అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా? | Amala Paul gets engaged to Jagat Desai: Here's to know more about him | Sakshi
Sakshi News home page

Amala Paul: అమలాపాల్ కాబోయే భర్త.. ఏం చేస్తాడంటే?

Published Thu, Oct 26 2023 5:45 PM | Last Updated on Thu, Oct 26 2023 6:21 PM

Jagat Desai is the soon to be husband of actress Amala Paul more about Him - Sakshi

స్టార్ హీరోయిన్ అమలాపాల్‌కు రెండో పెళ్లికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే డైరెక్టర్‌ విజయ్‌ను పెళ్లాడిన మలయాళీ భామ మరోసారి పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతోంది. తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఓ వీడియోను షేర్ చేస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది. అయికే ఆమెను చేసుకోబోతున్న జగత్‌ ఎవరనే దానిపై నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మీకు కూడా అతను ఎవరు? ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. 

(ఇది చదవండి: అశ్వినిని తోసిపడేసిన అర్జున్‌.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్‌)

జగత్ దేశాయ్ ఎవరు?

అమలాపాల్‌ పెళ్లాడబోతున్న జగత్‌ దేశాయ్‌ ఎవరనే విషయంపై ఆమె ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో అతను ఏం చేస్తాడా? అని తెగ ఆరా తీస్తున్నారు. జగత్ దేశాయ్ గోవాలోని ఓ విల్లా గ్రూప్‌లో సేల్స్ హెడ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అమలాపాల్‌ సైతం గోవా బీచ్‌లో ఉన్న ఫోటోలు తన ఇన్‌స్టాలో పంచుకున్న సంగతి తెలిసిందే.  

ఈ ఏడాది జూన్‌ నుంచే అమలాపాల్‌ అతనితో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు డేటింగ్‌ను అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. జగత్  ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే అమలాపాల్ లైక్‌ కొట్టడం, కామెంట్స్ చేయడం కనిపించింది.. ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన రిలేషన్‌ గురించి బయటికి చెప్పలేదు. తాజాగా తన బర్త్‌డే రోజున అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. 

(ఇది చదవండి: మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement