lucky heroine
-
ఆ లక్కీ హీరోయిన్ ఎమీనేనా?
నటనకు ప్రతిభ అవసరమేగానీ అంతకంటే ముఖ్యం లక్. అది ఎప్పుడు? ఎవర్ని వరిస్తుందో ఊహించడం కష్టం. ఇక హీరోయిన్లలో అదృష్టం తరుముతున్న నటీమణుల్లో ఎమీజాక్సన్ ఒకరు. ప్రస్తుతం పూర్తిగా తమిళ చిత్రాల హీరోయిన్గా మారిపోయిన ఎమీజాక్సన్ ధనుష్‌తో తంగమగన్, ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా గెత్తు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా దర్శకుడు శంకర్ దృష్టి ఈ ఇంగ్లిష్ బ్యూటీపై పడినట్లు సమాచారం. ఐ చిత్రంలో ఎమీ అందాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన శంకర్ మరోసారి ఎందిరన్-2కు ఆమె అందాలను వాడుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందిరన్ చిత్రంలో శిఖరాగ్ర గ్రాఫిక్స్‌తో పాటు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అందాలను మొత్తంగా ఉపయోగించుకున్న శంకర్ ఇప్పుడు ఎందిరన్-2 ను అంతకంటే బ్రహ్మాండంగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులోనూ కథానాయకుడు సూపర్‌స్టార్‌నే. ప్రతికథానాయకుడి పాత్రకే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. హీరో విక్రమ్ ఎందురన్-2లో రజనీ కాంత్‌కు విలన్‌గా మారనున్నారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్‌ను విలన్నిచేసే ప్రయత్నాలు శంకర్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సూపర్‌స్టార్ మన సూపర్‌స్టార్‌కు విలన్‌గా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా హీరోయిన్‌గానూ బాలీవుడ్ బ్యూటీస్ కత్రినాకైఫ్, దీపికపడుకొనే తదితర క్రేజీ భామల పేర్లు వినిపించాయి. తాజాగా ఐ ఫేమ్ ఎమీజాక్సన్ పేరు ప్రచారంలో నానుతోంది. ఎందిరన్-2 చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న ప్రారంభించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
లక్కీ హీరోయిన్
నటి త్రిష లక్కీ హీరోయిన్. ఈమెకు మూడు పదుల వయసు మీద పడినా, నటిగా దశాబ్దం దాటినా నేటి కీ హీరోయిన్గా ఒక బలమైన స్థానంలో కొనసాగుతుండడం విశేషమే. కొత్తనీరు రాక, పాత నీరు పోక సర్వసాధారణం అంటారు. అయితే ఎందరో యువ నటీమణులు కొత్త కొత్త అందాలతో విజృంభిస్తున్నా వారికి దీటుగా త్రిష తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేకాదు నటిగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. తమిళం, తెలుగు భాషల్లో నేటికీ ఒక చిత్రం తరువాత మరొక చిత్రం చేస్తూ గ్యాప్ అనే పదానికి తావు లేకుండా హీరోయిన్గా తన పయనాన్ని అప్రతిహతంగా సాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే తాజాగా శాండిల్‌వుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో అజిత్ లాంటి స్టార్ హీరో సరసన టాలీవుడ్లో లెజెండ్ నటుడు బాలకృష్ణకు జంటగా రొమాన్స్ చేస్తున్న త్రిష శాండిల్‌వుడ్‌లో టాప్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో నటిస్తున్నారు. ఈ లక్కీ హీరోయిన్ మాట్లాడుతూ నటిగా పదేళ్లు దాటినా ఇటు టాప్స్టార్స్తోను, అటు యువ హీరోల సరసన నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కన్నడ చిత్ర రంగ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ ఇన్నేళ్ల తరువాత కన్నడ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అది పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆయనకు జంటగా పవర్ చిత్రంలో నటిస్తున్నానని ఈ చిత్రం శాండిల్ వుడ్లో మంచి ఎంట్రీనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవర్ చిత్ర షూటింగ్లో పునీత్ రాజ్‌కుమార్ సహకారం మరువలేనన్నారు. ఇంతకుముందు కన్నడ చిత్రాల్లో ఎందుకు నటించలేదని అడుగుతున్నారని అయితే అలాంటి మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని వివరించారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం ఉంటుందని అయినా తానింతకాలం హీరోయిన్గా రాణిస్తుండడం తన అదృష్టం అని త్రిష పేర్కొన్నారు. -
ధనుష్ చాలా టిప్స్ చెప్పారు
నటుడు ధనుష్ షూటింగ్ స్పాట్లో చాలా టిప్స్ చెప్పారు అంటున్నారు నటి అమలాపాల్. ఈ అమ్మడు నిజంగా లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అనతికాలంలోనే ఒక సారి చుట్టొచ్చారు. అయితే ఇటీవల ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించక పోవడంతో అమలాపాల్ పని అరుుపోరుుందనే ప్రచారం జోరందుకుంది. అలాంటి ప్రచారానికి చెక్ పెడుతూ ఈ కేరళ కుట్టి మళ్లీ మూడు భాషల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ఇటీవల పార్తిపన్ దర్శకత్వం వహిస్తున్న కథై, తిరైకథై వచనం ఇయక్కం చిత్రంలో ఆర్యతో కలిసి గెస్ట్ రోల్లో రొమాన్స్ చేసిన అమలాపాల్ తాజాగా సముద్రకని చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఈ బబ్లిగర్ల్తో చిన్న ఇంటర్వ్యూ. ప్ర: సముద్ర కని దర్శకత్వం గురించి? జ : చాలా సంతోషంగా ఉంది. కథానాయకి ప్రాముఖ్యత ఉన్న చిత్రం ఇది. నా బాడీ లాంగ్వేజ్, నటన, స్టరుుల్ అన్నీ మారిపోతాయి. 14, 25, 35 ఏళ్ల వయసు అంటూ మూడు గెటప్‌లతో కూడుకున్న పాత్రలో పోషించనున్నారు. అందుకే ప్రస్తుతం 14 ఏళ్ల యువతి రూపంకోసం శారీరక వ్యాయామం చేస్తున్నాను. ఆ తర్వాతే 25 ఏళ్ల అమ్మగా కనిపించడానికి బరువు పెంచమన్నాను. ఆపై 35 ఏళ్ల స్త్రీగా మారాలి. నా సినీ జీవితంలో ఈ చిత్రం చాలా ముఖ్యం అయినదిగా నిలిచిపోతుంది. తొలుత తమిళంలో రూపొంది ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లో అనువాదం కానుంది. ప్ర: ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం గురించి? జ: ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టదారి చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో డాక్టర్ పాత్రను పోషిస్తున్నాను. నటనకు సంబంధించి ధనుష్ నాకు చాలా టిప్స్ చెప్పారు. నేను నటిస్తున్నప్పుడు స్పాట్లోనే ఉండి దీనికి ఇలా రియాక్షన్ ఇస్తే బాగుంటుందంటూ చెప్పేవారు. ప్ర: బాలీవుడ్ ఆశ గురించి? జ: కచ్చితంగా ఫలిస్తుంది. అయితే నేనే విషయంలోనూ తొందరపడను. అలాగే హిందీలో నటించినా తమిళ చిత్ర పరిశ్రమను మరువను. ప్ర: వదంతుల పరంపర మాటేమిటి? జ: వదంతుల గురించి తొలి రోజుల్లో చాలా బాధ కలిగింది. ఆ తరువాత అవి సంచలనం కోసం పుట్టే వదంతులని భావించి పట్టించుకోవడం మానేశాను. ప్ర: నయనతార, లక్ష్మీ మీనన్‌లను పోటీగా భావిస్తున్నారా? జ : వాళ్లను ఎందుకు పోటీగా భావించాలి? నేను తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన సమయంలో ఇక్కడే చాలా మంది మలయాళ హీరోయిన్లు ఉన్నారు. నేను వాళ్లకు పోటీ అయ్యానా? ఎంత మంది కొత్తవారు వచ్చినా ప్రతిభ ఉంటేనే నిలదొక్కుకోగలరు. నాకు ఏది లభించాలని రాసిపెట్టి ఉందో అదే అందుతుంది. నయనతార నాకు సీనియర్, లక్ష్మీ మీనన్ జూనియర్. వాళ్లు నటించాల్సిన పాత్రలో నేను, నేను నటించాల్సిన పాత్రలో వాళ్లు నటించలేరు. కాబట్టి ఎవరు వచ్చినా నాకెలాంటి బాధా ఉండదు. ప్ర: అవార్డులపై గురి ఉందా? జ: అవార్డులను మనసులో పెటుకుని నటించడం కుదరదు. తొలుత నా నటన ప్రేక్షకులకు నచ్చాలి. ఆ తరువాత ప్రశంసలు, అవార్డులు లభిస్తే సంతోషమే. ప్ర: తదుపరి చిత్రాలు? జ: తెలుగు ఒక చిత్రం చేస్తున్నాను. మలయాళంలోనూ మళ్లీ మోహన్‌లాల్‌కు జంటగా జోషి దర్శకత్వంలో నటిస్తున్నాను. కన్నడంలోను అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి తమిళం, మలయాళం తెలుగు చిత్రాలు మాత్రమే చాలనుకుంటున్నాను.