన్మిని చిత్రంలో విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తోంది. ఇంకా భాస్కర్ ది రాస్కెల్ చిత్రంలో అరవిందస్వామితో డ్యూయెట్లు పాడుతోంది. అదే విధంగా సెంచరియన్ ఫిలింస్ జాన్స్, సాలోన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న నూతన చిత్రంలో అమలాపాల్‌నే నాయకి, ఇకపోతే హిందీలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న క్వీన్ చిత్ర మలయాళ రీమేక్‌లో అమలాపాల్‌నే రాణి. వీటితో పాటు కన్నన్ దర్శకత్వంలో అచ్చయన్స్ అనే మరో మలయాళ చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఇలా ఏకధాటిగా నటిస్తున్న ఏకైన నటి అమలాపాల్నేనని చెప్పవచ్చు. -
వారిని కుక్కపిల్లని పెంచుకోమనండి
మారుతున్న కాలంతో సమాజంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం పెంపొందుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇది ఆహ్వానించదగ్గ విప్లవాత్వకమైన ప్రగతి పథమే. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు. ఇదీ అందరూ కోరుకుంటున్న అంశమే. అయితే ఇంకా మగువలను ఆటబొమ్మగా చూసే వారు లేకపోలేదు. మరి కొందరు స్త్రీలను కుటుంబ బాధ్యతలకే పరిమితం చేయాలనుకుంటున్నారు. ఇది మంచాచెడా అన్న విషయం పక్కన పెడితే కొందరి సంసారాలు సమస్యల వలయంగా మారుతున్నాయి. విడాకులు అధికం అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఈ సమస్య పెనుభూతంగా మారుతోంది. సమాజం నుంచి తీసుకున్న రకరకాల ఇతి వృత్తాలతో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తున్న తారలు తమ జీవితాల విషయానికి వచ్చే సరికి సర్దుబాటుతనం, పరస్పర అవగాహన, మనసు విప్పి మాట్లాడుకోవడం వంటి విషయాలను పక్కన పెడుతున్నారు. ఇందుకు ఈగో అన్నది పెద్ద అడ్డుగోడగా మారుతుందని చెప్పవచ్చు. ప్రేమించుకునే సమయంలో, పెళ్లి అయిన కొత్తలో తన భర్త సహృదయుడు, తన భార్య అనుకూలవతి అని ఆనందంగా, ఇంకా చెప్పాలంటే గొప్పగా చెప్పుకునే వారు ఆ తరువాత కొద్ది కాలానికే కాపురాలను కలహాలమయంగా మార్చుకోవడం, విడాకుల కోసం కోర్టు గుమ్మాలెక్కడం వంటి సంఘటనలకు గురవుతుండడం బాధాకరం. ఇటీవల నటి అమలాపాల్ సంఘటననే తీసుకుంటే చిత్రరంగప్రవేశం చేసిన కొద్ది కాలానికే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కథానాయకిగా ఎదుగుతున్న సమయంలోనే నటనకు దూరం అవుతున్నారని ఆమె అభిమానులు నిరుత్సాహానికి గురైనా, సంసార జీవితంలోకి అడుగుపెట్టినందుకు సంతోషించినవారు లేకపోలేదు. పెళ్లైన కొత్తలో విదేశాల్లో హనీమూన్, సరదాగా కాలక్షేపాలు అంటూ జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. అయితే ఇలాంటి సంతోషాలకు రెండేళ్లకే కాలం చెల్లింది. ఇప్పుడు విజయ్ అమలాపాల్ మనస్పర్థల కారణంగా విడిపోయారు. అమలాపాల్ ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. ఇది విజయ్‌కి సుతారంగా ఇష్టం లేదట. ముఖ్యంగా ఆయన తల్లిదండ్రులు ఇష్టపడడం లేదట.ఈ వ్యవహారంలో కొందరు సన్నిహితుల సంధి కూడా విఫలం అయ్యిందని సమాచారం.దీంతో విజయ్ అమలాపాల్‌ల కాపురం సుఖాంతానికి తెరపడడంతో విడాకులకు సిద్ధం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అమలాపాల్ విడాకుల వ్యవహారంపై నటి ప్రియమణి, మమతామోహన్‌దాస్, నిక్కీగల్రాణిలాంటి వారి స్పందన చూద్దాం. నటి ప్రియమణి స్పందిస్తూ ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఎంతో సాధిస్తున్నారు.వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీలు తమ కుటుంబాన్ని, వృత్తిని చక్కగా గమనించుకుంటున్నారు. అలాంటిది నటీమణుల విషయానికొచ్చేసరికి వివాహంతో వారి జీవితం ముగుసిపోయిందని, అభిమానుల ఆదరణ తగ్గిపోతుందనే అపోహ పరిశ్రమలో నెలకొంది.అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. వివాహనంతరం నటీమణులు సాధిస్తున్నారు. హిందీలో కరీనాకపూర్, విద్యాబాలన్ లాంటివారు వివాహానంతరం నటనలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఉత్తమ నటీమణులుగా అవార్డులు అందుకుంటున్నారు. వరుసగా నటిస్తున్నారు. తమిళంలో నటి జ్యోతిక వివాహానంతరం, ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత కూడా మళ్లీ నటిస్తున్నారు. నటీమణులు వివాహానంతరం నటించడం తప్పేమి కాదు. నటనకు దూరం అవ్వాలన్నది పాత ఆలోచను. సమాజం పేరుతో నటీమణుల కలల్ని కల్లలు చేయడం సరికాదు అని అన్నారు. రక్షణలేదు నటి మమతామోహన్‌దాస్ మాట్లాడుతూ ప్రతి స్త్రీకి వివాహం అన్నది సంతోషకరమైన విషయమే.అయితే పెళ్లి అయిన తరువాత కుటుంబాన్ని చూసుకోవాలి, భర్త భాగోగులు గమనించాలంటూ పాత చింతకాయ కహానీలు చెబుతుంటారు. ఇక నటి అయితే ఈ పనులతో పాటు తన అందాన్ని కాపాడుకోవాలి. షూటింగ్‌లకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సింటుంది. భర్తలు మాత్రం భార్యకుటుంబ పనులు చూసుకోవాలి అని భావిస్తుంటారు.అవన్నీ సంతృప్తిగా చేస్తే అప్పుడు తన వృత్తికి అనుమతిస్తారు.నిజం చెప్పాలంటే నటీమణులకు రక్షణ లేదని అభిప్రాయపడుతున్నారు. నటీమణులు పెళ్లి ఆలోచనలు పక్కన పెట్టి తన పనులపై దృష్టి పెట్టాలి అని అన్నారు. స్త్రీలు అణిగిమణిగి ఉండాలని భావించేవారు కుక్కపిల్లల్ని పెంచుకోవాలని అన్నారు. నటి నిక్కీగల్రాణి మాట్లాడుతూ నటీమణులు వివాహానంతరం నటించకూడదనడం హాస్యాస్పదం అన్నారు. -
ధనుష్ చాలా టిప్స్ చెప్పారు
నటుడు ధనుష్ షూటింగ్ స్పాట్లో చాలా టిప్స్ చెప్పారు అంటున్నారు నటి అమలాపాల్. ఈ అమ్మడు నిజంగా లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అనతికాలంలోనే ఒక సారి చుట్టొచ్చారు. అయితే ఇటీవల ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించక పోవడంతో అమలాపాల్ పని అరుుపోరుుందనే ప్రచారం జోరందుకుంది. అలాంటి ప్రచారానికి చెక్ పెడుతూ ఈ కేరళ కుట్టి మళ్లీ మూడు భాషల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ఇటీవల పార్తిపన్ దర్శకత్వం వహిస్తున్న కథై, తిరైకథై వచనం ఇయక్కం చిత్రంలో ఆర్యతో కలిసి గెస్ట్ రోల్లో రొమాన్స్ చేసిన అమలాపాల్ తాజాగా సముద్రకని చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఈ బబ్లిగర్ల్తో చిన్న ఇంటర్వ్యూ. ప్ర: సముద్ర కని దర్శకత్వం గురించి? జ : చాలా సంతోషంగా ఉంది. కథానాయకి ప్రాముఖ్యత ఉన్న చిత్రం ఇది. నా బాడీ లాంగ్వేజ్, నటన, స్టరుుల్ అన్నీ మారిపోతాయి. 14, 25, 35 ఏళ్ల వయసు అంటూ మూడు గెటప్‌లతో కూడుకున్న పాత్రలో పోషించనున్నారు. అందుకే ప్రస్తుతం 14 ఏళ్ల యువతి రూపంకోసం శారీరక వ్యాయామం చేస్తున్నాను. ఆ తర్వాతే 25 ఏళ్ల అమ్మగా కనిపించడానికి బరువు పెంచమన్నాను. ఆపై 35 ఏళ్ల స్త్రీగా మారాలి. నా సినీ జీవితంలో ఈ చిత్రం చాలా ముఖ్యం అయినదిగా నిలిచిపోతుంది. తొలుత తమిళంలో రూపొంది ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లో అనువాదం కానుంది. ప్ర: ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం గురించి? జ: ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టదారి చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో డాక్టర్ పాత్రను పోషిస్తున్నాను. నటనకు సంబంధించి ధనుష్ నాకు చాలా టిప్స్ చెప్పారు. నేను నటిస్తున్నప్పుడు స్పాట్లోనే ఉండి దీనికి ఇలా రియాక్షన్ ఇస్తే బాగుంటుందంటూ చెప్పేవారు. ప్ర: బాలీవుడ్ ఆశ గురించి? జ: కచ్చితంగా ఫలిస్తుంది. అయితే నేనే విషయంలోనూ తొందరపడను. అలాగే హిందీలో నటించినా తమిళ చిత్ర పరిశ్రమను మరువను. ప్ర: వదంతుల పరంపర మాటేమిటి? జ: వదంతుల గురించి తొలి రోజుల్లో చాలా బాధ కలిగింది. ఆ తరువాత అవి సంచలనం కోసం పుట్టే వదంతులని భావించి పట్టించుకోవడం మానేశాను. ప్ర: నయనతార, లక్ష్మీ మీనన్‌లను పోటీగా భావిస్తున్నారా? జ : వాళ్లను ఎందుకు పోటీగా భావించాలి? నేను తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన సమయంలో ఇక్కడే చాలా మంది మలయాళ హీరోయిన్లు ఉన్నారు. నేను వాళ్లకు పోటీ అయ్యానా? ఎంత మంది కొత్తవారు వచ్చినా ప్రతిభ ఉంటేనే నిలదొక్కుకోగలరు. నాకు ఏది లభించాలని రాసిపెట్టి ఉందో అదే అందుతుంది. నయనతార నాకు సీనియర్, లక్ష్మీ మీనన్ జూనియర్. వాళ్లు నటించాల్సిన పాత్రలో నేను, నేను నటించాల్సిన పాత్రలో వాళ్లు నటించలేరు. కాబట్టి ఎవరు వచ్చినా నాకెలాంటి బాధా ఉండదు. ప్ర: అవార్డులపై గురి ఉందా? జ: అవార్డులను మనసులో పెటుకుని నటించడం కుదరదు. తొలుత నా నటన ప్రేక్షకులకు నచ్చాలి. ఆ తరువాత ప్రశంసలు, అవార్డులు లభిస్తే సంతోషమే. ప్ర: తదుపరి చిత్రాలు? జ: తెలుగు ఒక చిత్రం చేస్తున్నాను. మలయాళంలోనూ మళ్లీ మోహన్‌లాల్‌కు జంటగా జోషి దర్శకత్వంలో నటిస్తున్నాను. కన్నడంలోను అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి తమిళం, మలయాళం తెలుగు చిత్రాలు మాత్రమే చాలనుకుంటున్నాను. -
ఆ చింతనే ఎక్కువ
నాకు ఆ చింతన అధికం అయ్యింది అంటోంది నటి అమలాపాల్. ఇంతకు ఈ భామ ఏ విషయం గురించి చెబుతోందో తెలుసుకోవాలంటే చదవండి. తలైవా చిత్రం తరువాత అమలాపాల్ నటిస్తున్న చిత్రం నిమిర్న్దునిల్. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోను అమలాపాలే హీరోయిన్. తమిళంలో జయంరవి, తెలుగులో నాని హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రకని దర్శకుడు. అమలాపాల్ మాట్లాడుతూ తాను నటించిన చిత్రాల్లో నిమిర్న్దు నిల్ చాలా ముఖ్యమైందని పేర్కొంది. దర్శకుడు సముద్రకనికి సామాజిక చింతనే అధికమట. ఆయన పక్కనే కూర్చుంటే సమాజంలో జరుగుతున్న విషయాల గురించే చెబుతుంటారట. నిమిర్న్దు నిల్ చిత్రంలో నటించిన తరువాత తనకూ సామాజిక చింతన అధికం అయ్యిందని పేర్కొంది. అయితే ఇలా దర్శకున్ని పొగడ్తల్లో ముంచేసి ఆయన చిత్రంలో మళ్లీ అవకాశం కొట్టేయాలని చూస్తోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం అమలాపాల్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. టాలీవుడ్లో పాగా వేయాలని ఆశించినా ఇప్పుడక్కడ అవకాశాల్లేవు. దీంతో పొగడ్తల పురాణం మొదలెట్టిందంటున్నారు సినీ పండితులు. నిజానికి ఈ కేరళ కుట్టీకిప్పుడు ఒక హిట్ చాలా అవసరం.