అమలా.. ఆవో | Amala Paul heads to Bollywood | Sakshi
Sakshi News home page

అమలా.. ఆవో

Published Mon, Jul 23 2018 1:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Amala Paul heads to Bollywood - Sakshi

అమలాపాల్‌

సౌత్‌లో సక్సెస్‌ సాధించిన కథానాయిక అమలాపాల్‌.. ఇప్పుడు నార్త్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఆమెకు బీ టౌన్‌ నుంచి పిలుపు వచ్చింది. అర్జున్‌ రామ్‌పాల్‌ హీరోగా రూపొంద్నున్న ఓ హిందీ థ్రిల్లర్‌ మూవీలో అమలాపాల్‌ నటించనున్నారు. నరేశ్‌ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో స్టార్ట్‌ కానుందట. ‘‘బాలీవుడ్‌లో తొలి సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నరేశ్‌ చెప్పిన స్టోరీ నచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ హిమాలయాల్లో కూడా జరగనుంది.

నేను ఎగై్జట్‌ అయ్యే విషయాల్లో ఇదొకటి. ఈ సినిమా డిస్కషన్స్‌లో భాగంగా అర్జున్‌తో మాట్లాడుతున్నప్పుడు హిందీ భాషపై నాకు ఎంత గ్రిప్‌ ఉందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒక టైమ్‌లో నేను ఢిల్లీలో స్టే చేయడం వల్ల హిందీ భాషపై మంచి అవగాహన ఉంది. కానీ, ఇదేం పెద్ద ప్రాబ్లమ్‌ కాదు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్‌ నాకు ప్లస్‌ అవుతాయనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అమల. ట్రావెలింగ్‌ను అమల లైక్‌ చేస్తారు. అందుకేనేమో.. హిమాలయాల్లో షూటింగ్‌ అనగానే ఎగై్జట్‌ అయ్యుం టారని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement