ధనుష్ చాలా టిప్స్ చెప్పారు
నటుడు ధనుష్ షూటింగ్ స్పాట్‌లో చాలా టిప్స్ చెప్పారు అంటున్నారు నటి అమలాపాల్. ఈ అమ్మడు నిజంగా లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అనతికాలంలోనే ఒక సారి చుట్టొచ్చారు.
అయితే ఇటీవల ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించక పోవడంతో అమలాపాల్ పని అరుుపోరుుందనే ప్రచారం జోరందుకుంది. అలాంటి ప్రచారానికి చెక్ పెడుతూ ఈ కేరళ కుట్టి మళ్లీ మూడు భాషల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ఇటీవల పార్తిపన్ దర్శకత్వం వహిస్తున్న కథై, తిరైకథై వచనం ఇయక్కం చిత్రంలో ఆర్యతో కలిసి గెస్ట్ రోల్‌లో రొమాన్స్ చేసిన అమలాపాల్ తాజాగా సముద్రకని చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఈ బబ్లిగర్ల్‌తో చిన్న ఇంటర్వ్యూ.
ప్ర: సముద్ర కని దర్శకత్వం గురించి?
జ : చాలా సంతోషంగా ఉంది. కథానాయకి ప్రాముఖ్యత ఉన్న చిత్రం ఇది. నా బాడీ లాంగ్వేజ్, నటన, స్టరుుల్ అన్నీ మారిపోతాయి. 14, 25, 35 ఏళ్ల వయసు అంటూ మూడు గెటప్‌లతో కూడుకున్న పాత్రలో పోషించనున్నారు.
అందుకే ప్రస్తుతం 14 ఏళ్ల యువతి రూపంకోసం శారీరక వ్యాయామం చేస్తున్నాను. ఆ తర్వాతే 25 ఏళ్ల అమ్మగా కనిపించడానికి బరువు పెంచమన్నాను. ఆపై 35 ఏళ్ల స్త్రీగా మారాలి. నా సినీ జీవితంలో ఈ చిత్రం చాలా ముఖ్యం అయినదిగా నిలిచిపోతుంది. తొలుత తమిళంలో రూపొంది ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లో అనువాదం కానుంది.
ప్ర: ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం గురించి?
జ: ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టదారి చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో డాక్టర్ పాత్రను పోషిస్తున్నాను. నటనకు సంబంధించి ధనుష్ నాకు చాలా టిప్స్ చెప్పారు. నేను నటిస్తున్నప్పుడు స్పాట్‌లోనే ఉండి దీనికి ఇలా రియాక్షన్ ఇస్తే బాగుంటుందంటూ చెప్పేవారు.
ప్ర: బాలీవుడ్ ఆశ గురించి?
జ: కచ్చితంగా ఫలిస్తుంది. అయితే నేనే విషయంలోనూ తొందరపడను. అలాగే హిందీలో నటించినా తమిళ చిత్ర పరిశ్రమను మరువను.
ప్ర: వదంతుల పరంపర మాటేమిటి?
జ: వదంతుల గురించి తొలి రోజుల్లో చాలా బాధ కలిగింది. ఆ తరువాత అవి సంచలనం కోసం పుట్టే వదంతులని భావించి పట్టించుకోవడం మానేశాను.
ప్ర: నయనతార, లక్ష్మీ మీనన్‌లను పోటీగా భావిస్తున్నారా?
జ : వాళ్లను ఎందుకు పోటీగా భావించాలి? నేను తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన సమయంలో ఇక్కడే చాలా మంది మలయాళ హీరోయిన్లు ఉన్నారు. నేను వాళ్లకు పోటీ అయ్యానా? ఎంత మంది కొత్తవారు వచ్చినా ప్రతిభ ఉంటేనే నిలదొక్కుకోగలరు. నాకు ఏది లభించాలని రాసిపెట్టి ఉందో అదే అందుతుంది. నయనతార నాకు సీనియర్, లక్ష్మీ మీనన్ జూనియర్. వాళ్లు నటించాల్సిన పాత్రలో నేను, నేను నటించాల్సిన పాత్రలో వాళ్లు నటించలేరు. కాబట్టి ఎవరు వచ్చినా నాకెలాంటి బాధా ఉండదు.
ప్ర: అవార్డులపై గురి ఉందా?
జ: అవార్డులను మనసులో పెటుకుని నటించడం కుదరదు. తొలుత నా నటన ప్రేక్షకులకు నచ్చాలి. ఆ తరువాత ప్రశంసలు, అవార్డులు లభిస్తే సంతోషమే.
ప్ర: తదుపరి చిత్రాలు?
జ: తెలుగు ఒక చిత్రం చేస్తున్నాను. మలయాళంలోనూ మళ్లీ మోహన్‌లాల్‌కు జంటగా జోషి దర్శకత్వంలో నటిస్తున్నాను. కన్నడంలోను అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి తమిళం, మలయాళం తెలుగు చిత్రాలు మాత్రమే చాలనుకుంటున్నాను.