ఆ లక్కీ హీరోయిన్ ఎమీనేనా? | Amy Jackson with Rajinikanth in Shankar's Robot 2 | Sakshi
Sakshi News home page

ఆ లక్కీ హీరోయిన్ ఎమీనేనా?

Published Tue, Oct 13 2015 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

ఆ లక్కీ హీరోయిన్ ఎమీనేనా?

ఆ లక్కీ హీరోయిన్ ఎమీనేనా?

నటనకు ప్రతిభ అవసరమేగానీ అంతకంటే ముఖ్యం లక్. అది ఎప్పుడు? ఎవర్ని వరిస్తుందో ఊహించడం కష్టం. ఇక హీరోయిన్లలో అదృష్టం తరుముతున్న నటీమణుల్లో ఎమీజాక్సన్ ఒకరు. ప్రస్తుతం పూర్తిగా తమిళ చిత్రాల హీరోయిన్‌గా మారిపోయిన ఎమీజాక్సన్ ధనుష్‌తో తంగమగన్, ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా గెత్తు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా దర్శకుడు శంకర్ దృష్టి ఈ ఇంగ్లిష్ బ్యూటీపై పడినట్లు సమాచారం. ఐ చిత్రంలో ఎమీ అందాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన శంకర్ మరోసారి ఎందిరన్-2కు ఆమె అందాలను వాడుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎందిరన్ చిత్రంలో శిఖరాగ్ర గ్రాఫిక్స్‌తో పాటు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అందాలను మొత్తంగా ఉపయోగించుకున్న శంకర్ ఇప్పుడు ఎందిరన్-2 ను అంతకంటే బ్రహ్మాండంగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులోనూ కథానాయకుడు సూపర్‌స్టార్‌నే. ప్రతికథానాయకుడి పాత్రకే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. హీరో విక్రమ్ ఎందురన్-2లో రజనీ కాంత్‌కు విలన్‌గా మారనున్నారనే ప్రచారం జరిగింది.

ఆ తరువాత బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ను విలన్‌నిచేసే ప్రయత్నాలు శంకర్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సూపర్‌స్టార్ మన సూపర్‌స్టార్‌కు విలన్‌గా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా హీరోయిన్‌గానూ బాలీవుడ్ బ్యూటీస్ కత్రినాకైఫ్, దీపికపడుకొనే తదితర క్రేజీ భామల పేర్లు వినిపించాయి. తాజాగా ఐ ఫేమ్ ఎమీజాక్సన్ పేరు ప్రచారంలో నానుతోంది. ఎందిరన్-2 చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న ప్రారంభించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement